చిలుకూరి నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''చిలుకూరి నారాయణరావు''' ([[1889]] - [[1952]]) ప్రముఖ రచయిత మరియు బహుగ్రంథకర్త. వీరు విశాఖపట్నం జిల్లా పొందూరు సమీపంలోని [[ఆనందపురం]]లో 1889 ఆగస్టునెల తొమ్మిదో తేదీన జన్మించారు. తండ్రి భీమాచారి. తల్లి లక్ష్మమ్మ. మాతృభాష కన్నడం. వీరు శ్రీకాకుళం మునిసిపల్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసి, పర్లాకిమిడి మరియు విజయనగరం లోని [[మహారాజా కళాశాల]]లో చదివి పట్టభద్రులయ్యారు. [[మద్రాసు విశ్వవిద్యాలయం]] నుండి తెలుగు మరియు కన్నడం భాషలలో ఎం.ఏ. పట్టా పొందారు. పదకొండవ శతాబ్దం నాటి ఆంధ్ర భాష గురించి పరిశోధన చేసి [[డాక్టరేట్]] పట్టా పొందారు. ఉత్తర సర్కారు జిల్లాలలో ఇంగ్లీషు బోధన విధానం ప్రచారం చేయటానికి [[జె.ఎ.యేట్స్]] తో కలిసి కొంతకాలం పాఠశాల పరీక్షకులుగా పనిచేశారు.వీరు ఆంధ్ర విశ్వకళా పరిషత్తుచే '[[కళాప్రపూర్ణ]]' బిరుదును, కాశీ సంస్కృత విద్యాపీఠంచే 'మహోపాధ్యాయ' బిరుదును పొందారు.వీరు 1951 జూన్‌ నెల 22న [[పుట్ట కురుపు]] వ్యాధి వలన [[చెన్నై]] లో పరమపదించారు.
'''చిలుకూరి నారాయణరావు''' ([[1889]] - [[1952]]) భాషావేత్త, చరిత్రకారుడు మరియు సంస్కృతాంధ్ర పండితుడు. వీరు [[విశాఖపట్నం జిల్లా]], [[పొందూరు]] సమీపంలోని [[ఆనందపురం]]లో 1889 ఆగస్టునెల తొమ్మిదో తేదీన జన్మించారు. తండ్రి భీమాచారి. తల్లి లక్ష్మమ్మ. మాతృభాష [[కన్నడం]]. వీరు శ్రీకాకుళం మునిసిపల్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసి, [[పర్లాకిమిడి]] మరియు [[విజయనగరం]]లోని [[మహారాజా కళాశాల]]లో చదివి పట్టభద్రులయ్యారు. [[మద్రాసు విశ్వవిద్యాలయం]] నుండి తెలుగు మరియు కన్నడం భాషలలో ఎం.ఏ. పట్టా పొందారు. పదకొండవ శతాబ్దం నాటి ఆంధ్ర భాష గురించి పరిశోధన చేసి [[డాక్టరేట్]] పట్టా పొందారు. ఉత్తర సర్కారు జిల్లాలలో ఇంగ్లీషు బోధన విధానం ప్రచారం చేయటానికి [[జె.ఎ.యేట్స్]] తో కలిసి కొంతకాలం పాఠశాల పరీక్షకులుగా పనిచేశారు.వీరు [[ఆంధ్ర విశ్వకళా పరిషత్తు]]చే '[[కళాప్రపూర్ణ]]' బిరుదును, కాశీ సంస్కృత విద్యాపీఠంచే 'మహోపాధ్యాయ' బిరుదును పొందారు. వీరు 1951 జూన్‌ నెల 22న [[పుట్ట కురుపు]] వ్యాధి వలన [[చెన్నై]] లో పరమపదించారు.

చిలుకూరి నారాయణరావు [[గిడుగు రామ్మూర్తి]]తో పాటు వ్యావహారిక భాషా ఉద్యమ ప్రచారానికి విశేష కృషి చేశాడు. 1933లో జరిగిన అభినవాంధ్ర కవిపండిత మహాసభ, నారాయణరావు అధ్యక్షతన ఆధునిక వ్యవహారిక భాషనే బోధనా భాషగా ఉపయోగించాలని తీర్మానించింది. అలంకారికులు, వైయాకరణుల మధ్యలో తెలుగు కవులు నలిగిపోయారని భావించాడు. అందుకే 1937లో వెలువరించిన ''ఆంధ్ర భాషా చరిత్ర''ని అప్పట్లోనే వాడుక భాషలో రాశారు.

