Jump to content

బహదూర్‌పురా ఫ్లైఓవర్

అక్షాంశ రేఖాంశాలు: 17°21′27″N 78°27′42″E / 17.3574°N 78.4617°E / 17.3574; 78.4617
వికీపీడియా నుండి
బహదూర్‌పురా ఫ్లైఓవర్
ప్రదేశం
బహదూర్‌పూర, హైదరాబాదు, తెలంగాణ
అక్షాంశ,రేఖాంశాలు17°21′27″N 78°27′42″E / 17.3574°N 78.4617°E / 17.3574; 78.4617
జంక్షన్ వద్ద
రహదార్లు
హైదరాబాదు - శంషాబాద్
నిర్మాణం
రకంఫ్లైఓవర్
లైన్స్6
నిర్మాణం చేసినవారువాడుకలో ఉంది by హైదరాబాదు మహానగర పాలక సంస్థ
ప్రారంభం2022 ఏప్రిల్ 19
గరిష్ట
వెడల్పు
690 మీటర్ల పొడవు
24 మీటర్ల వెడల్పు

బహదూర్‌పురా హైదరాబాద్ నగరంలోని ప్రధాన రహదారుల్లో ఒకటి. బహదూర్‌పురా జంక్షన్‌లో మల్టీ లెవల్‌ ఫ్లైఓవర్ గ్రేడ్‌ సపరేటర్‌ నిర్మాణ పనులను వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్‌.ఆర్‌.డి.పి)లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. 2022 ఏప్రిల్ 19న ఈ ఫ్లైఓవర్ ప్రారంభించబడింది.[1]

నిర్మాణ వివరాలు

[మార్చు]

బహదూర్‌పురా జంక్షన్‌ వద్ద ప్రారంభమయ్యే ఈ ఫ్లైఓవర్ ను 690 మీటర్లు పొడవుతో 6 లేన్లలో 69 కోట్లతో స్టాటిజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (ఎస్‌ఆర్‌డీపీ) సౌజన్యంతో 2018లో నిర్మాణాన్ని ప్రారంభించారు.[2] ఈ ఫ్లైఓవర్ వినియోగంలోకి వస్తే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లే వారితోపాటు మహబూబ్‌నగర్‌ తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి, జూపార్క్‌కు వచ్చే సందర్శకులకు, పాతబస్తీ వైపు వెళ్లే వాహనాలకు ప్రయాణం సులభతరం అవుతుంది. బహదూర్‌పురా జంక్షన్‌లో మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల సందర్భంగా ఈ రోడ్డు ద్వారా రాకపోకలు సాగించే భారీ వాహనాలపై 2021 నవంబరు 15 నుండి 2022 ఫిబ్రవరి 15 వరకు 90 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ దారి గుండా భారీ వాహనాలను మాత్రమే అనుమతి లేదు, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను అనుమతించారు.[3]

పనుల పరిశీలన

[మార్చు]

బహదూర్‌పురా జంక్షన్‌లో మల్టీ లెవల్‌ ఫ్లై ఓవర్‌ గ్రేడ్‌ సపరేటర్‌ నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సోమేశ్ కుమార్ 2022 జనవరి 20న జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకే్‌షకుమార్‌, జీహెచ్ఎంసీ అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్లతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించాడు.[4][5]

ప్రారంభం

[మార్చు]

2022, ఏప్రిల్ 19న తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి. రామారావు ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాదు పార్లమెంట్‌ సభ్యులు అసదుద్దీన్‌ ఒవైసీ, బహదూర్‌పూరా ఎమ్మెల్యే మహ్మద్ మొజం ఖాన్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[6][7]

మూలాలు

[మార్చు]
  1. "KTR: బహదూర్‌పురా ఫ్లైఓవర్‌ ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌". EENADU. 2022-04-19. Archived from the original on 2022-04-19. Retrieved 2022-04-19.
  2. The Hans India (6 March 2020). "Bahadurpura flyover works at a snail's pace" (in ఇంగ్లీష్). Archived from the original on 21 January 2022. Retrieved 21 January 2022.
  3. News18 Telugu (14 November 2021). "హైదరాబాద్ లోని వాహనదారులకు అలర్ట్.. ఆ జంక్షన్‌లో 90 రోజుల పాటు ట్రాఫిక్ దారిమళ్లింపు.. పూర్తి వివరాలివే". Retrieved 21 January 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)
  4. TV9 Telugu (19 January 2022). "హైదరాబాద్ వాహనదారులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్న మరో భారీ ఫ్లైఓవర్!". Archived from the original on 21 January 2022. Retrieved 21 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Sakshi (20 January 2022). "సాహోరే.. వారధులు! పాతబస్తీకే మణిహారాలు". Archived from the original on 21 January 2022. Retrieved 21 January 2022.
  6. telugu, NT News (2022-04-19). "పాత‌న‌గ‌రానికి కొత్త అందాలు.. బ‌హ‌దూర్‌పుర ఫ్లైఓవ‌ర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌". Namasthe Telangana. Archived from the original on 2022-04-19. Retrieved 2022-04-19.
  7. Sakshi (19 April 2022). "బహదూర్‌పురా ఫ్లై ఓవర్‌ ప్రారంభం.. జూపార్కు టూరిస్టులకు ఇక సాఫీ ప్రయాణం". Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.