Jump to content

బందుల వర్ణపుర

వికీపీడియా నుండి
బందుల వర్ణపుర
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
బందుల వర్ణపుర
పుట్టిన తేదీ1 March 1953
రంబుక్కన, శ్రీలంక
మరణించిన తేదీ2021 అక్టోబరు 18(2021-10-18) (వయసు 68)
కొలంబో, శ్రీలంక
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రఆల్ రౌండర్
బంధువులు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 10)1982 ఫిబ్రవరి 17 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1982 సెప్టెంబరు 17 - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 11)1975 జూన్ 7 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే1982 సెప్టెంబరు 26 - ఇండియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1990–1991Bloomfield
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 4 12 57 33
చేసిన పరుగులు 96 180 2,280 579
బ్యాటింగు సగటు 12.00 15.00 25.05 19.30
100లు/50లు 0/0 0/1 2/10 1/3
అత్యుత్తమ స్కోరు 38 77 154 106
వేసిన బంతులు 90 414 1,211 1,018
వికెట్లు 0 8 13 21
బౌలింగు సగటు 39.50 48.30 37.42
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/42 2/33 3/21
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 5/– 23/– 13/–
మూలం: Cricinfo, 2009 జనవరి 31

బందుల వర్ణపుర (1953, మార్చి 1 - 2021, అక్టోబరు 18) శ్రీలంక క్రికెట్ ఆటగాడు, శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్. 1975 నుండి 1982 వరకు తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు, పన్నెండు వన్డే ఇంటర్నేషనల్స్ వన్డే ఆడాడు.[1] కుడిచేతి ఓపెనింగ్ బ్యాట్స్‌మన్, కుడిచేతి మీడియం పేస్ బౌలర్ గా రాణించాడు.[2]

శ్రీలంక మొదటి టెస్ట్ మ్యాచ్‌కు వర్ణపుర కెప్టెన్‌గా వ్యవహరించాడు. మొదటి బంతిని ఎదుర్కొని తన జట్టుకు మొదటి పరుగు చేశాడు.[3] శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక తరఫున రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ను ప్రారంభించి, బ్యాటింగ్‌ను ప్రారంభించిన అరుదైన ఘనతను, ఖ్యాతిని పొందాడు.[4]

ఇతను ఆడిన అన్ని టెస్టుల్లోనూ శ్రీలంకకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కానీ, ఒక్క మ్యాచ్ లో కూడా తన జట్టును గెలిపించలేకపోయాడు. ఇతను కెప్టెన్సీ వహించిన తొలి వన్డే మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించింది. వన్డే క్రికెట్‌లో ఒక అర్ధ సెంచరీ సాధించాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

బందుల వర్ణపుర 1953, మార్చి 1న శ్రీలంకలోని రంబుక్కనలో జన్మించాడు.[5] ఇతను శ్రీలంక జాతీయ క్రికెట్ జట్టుకు ఆడిన మలిందా వర్ణపుర మేనల్లుడు.[6] కొలంబోలోని నలంద కళాశాలలో చదివాడు.[7] 1971లో నలంద కాలేజ్ కొలంబో మొదటి XI క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. వర్ణపుర ఐసీసీ మ్యాచ్ రిఫరీగా, అంపైర్‌గా పనిచేశాడు. సర్టిఫైడ్ క్రికెట్ కోచ్‌గా కూడా ఉన్నాడు. 1994లో డైరెక్టర్ ఆఫ్ కోచింగ్‌గా నియమించబడటానికి ముందు శ్రీలంక జాతీయ క్రికెట్ జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. 2001లో శ్రీలంక క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ అయ్యాడు.[8] 2008లో రాజీనామా చేశాడు.[9] ఆసియా క్రికెట్ కౌన్సిల్ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా ఉన్నాడు.[8] 2001లో రెండు టెస్టులు, మూడు వన్డేలకు కూడా రిఫరీగా వ్యవహరించాడు.[5]

దేశీయ క్రికెట్

[మార్చు]

1970లో ఇండియన్ యూనివర్శిటీలపై ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. 1973-74 సీజన్‌లో పాకిస్తాన్ అండర్-25స్‌పై 154 పరుగులతో మెరుగ్గా కొట్టినందుకు ఫస్ట్-క్లాస్ స్థాయిలో ప్రాముఖ్యతను పొందాడు.[4]

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

టెస్ట్ కెరీర్

[మార్చు]

వర్ణపుర మొదటి శ్రీలంక టెస్ట్ క్రికెట్ క్యాప్,[10] 1982లో ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక జాతీయ క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశాన్ని పొందాడు. ఐదు రోజుల మ్యాచ్ 1982 ఫిబ్రవరి 17న పైకియసోతి శరవణముట్టు స్టేడియంలో ప్రారంభమైంది. వర్ణపుర, ఇంగ్లీష్ కెప్టెన్ కీత్ ఫ్లెచర్ ఉదయం టాస్ చేశారు, వర్ణపుర గెలిచింది. అతను మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సిదత్ వెట్టిమునితో కలిసి శ్రీలంకకు బ్యాటింగ్ ప్రారంభించాడు. మ్యాచ్ మొదటి డెలివరీని ఎదుర్కొన్నాడు, మొదటి టెస్ట్ రన్ చేశాడు. అయితే, అతను కేవలం 2 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు, బాబ్ విల్లీస్ బౌలింగ్‌లో డేవిడ్ గోవర్‌కి క్యాచ్ ఇచ్చాడు.[3][11] శ్రీలంక తరఫున టెస్ట్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన మొదటి ఆటగాడు అతను బ్యాటింగ్ చేసిన 35 నిమిషాల్లో 25 బంతులు ఎదుర్కొన్నాడు. శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో, వర్ణపుర 155 బంతుల్లో 38 పరుగులు చేశాడు - ఆ ఇన్నింగ్స్‌లో రెండో అత్యధిక స్కోరు. ఇంగ్లాండ్ మ్యాచ్ గెలిచింది,[12] వర్ణపుర 38 అతని అత్యధిక టెస్ట్ వ్యక్తిగత స్కోరుగా మిగిలిపోయింది.[13]