దత్తమండలానికి [[రాయలసీమ]] అన్న పేరును చిలుకూరి నారాయణరావు సూచించాడని, [[గాడిచర్ల హరిసర్వోత్తమరావు]] సూచించాడని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. హరిసర్వోత్తమరావు జీవితచరిత్ర ''శ్రీ సర్వోత్తమజీవితం''లో గ్రంథకర్త ఎం.వీరభద్రరావు, రాయలసీమ పేరును హరిసర్వోత్తమరావు సూచించాడని వ్రాసినా, 1946లో ఒక రేడియో ప్రసంగంలో చిలుకూరి నారాయణరావు తాను రాయలసీమ అన్నపేరును సూచించినందుకు గర్వపడుతున్నానని చెప్పుకోవటాన్ని ఎవరూ ఖండించలేదు. కాబట్టి ఈ పేరును చిలుకూరి నారాయణరావే పునురుద్ధరించి ఉంటారని అనుకోవచ్చు<ref>[http://books.google.com/books?id=I3C11beCHF0C&pg=PA11&dq=chilukuri+narayana+rao#v=onepage&q=chilukuri%20narayana%20rao&f=false Rayalaseema during colonial times: a study in Indian nationalism By P. Yanadi Raju]</ref> రాయలసీమ పేరును సూచించిన నారాయణరావు దాన్ని [[పప్పూరు రామాచార్యులు|పప్పూరు రామాచార్యుల]]చే ప్రతిపాదింపజేశారని భావిస్తున్నారు.

==విశేషాలు==
==విశేషాలు==
*మద్రాసు విశ్వవిద్యాలయంలో 1930 ఫిబ్రవరి ఆరోతేదీన తొలిసారిగా తెలుగు సాహిత్యంలో పిహెచ్‌.డి. చేసిన పండితుడు.
*మద్రాసు విశ్వవిద్యాలయంలో 1930 ఫిబ్రవరి ఆరోతేదీన తొలిసారిగా తెలుగు సాహిత్యంలో పిహెచ్‌.డి. చేసిన పండితుడు.
*రాయలసీమకు ఆ పేరుపెట్టి,దాన్ని పప్పూరు రామాచార్యులచేత ప్రతిపాదింపచేశారు
*240 గ్రంథాలు రాశారు.ఒకలక్షా యాభైవేల తెలుగు సామెతలు సేకరిస్తే ఎనభైవేలే మిగిలాయి.
*240 గ్రంథాలు రాశారు.ఒకలక్షా యాభైవేల తెలుగు సామెతలు సేకరిస్తే ఎనభైవేలే మిగిలాయి.
*నవ్య సాహిత్య పరిషత్తు తొలి అధ్యక్షులు,శ్రీకృష్ణదేవరాయ విద్యాపరిషత్తు వ్యవస్థాపకాధ్యక్షులు.
*నవ్య సాహిత్య పరిషత్తు తొలి అధ్యక్షులు,శ్రీకృష్ణదేవరాయ విద్యాపరిషత్తు వ్యవస్థాపకాధ్యక్షులు.
*గిడుగు రామ్మూర్తిగారి వ్యావహారిక భాషా ఉద్యమానికి సహకారం అందించారు
* అలంకారికులు, వైయాకరణుల మధ్యలో తెలుగు కవులు నలిగిపోయారనేది చిలుకూరి అభిప్రాయం.
* ''ఆంధ్ర భాషా చరిత్ర''ని అప్పట్లోనే వాడుక భాషలో రాశారు.
* తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలు ద్రావిడ భాషలని కాల్డ్‌ వెల్‌ పండితుని సిద్ధాంతంతో చిలుకూరి విభేదించారు.తమిళ, మలయాళ భాషలకు సన్నిహిత సంబంధం ఉంది,తెలుగుభాషకు తక్కిన ద్రావిడ భాషలతో సంబంధం లేదు,స్వతంత్రమైన స్థానం ఉందన్న గ్రియర్‌సన్‌ వాదనతో చిలుకూరి ఏకీభవించారు.
* తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలు ద్రావిడ భాషలని కాల్డ్‌ వెల్‌ పండితుని సిద్ధాంతంతో చిలుకూరి విభేదించారు.తమిళ, మలయాళ భాషలకు సన్నిహిత సంబంధం ఉంది,తెలుగుభాషకు తక్కిన ద్రావిడ భాషలతో సంబంధం లేదు,స్వతంత్రమైన స్థానం ఉందన్న గ్రియర్‌సన్‌ వాదనతో చిలుకూరి ఏకీభవించారు.
*తెలుగులోకి [[ఖురాన్]] గ్రంధాన్ని అనువదించిన తొలివ్యక్తి.
*తెలుగులోకి [[ఖురాన్]] గ్రంధాన్ని అనువదించిన తొలివ్యక్తి.

