Jump to content

బి.ఎన్.బి.రావు

వికీపీడియా నుండి
బి.ఎన్.బి.రావు
జననం(1910-01-21)1910 జనవరి 21
చన్నపట్న, రామనగర జిల్లా, కర్ణాటక
మరణం1995 మార్చి 7(1995-03-07) (వయసు 85)
భారతదేశం
వృత్తిసర్జన్
వైద్యశాస్త్ర విద్యావేత్త
వైద్యశాస్త్ర రచయిత
క్రియాశీలక సంవత్సరాలు1936–1995
ప్రసిద్ధివైద్యశాస్త్ర విద్య
వైద్యశాస్త్ర పరిశోధన
తల్లిదండ్రులుభి.కె.నారాయణరావు
నాచారమ్మ
పురస్కారాలుపద్మశ్రీ

బసవపట్న నారాయణ బాలకృష్ణారావు (1910–1995) భారతీయ సర్జన్, వైద్య విద్యావేత్త, పరిశోధకుడు, రచయిత, అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు.[1] అతను న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ప్రొఫెసరుగా, శస్త్రచికిత్స విభాగానికి అధిపతిగా ఉన్నాడు. నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వ్యవస్థాపక సభ్యులలో ఒకడు.[2] ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు ఎన్నికైన ఫెలో కూడా.[3] వైద్యశాస్త్రంలో ఆయన చేసిన కృషికి గాను 1971 లో భారత ప్రభుత్వం ఆయనకు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ ప్రదానం చేసింది.[4]

జీవిత చరిత్ర

[మార్చు]

బాలక్రిష్ణారావు 1910 జనవరి 21కర్ణాటక, రామనగర జిల్లాలోని చన్నపట్న అనే పట్టణంలో ఒక సంకేతి బ్రాహ్మణ కుటుంబంలో నాచారమ్మ, రాజసేవాసక్త నారాయణరావు దంపతులకు జన్మించాడు. తండ్రి నేత్రవైద్యుడు, మింటో కంటి ఆసుపత్రి వ్యవస్థాపకుడు. కేరళలోని పాలక్కాడ్ నుండి మైసూరుకు వలస వచ్చాడు.[5] బాలక్రిష్ణారావు మైసూర్‌లో పాఠశాల విద్య అభ్యసించాడు. ముంబై విశ్వవిద్యాలయం నుండి వైద్యశాస్త్రంలో పట్టభద్రుడయ్యాక, ఇంగ్లాండ్‌లో తన వైద్య విద్యను కొనసాగించి, LRCP పొందాడు. తరువాత 1936 లో MRCS, 1937 లో FRCS పొందాడు.[1] 1940 లో మైసూర్ స్టేట్ సర్వీసెస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరాడు. 1945లో మైసూర్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసరుగా చేస్తూ, శస్త్రచికిత్స విభాగానికి అధిపతి అయ్యాడు. అక్కడ రెండు సంవత్సరాలు పనిచేసిన తరువాత, 1947 లో గ్వాలియర్‌లోని గజర రాజా మెడికల్ కాలేజీకి మారాడు. 1964 వరకు ప్రొఫెసరుగా, సర్జరీ విభాగానికి అధిపతిగా, డీన్‌గా పనిచేశాడు. ఆ తరువాత ఢిల్లీలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చేరి 1972 లో పదవీ విరమణ పొందే వరకు అక్కడే కొనసాగాడు. ఆ తర్వాత అతను 1975 వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో సైంటిస్ట్ ఎమెరిటస్‌గా పనిచేశాడు.[1] అతను 1976 నుండి 1978 వరకు రెండు సంవత్సరాల పాటు ఇండోర్‌లోని చోయిత్‌రామ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో కూడా పనిచేశాడు.[6]

న్యూరోసైన్సెస్ అండ్ రీనల్ కాలిక్యులిపై చేసిన పరిశోధనకు గాను పేరుగాంచిన రావు, బాల్యంలో ప్రైమరీ కార్సినోమా ఆఫ్ ది లివర్ ఇన్ ఇన్‌ఫాన్సీ: రిపోర్ట్ ఆఫ్ ఎ కేస్ తో సహా అనేక వ్యాసాలను ప్రచురించాడు. అనేక సంవత్సరాల పాటు రావు, భారత రాష్ట్రపతికి గౌరవ శస్త్రవైద్యునిగా పనిచేశాడు. 1962-63 సమయంలో రెండు పర్యాయాలు అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా (ASI) కు అధ్యక్షుడిగా పనిచేశాడు.[7] అతను నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వ్యవస్థాపకులలో ఒకడు.[8] 1945 లో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అతనిని తమ ఫెలోగా ఎన్నుకుంది. 1971 లో భారత ప్రభుత్వం అతనికి పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది.[4] 1993 లో అతను ఇంటర్నేషనల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్‌లో సభ్యుడయ్యాడు. రెండు సంవత్సరాల తరువాత, అతను 85 సంవత్సరాల వయస్సులో 1995 మార్చి 7 న మరణించాడు.[3] అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా తన మాజీ అధ్యక్షుని గౌరవార్థం 2000 లో డాక్టర్ బాలకృష్ణారావు ఒరేషన్‌ పేరుతో వార్షిక అవార్డు ప్రసంగాన్ని ఏర్పాటు చేసింది.[9]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Dr. Basavapattana Narayana Balkrishna Rao (1910 – 1995)". Gajara Raja Medical College Alumni Association. 2016. Retrieved 21 August 2016. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Dr. Basavapattana Narayana Balkrishna Rao (1910 – 1995)" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. "NAMS fellows" (PDF). National Academy of Medical Sciences. 2016. Retrieved 21 August 2016.
  3. 3.0 3.1 "IAS Fellows". Indian Academy of Sciences. 2016. Retrieved 21 August 2016. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "IAS Fellows" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  4. 4.0 4.1 "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2013. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 20 August 2016. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Padma Awards" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  5. "Prof. B.N Balakrishna Rao on ASI". Association of Surgeons of India. 2016. Retrieved 21 August 2016.
  6. "Choithram Hospital and Research Centre". Slide Share. 2016. Retrieved 21 August 2016.
  7. "Past Presidents". Association of Surgeons of India. 2016. Retrieved 21 August 2016.
  8. "Founder fellows" (PDF). National Academy of Medical Sciences. 2016. Retrieved 21 August 2016.
  9. "Awards And Orations". Association of Surgeons of India. 2016. Retrieved 21 August 2016.