బుద్ధి కుందరన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బుద్ధి కుందరన్
దస్త్రం:Budhi Kunderan.jpg
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
బుద్ధిసాగర్ కృష్ణప్ప కుందరన్
పుట్టిన తేదీ(1939-10-02)1939 అక్టోబరు 2 .
ముల్కీ, కర్ణాటక బ్రిటిషు భారతదేశం
మరణించిన తేదీ2006 జూన్ 23(2006-06-23) (వయసు 66)
గ్లాస్గో, స్కాట్లాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రWicketkeeper-బ్యాటరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 96)1960 జనవరి 1 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1967 జూలై 13 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 18 129
చేసిన పరుగులు 981 5,708
బ్యాటింగు సగటు 32.70 28.97
100లు/50లు 2/3 12/19
అత్యధిక స్కోరు 192 205
వేసిన బంతులు 24 219
వికెట్లు 0 3
బౌలింగు సగటు 53.33
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 2/15
క్యాచ్‌లు/స్టంపింగులు 23/7 176/85
మూలం: CricketArchive, 2019 నవంబరు 1

బుద్ధిసాగర్ కృష్ణప్ప కుందరన్ (జననం బుద్ధిసాగర్ కృష్ణప్ప కుందరన్ 1939 అక్టోబర్ 2 - 2006 జూన్ 23) భారతీయ క్రికెట్ ఆటగాడు. అతను తన కెరీర్‌లో ఎక్కువ కాలం వికెట్ కీపర్‌గా ఆడాడు. సమకాలీనుడైన ఫరోఖ్ ఇంజనీర్‌తో అంతర్జాతీయ ఎంపిక కోసం పోటీ పడ్డాడు. అతను అసాధారణమైన కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్. [1] 1960, 1967 మధ్య పద్దెనిమిది టెస్టుల్లో, రెండు సెంచరీలతో, 32.70 బ్యాటింగ్ సగటుతో 981 పరుగులు చేశాడు. కీపరుగా అతను 23 క్యాచ్‌లు పట్టి, ఏడు స్టంపింగులు చేశాడు.

కెరీర్[మార్చు]

ప్రారంభ మ్యాచ్‌లు[మార్చు]

బుధి కుందరన్ 1958-59లో భారత పర్యటనకు వచ్చిన వెస్టిండీస్‌పై క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మొదటిసారి కనిపించాడు. కేవలం రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల తర్వాత, ఆ తరువాతి ఏడాది ఆస్ట్రేలియాతో టెస్టు క్రికెట్ ఆడేందుకు ఎంపికయ్యాడు. యాభైలలో భారతదేశానికి నరేన్ తమ్హానే, ప్రొబిర్ సేన్, నానా జోషిల రూపంలో దాదాపు ఒకే నాణ్యత కలిగిన ముగ్గురు వికెట్ కీపర్లు ఉండేవారు. జోషి, తమ్‌హానేలను ప్రయత్నించాక, మూడో టెస్టులో కుందరన్‌కు అవకాశం ఇచ్చారు. ఇయాన్ మెకిఫ్‌ వేసిన బంతిని పుల్ చేసేందుకు ప్రయత్నించి కుందరన్, తన మొదటి ప్రదర్శనలోనే హిట్ వికెట్‌గా ఔటయ్యాడు. అయితే తదుపరి టెస్టులో 71, 33 పరుగులు చేశాడు.

కుందరన్ 1960లో రంజీ ట్రోఫీలో ప్రవేశించినప్పటికే మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. తన మొదటి రంజీ ప్రదర్శనలో, అతను జమ్మూ కాశ్మీర్‌పై రైల్వేస్ తరపున 205 పరుగులు చేశాడు. తొలి రంజీ మ్యాచ్‌లో సాధించిన ఎనిమిది డబుల్ సెంచరీలలో అతనిది ఒకటి. [2] అతని రెండవ ఫస్ట్ క్లాస్ సెంచరీ కూడా సంవత్సరం తర్వాత అదే ప్రత్యర్థులతో జరిగిన మ్యాచ్. ఆ మ్యాచ్‌లో రైల్వేస్, వికెట్ నష్టపోకుండా గెలిచింది. [3]

1960 లలో ఆట[మార్చు]