వన్డే కెరీర్

[మార్చు]

వర్ణపుర 11వ శ్రీలంక వన్డే క్రికెట్ క్యాప్.[14] 1975, జూన్ 7న వెస్టిండీస్‌తో వన్డే అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. 1975 క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్‌లో అది శ్రీలంక మొదటి వన్డే. ఆ మ్యాచ్‌లో అతను 8 పరుగులకే ఔటయ్యాడు, శ్రీలంక ఓడిపోయింది.[15] 54 బంతుల్లో 8 పరుగులు చేసి వన్డేలో అరంగేట్రం చేసాడు, వన్డేలో బౌండరీ సాధించిన మొదటి శ్రీలంక బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు అలాగే ప్రపంచ కప్ మ్యాచ్‌లో శ్రీలంక తరపున ఒక బ్యాట్స్‌మెన్ సాధించిన మొదటి బౌండరీగా నిలిచాడు.[16]

విరమణ తరువాత

[మార్చు]

విరమణ తరువాత ఇతను శ్రీలంక జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. నలంద కళాశాలలో మహేల జయవర్ధనేకు శిక్షణ ఇచ్చాడు. రస్సెల్ ఆర్నాల్డ్ కు అండర్-19 జాతీయ కోచ్‌గా కూడా ఉన్నాడు. నిషేధం ముగిసిన తర్వాత 1991లో బ్లూమ్‌ఫీల్డ్ క్లబ్‌లో నిర్వాహకుడు అయ్యాడు. 1982లో శ్రీలంక దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా పనిచేశాడు.[17]

మరణం

[మార్చు]

మధుమేహం సమస్య కారణంగా 2021 అక్టోబరులో ఆసుపత్రిలో చేరాడు. ఆ సమయంలో వైద్యులు ఇతని ఎడమ కాలును తొలగించారు.[18][19] కొలంబోలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2021, అక్టోబరు 18న మరణించాడు.[20][21]

మూలాలు

[మార్చు]
  1. "ICC expresses sadness at the passing of Bandula Warnapura". International Cricket Council. Retrieved 2023-09-01.
  2. "Sri Lanka's first Test captain Bandula Warnapura passes away". The Papare. 2023-09-01. Retrieved 2023-09-01.
  3. 3.0 3.1 Frith, David (April 1982). "Sri Lanka come of age". Wisden Cricket Monthly. Cricinfo.com. Archived from the original on 28 March 2010. Retrieved 2023-09-01.
  4. 4.0 4.1 "Sri Lanka's first Test captain Bandula Warnapura passes away". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-01.
  5. 5.0 5.1 "Bandula Warnapura". Cricinfo. Retrieved 2023-09-01.
  6. "Sri Lanka batsmen dominate India". BBC Sport. 24 July 2008. Retrieved 2023-09-01.
  7. Anandappa, Ranjan (27 February 2005). "Ananda-Nalanda on quiet note this year". Sunday Observer. Archived from the original on 5 June 2011. Retrieved 2023-09-01.
  8. 8.0 8.1 "Bandula Warnapura: Managing Development". Asian Cricket Council. Archived from the original on 10 March 2010. Retrieved 2023-09-01.
  9. Thawfeeq, Sa'adi (8 June 2008). "Warnapura joins ACC". The Nation. Archived from the original on 18 July 2011. Retrieved 2023-09-01.
  10. "Sri Lanka Players by Caps (Tests)". Cricinfo.com. Archived from the original on 24 April 2010. Retrieved 2023-09-01.
  11. Williamson, Martin (26 May 2006). "The birth of a nation". Cricinfo.com. Archived from the original on 4 March 2010. Retrieved 2023-09-01.
  12. "England in Sri Lanka (1981–82): Scorecard of Only Test". Cricinfo.com. Archived from the original on 20 April 2010. Retrieved 2023-09-01.
  13. "B Warnapura: High scores in Test matches". Cricinfo.com. Retrieved 2023-09-01.
  14. "Sri Lanka Players by Caps (ODI)". Cricinfo.com. Archived from the original on 24 April 2010. Retrieved 2023-09-01.
  15. "Prudential World Cup (1975): Scorecard of 4th match, Group B". Cricinfo.com. Archived from the original on 20 April 2010. Retrieved 2023-09-01.
  16. Dhambarage, Chris. "When Sri Lanka made their ODI debut at 1975 Prudential World Cup". Daily News (in ఇంగ్లీష్). Retrieved 2023-09-01.
  17. bugsbunny (2023-09-01). "Sri Lanka's first Test cricket captain Bandula Warnapura passed away". Colombo Gazette (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-09-01.
  18. "Bandula Warnupura hospitalized, critically ill". The Papare. Retrieved 2023-09-01.
  19. "Warnapura has right leg amputated". Sunday Observer (in ఇంగ్లీష్). 9 October 2021. Retrieved 2023-09-01.
  20. Bandula Warnapura, Sri Lanka's first Test Cricket Captain has passed away
  21. Sportstar, Team. "Sri Lanka's first Test captain Bandula Warnapura passes away". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2023-09-01.