బస్తీ కిలాడీలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బస్తీ కిలాడీలు
(1970 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.వి.ఆర్.శేషగిరిరావు
నిర్మాణ సంస్థ శ్రీ చిత్ర
భాష తెలుగు

బస్తీ కిలాడీలు జి. వి. ఆర్. శేషగిరి రావు దర్శకత్వంలో 1970 లో విడుదలైన చిత్రం.

తారాగణం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ సినిమాలోని పాటలకు సాలూరు హనుమంతరావు స్వరకల్పన చేశాడు[1].

క్ర.సం పాట రచన గాయకులు
1 "కళ్ళల్లో ఘాటైన కైపున్నదీ గుండెల్లో మత్తైన వేడున్నదీ" రాజశ్రీ పి.సుశీల
2 "కావాలి వరుడు కావాలి మా చెలికి వరుడు కావాలి" రాజశ్రీ పి.సుశీల,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
శేషయ్యశెట్టి,
రమణ బృందం
3 "అబ్బబ్బో ఏమి నీ సోకు అమ్మమ్మో ఏమి నీ ఠీకు" రాజశ్రీ మాధవపెద్ది
4 "ఒకసారి నవ్వాలి ఓ లలనా ఓ చెలియా" ఆరుద్ర పి.సుశీల,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
5 "నిన్న అనేదొక పాతకథ రేపు అనేదొక కొత్తకల నేడు అనేదే నిజముసుమా" రాజశ్రీ ఎల్.ఆర్.ఈశ్వరి
6 "నా మనసు లేగులాబీ నా పెదవులే జిలేబీ నవ్వించడం కవ్వించడం నాకున్న ఒకేఒక హాబీ" రాజశ్రీ ఎల్.ఆర్.ఈశ్వరి

కథాసంగ్రహం[మార్చు]

మద్రాసు మహానగరంలో ఒక పెద్ద దొంగలముఠా పట్టపగలే హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు జరుపుతుంటుంది. ఈ దొంగలముఠాని పట్టుకోవడానికి సి.ఐ.డి.ఆఫీసర్ చక్రపాణి మద్రాసు వస్తున్నాడని తెలిసిన దొంగలముఠానాయకుడు ఆ సి.ఐ.డి. ఆఫీసర్‌ను ఢిల్లోలోనే చంపివేయమని తన ముఠాలోని సునీతను నియమిస్తాడు. కాని చక్రపాణి సమయస్ఫూర్తిలో సునీత ప్రయత్నాలు విఫలంచేసి మద్రాసు బయలుదేరుతాడు. చక్రపాణికి దారిలో కృష్ణ అనే యువకుడు తారసపడతాడు. సి.ఐ.డి.ఆఫీసర్ మద్రాసు రాగానే అతనిని హతమార్చవలసిందిగా బాస్ తన అనుచరులను ఆదేశిస్తాడు. చక్రపాణి ఎక్కిన రైలులోనే కృష్ణకూడా మద్రాసు వస్తాడు. కృష్ణ వింతప్రవర్తన చూసి కృష్ణ సి.ఐ.డి.ఆఫీసరని దొంగలముఠాలోని వాళ్లు అనుకుంటారు. కృష్ణ ఎవరైనదీ తెలుసుకోవాలని చక్రపాణి కూడా ప్రయత్నిస్తాడు. కృష్ణని చంపడానికి దొంగలముఠా చేసే ప్రయత్నాలన్నీ చక్రపాణి విఫలం చేస్తుంటాడు. ఇంతలో కృష్ణకి వాణి అనే అమ్మాయితో పరిచయమౌతుంది. కృష్ణ వాణిని ప్రేమిస్తాడు. కృష్ణ నిజస్వరూపం ఏమిటో తెలుసుకోవాలని వాణి ప్రయత్నిస్తుంటుంది. సి.ఐ.డి.ఆఫీసర్‌ని చంపివేసే బాధ్యత తన అనుచరులైన చంచల గోపాల్‌లకు అప్పగిస్తాడు బాస్. చక్రపాణి వారికి అడుగడుగునా అడ్డుతగుల్తుంటాడు. దొంగలముఠా అసలు బాస్ ఎవరో తెలుసుకోవాలని చక్రపాణి ఎన్నో పన్నాగాలు పన్నుతాడు. హోటల్ మేనేజర్ సత్యనారాయణ వింతప్రవర్తన చూసి దొంగలముఠాతో సంబంధం ఉన్నదేమో తెలుసుకోవాలని చక్రప్రాణి ప్రయత్నిస్తుంటాడు. దొంగలముఠాలోనే ఒకడిగా ఉంటున్న గోపాల్ ముఠా అసలు బాస్ ఎవరో తెలుసుకోవాలని, ముఠా గుట్టుమట్టులన్నీ కనిపెట్టాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. దొంగలముఠా జరిపే పనులన్నీ ఒక పిచ్చివాడు ఒక కంట కనిపెడుతూ ఉంటాడు. ఈ పిచ్చివాడు ఎవరో తెలియక చక్రపాణి కొంత తికమకపడతాడు. అనుక్షణం ప్రమాదాలను ఎదుర్కొంటూ, ప్రాణాలకు తెగించి ఈ ముఠా అంతు తెలుసుకోవాలని చక్రపాణి రాత్రింబవళ్లు కృషిచేస్తుంటాడు. గోపాల్, కృష్ణ, పిచ్చివాడు వీరంతా ఎవరు? చక్రపాణి దొంగలముఠాను అంతం చేశాడా? అనే విషయాలు కథ చివరలో తెలుస్తుంది.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 సువర్ణ. బస్తీ కిలాడీలు పాటల పుస్తకం. p. 7. Retrieved 10 September 2020.