చిలుకూరి నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18: పంక్తి 18:
# సంస్కృతలోకోక్తులు
# సంస్కృతలోకోక్తులు
# ఉపనిషత్తులు
# ఉపనిషత్తులు
# ఉమర్ ఖయాం రుబాయతు
# ఉమర్ ఖయాం రుబాయతు (ముత్యాల సరములు)
# ముసలమ్మ (ఒక వీరకాపుపడుచు)
# ముసలమ్మ (ఒక వీరకాపుపడుచు)
# అశ్వత్థామ (సంస్కృత నాటకం)
# అశ్వత్థామ (సంస్కృత నాటకం)
పంక్తి 27: పంక్తి 27:
# నాటకనాటకము
# నాటకనాటకము
# నందుడు (మాలభక్తుడు) (నాటకం)
# నందుడు (మాలభక్తుడు) (నాటకం)
# Songs of Tyagaraja
# Songs of Tyagaraja



==మూలాలు==
==మూలాలు==

12:38, 19 ఆగస్టు 2014 నాటి కూర్పు

చిలుకూరి నారాయణరావు (1889 - 1951) భాషావేత్త, చరిత్రకారుడు మరియు సంస్కృతాంధ్ర పండితుడు. ఈయన విశాఖపట్నం జిల్లా, పొందూరు సమీపంలోని ఆనందపురం లో 1889 ఆగస్టునెల తొమ్మిదో తేదీన జన్మించాడు. తండ్రి భీమాచారి. తల్లి లక్ష్మమ్మ. మాతృభాష కన్నడం. ఈయన శ్రీకాకుళం మునిసిపల్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసి, పర్లాకిమిడి మరియు విజయనగరం ల లోని మహారాజా కళాశాల లో చదివి పట్టభద్రులయ్యాడు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి తెలుగు మరియు కన్నడం భాషలలో ఎం.ఏ. పట్టా పొందాడు. పదకొండవ శతాబ్దం నాటి ఆంధ్ర భాష గురించి పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందాడు. ఉత్తర సర్కారు జిల్లాలలో ఇంగ్లీషు బోధన విధానం ప్రచారం చేయటానికి జె.ఎ.యేట్స్ తో కలిసి కొంతకాలం పాఠశాల పరీక్షకుడుగా పనిచేశాడు.తరువాత అనంతపురం దత్తమండల కళాశాల(తరువాత కాలంలో గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ)లో ఆంద్రోపన్యాసకుడిగా చాలాకాలం పనిచేశాడు. ఈయన ఆంధ్ర విశ్వకళా పరిషత్తు చే 'కళాప్రపూర్ణ' బిరుదును, కాశీ సంస్కృత విద్యాపీఠంచే 'మహోపాధ్యాయ' బిరుదును పొందాడు. 'ఆంధ్ర బెర్నార్డ్ షా' అనే బిరుదుకూడ ఇతనికి వున్నది. ఇతడు 1951 జూన్‌ నెల 22న పుట్ట కురుపు వ్యాధి వలన చెన్నై లో పరమపదించాడు.

చిలుకూరి నారాయణరావు గిడుగు రామ్మూర్తి తో పాటు వ్యావహారిక భాషా ఉద్యమ ప్రచారానికి విశేష కృషి చేశాడు. 1933 లో జరిగిన అభినవాంధ్ర కవిపండిత మహాసభ, నారాయణరావు అధ్యక్షతన ఆధునిక వ్యవహారిక భాషనే బోధన భాషగా ఉపయోగించాలని తీర్మానించింది. ఆలంకారికులు, వైయాకరణుల మధ్యలో తెలుగు కవులు నలిగిపోయారని భావించాడు. అందుకే 1937లో వెలువరించిన ఆంధ్ర భాషా చరిత్రని అప్పట్లోనే వాడుక భాషలో రాశాడు.