==మూలాలు==
{{మూలాలజాబితా}}


[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]

11:33, 3 సెప్టెంబరు 2010 నాటి కూర్పు

చిలుకూరి నారాయణరావు (1889 - 1952) భాషావేత్త, చరిత్రకారుడు మరియు సంస్కృతాంధ్ర పండితుడు. వీరు విశాఖపట్నం జిల్లా, పొందూరు సమీపంలోని ఆనందపురంలో 1889 ఆగస్టునెల తొమ్మిదో తేదీన జన్మించారు. తండ్రి భీమాచారి. తల్లి లక్ష్మమ్మ. మాతృభాష కన్నడం. వీరు శ్రీకాకుళం మునిసిపల్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసి, పర్లాకిమిడి మరియు విజయనగరంలోని మహారాజా కళాశాలలో చదివి పట్టభద్రులయ్యారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి తెలుగు మరియు కన్నడం భాషలలో ఎం.ఏ. పట్టా పొందారు. పదకొండవ శతాబ్దం నాటి ఆంధ్ర భాష గురించి పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. ఉత్తర సర్కారు జిల్లాలలో ఇంగ్లీషు బోధన విధానం ప్రచారం చేయటానికి జె.ఎ.యేట్స్ తో కలిసి కొంతకాలం పాఠశాల పరీక్షకులుగా పనిచేశారు.వీరు ఆంధ్ర విశ్వకళా పరిషత్తుచే 'కళాప్రపూర్ణ' బిరుదును, కాశీ సంస్కృత విద్యాపీఠంచే 'మహోపాధ్యాయ' బిరుదును పొందారు. వీరు 1951 జూన్‌ నెల 22న పుట్ట కురుపు వ్యాధి వలన చెన్నై లో పరమపదించారు.

చిలుకూరి నారాయణరావు గిడుగు రామ్మూర్తితో పాటు వ్యావహారిక భాషా ఉద్యమ ప్రచారానికి విశేష కృషి చేశాడు. 1933లో జరిగిన అభినవాంధ్ర కవిపండిత మహాసభ, నారాయణరావు అధ్యక్షతన ఆధునిక వ్యవహారిక భాషనే బోధనా భాషగా ఉపయోగించాలని తీర్మానించింది. అలంకారికులు, వైయాకరణుల మధ్యలో తెలుగు కవులు నలిగిపోయారని భావించాడు. అందుకే 1937లో వెలువరించిన ఆంధ్ర భాషా చరిత్రని అప్పట్లోనే వాడుక భాషలో రాశారు.

దత్తమండలానికి రాయలసీమ అన్న పేరును చిలుకూరి నారాయణరావు సూచించాడని, గాడిచర్ల హరిసర్వోత్తమరావు సూచించాడని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. హరిసర్వోత్తమరావు జీవితచరిత్ర శ్రీ సర్వోత్తమజీవితంలో గ్రంథకర్త ఎం.వీరభద్రరావు, రాయలసీమ పేరును హరిసర్వోత్తమరావు సూచించాడని వ్రాసినా, 1946లో ఒక రేడియో ప్రసంగంలో చిలుకూరి నారాయణరావు తాను రాయలసీమ అన్నపేరును సూచించినందుకు గర్వపడుతున్నానని చెప్పుకోవటాన్ని ఎవరూ ఖండించలేదు. కాబట్టి ఈ పేరును చిలుకూరి నారాయణరావే పునురుద్ధరించి ఉంటారని అనుకోవచ్చు[1] రాయలసీమ పేరును సూచించిన నారాయణరావు దాన్ని పప్పూరు రామాచార్యులచే ప్రతిపాదింపజేశారని భావిస్తున్నారు.

విశేషాలు

  • మద్రాసు విశ్వవిద్యాలయంలో 1930 ఫిబ్రవరి ఆరోతేదీన తొలిసారిగా తెలుగు సాహిత్యంలో పిహెచ్‌.డి. చేసిన పండితుడు.
  • 240 గ్రంథాలు రాశారు.ఒకలక్షా యాభైవేల తెలుగు సామెతలు సేకరిస్తే ఎనభైవేలే మిగిలాయి.
  • నవ్య సాహిత్య పరిషత్తు తొలి అధ్యక్షులు,శ్రీకృష్ణదేవరాయ విద్యాపరిషత్తు వ్యవస్థాపకాధ్యక్షులు.
  • తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలు ద్రావిడ భాషలని కాల్డ్‌ వెల్‌ పండితుని సిద్ధాంతంతో చిలుకూరి విభేదించారు.తమిళ, మలయాళ భాషలకు సన్నిహిత సంబంధం ఉంది,తెలుగుభాషకు తక్కిన ద్రావిడ భాషలతో సంబంధం లేదు,స్వతంత్రమైన స్థానం ఉందన్న గ్రియర్‌సన్‌ వాదనతో చిలుకూరి ఏకీభవించారు.
  • తెలుగులోకి ఖురాన్ గ్రంధాన్ని అనువదించిన తొలివ్యక్తి.

మూలాలు