దత్తమండలానికి రాయలసీమ అన్న పేరును చిలుకూరి నారాయణరావు సూచించాడని, గాడిచర్ల హరిసర్వోత్తమరావు సూచించాడని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. హరిసర్వోత్తమరావు జీవితచరిత్ర శ్రీ సర్వోత్తమజీవితంలో గ్రంథకర్త ఎం.వీరభద్రరావు, రాయలసీమ పేరును హరిసర్వోత్తమరావు సూచించాడని వ్రాసినా, 1946లో ఒక రేడియో ప్రసంగంలో చిలుకూరి నారాయణరావు తాను రాయలసీమ అన్నపేరును సూచించినందుకు గర్వపడుతున్నానని చెప్పుకోవటాన్ని ఎవరూ ఖండించలేదు. కాబట్టి ఈ పేరును చిలుకూరి నారాయణరావే పునరుద్ధరించి ఉంటాడని అనుకోవచ్చు[1] రాయలసీమ పేరును సూచించిన నారాయణరావు దాన్ని పప్పూరు రామాచార్యుల చే ప్రతిపాదింపజేశారని భావిస్తున్నారు.

విశేషాలు

  • మద్రాసు విశ్వవిద్యాలయంలో 1930 ఫిబ్రవరి ఆరోతేదీన తొలిసారిగా తెలుగు సాహిత్యంలో పిహెచ్‌.డి. చేసిన పండితుడు.
  • 240 గ్రంథాలు వ్రాశాడు. ఒకలక్షా యాభైవేల తెలుగు సామెతలు సేకరిస్తే ఎనభైవేలే మిగిలాయి.
  • నవ్య సాహిత్య పరిషత్తు తొలి అధ్యక్షుడు, శ్రీకృష్ణదేవరాయ విద్యాపరిషత్తు వ్యవస్థాపకాధ్యక్షుడు.
  • తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలు ద్రావిడ భాషలని కాల్డ్‌ వెల్‌ పండితుని సిద్ధాంతంతో చిలుకూరి విభేదించాడు. తమిళ, మలయాళ భాషలకు సన్నిహిత సంబంధం ఉంది, తెలుగుభాషకు తక్కిన ద్రావిడ భాషలతో సంబంధం లేదు, స్వతంత్రమైన స్థానం ఉందన్న గ్రియర్‌సన్‌ వాదనతో చిలుకూరి ఏకీభవించాడు.
  • తెలుగులోకి ఖురాన్ గ్రంథాన్ని అనువదించిన తొలివ్యక్తి చిలుకూరి నారాయణ రావు. మొదటి "తెలుగు కురాను"(1925), రెండవ ముద్రణ 1938 పీఠికలో ఆయన ఇలా అన్నాడు "ఎన్నియో సమయములందు హిందువులకును ముస్లిములకును కలిగిన కలహములవలన ఆపద రానున్నపుడు ఈ యాంధ్రానువాదము ఈ రెండు మతములవారికిని సామరస్యమును కుదిరించినది. ఇదియే గ్రంథకర్తకును, గ్రంథ ప్రకాశకులకును బహుమానము".
  • ఉమర్ ఖయ్యూమ్ వ్రాసిన రుబాయత్‌లను ముత్యాలసరములు అనే పేరుతో తెలుగులో వ్రాశాడు.

రచనలు

  1. కురాను షరీఫు
  2. అశోకుని ధర్మశాస్త్రములు
  3. సంస్కృతలోకోక్తులు
  4. ఉపనిషత్తులు
  5. ఉమర్ ఖయాం రుబాయతు (ముత్యాల సరములు)
  6. ముసలమ్మ (ఒక వీరకాపుపడుచు)
  7. అశ్వత్థామ (సంస్కృత నాటకం)
  8. అశ్వత్థామ (తెలుగు నాటకం)
  9. అంబ(మొండి శిఖండి) (నాటకం)
  10. ఆచ్చి (కాపువలపు) (నాటకం)
  11. పెండ్లి (హాస్యము)
  12. నాటకనాటకము
  13. నందుడు (మాలభక్తుడు) (నాటకం)
  14. Songs of Tyagaraja

మూలాలు