1960ల ప్రారంభం నుండి, కుందరన్‌కి ఫరోఖ్ ఇంజనీర్‌తో వికెట్ కీపింగ్ స్థానానికి పోటీ ఉండేది. ఇద్దరూ స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఆడారు. 1961-62లో వెస్టిండీస్‌లో పర్యటించారు. 1963-64లో ఇంగ్లండ్ మళ్లీ భారత్‌ను సందర్శించినప్పుడు ఇంజనీర్, కుందరన్ కంటే ముందుగా ఎంపికయ్యాడు. అయితే మద్రాస్‌లో జరిగిన మొదటి టెస్టు సందర్భంగా అతను వైద్యపరంగా ఆడేందుకు అనర్హుడవడంతో, కుందరన్‌ ఆడాడు. ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కుందరన్ 31 ఫోర్లతో 192 పరుగులు సాధించాడు. అందులో 170 పరుగులు మ్యాచ్ మొదటి రోజునే వచ్చాయి. అతను ఢిల్లీలో మరో వంద పరుగులు చేశాడు. సిరీస్‌లో మొత్తం 525 పరుగులతో ముగించాడు. ఈ సిరీస్ తరువాత, మరో ఇద్దరు వికెట్ కీపర్లు మాత్రమే ఒక టెస్ట్ సిరీస్‌లో 500 కంటే ఎక్కువ పరుగులు చేశారు, వారు - డెనిస్ లిండ్సే, 1966-67లో ఆస్ట్రేలియా తరపున దక్షిణాఫ్రికాతో 606 చేయగా, 2000-01లో జింబాబ్వే తరపున ఇండియాతో ఆడుతూ ఆండీ ఫ్లవర్ 540 చేసాడు. [4]

భారత సెలెక్టర్లు కుందరన్, ఇంజనీర్ ఇద్దరినీ ఆస్ట్రేలియాతో జరిగే తదుపరి సిరీస్ నుండి తప్పించి, KS ఇంద్రజిత్‌సిన్హ్‌జీని తీసుకున్నారు. గాయపడిన దిలీప్ సర్దేశాయ్ స్థానంలో కుందరన్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఆడగా, ఆ తర్వాత జరిగిన న్యూజిలాండ్ సిరీస్‌కు ఇంజనీర్‌ని తిరిగి పిలిచారు.

1965లో, కుందరన్ రైల్వేలో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి మైసూరు జట్టుకు, సౌత్ జోన్‌కు హాజరయ్యాడు. దీని సైడ్ ఎఫెక్ట్ ఏమిటంటే, అతను దేశీయ మ్యాచ్‌లలో చంద్రశేఖర్, ప్రసన్న ,వెంకట్‌రాఘవన్‌ల బౌలింగులో వికెట్‌ కీపరుగా పనిచేసాడు. 1966-67లో వెస్టిండీస్‌తో బాంబే జరిగిన మ్యాచ్‌లో కుందరన్, 92 నిమిషాల్లో 79 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలో, అతను కొట్టిన బంతిని గ్యారీ సోబర్స్ క్యాచ్ పట్టినట్లు కనిపించాడు. బ్యాట్స్‌మన్ వెళ్ళిపోబోతూ ఉండగా సోబర్స్, క్యాచ్‌కు ముందు బంతి నేలకు తాకిందని సూచించాడు. ఒక టెస్టు తర్వాత, కుందరన్ మళ్లీ జట్టుకు దూరమయ్యాడు.


1967లో ఇంగ్లండ్‌లో పర్యటించిన బృందంలో కుందరన్, ఇంజనీర్ ఇద్దరూ ఉన్నారు. కానీ ఇంజనీర్ తనను తాను ప్రాథమిక కీపర్‌గా పేర్కొన్నాడు. సిరీస్‌లోని రెండవ, మూడవ టెస్టుల్లో కుందరన్ పూర్తిగా బ్యాట్స్‌మెన్‌గా ఆడాడు. సర్దేశాయ్ లార్డ్స్ టెస్టులో చేతికి గాయంతో రిటైర్ అయినప్పుడు, అతను ఇంజనీర్‌తో కలిసి ఇన్నింగ్సును ప్రారంభించాడు. భారత జట్టు చేసిన110 పరుగులలో 47 పరుగులతో టాప్ స్కోర్ చేశాడు. భారతదేశం నలుగురు స్పిన్నర్లతో ఆడిన బర్మింగ్‌హామ్‌ టెస్టులో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటినీ ప్రారంభించాడు. కుందరన్‌కి ఇదే చివరి టెస్టు.

అంతర్జాతీయ కెరీర్ తర్వాత[మార్చు]

అతను లాంక్షైర్ లీగ్‌లో ప్రొఫెషనల్‌గా పనిచేశాడు .స్కాట్‌లాండ్‌లోని వెస్ట్రన్ యూనియన్‌లో డ్రంపెల్లియర్‌తో కలిసి పనిచేశాడు. 1980ల ప్రారంభంలో, అతను ఇంగ్లాండ్‌లో జరిగిన బెన్సన్ అండ్ హెడ్జెస్ కప్‌లో స్కాట్లాండ్ తరపున ఆడాడు. కుందరన్ 1970ల ప్రారంభం నుండి స్కాట్లాండ్‌లో నివసించాడు. అతని సోదరుడు భరత్, వికెట్ కీపరు. 1970-71లో భారత విశ్వవిద్యాలయాల తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు.

బుధి కుందరన్ 66 ఏళ్ల వయసులో ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మరణించారు. 2018 జూన్‌లో అతనికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రత్యేక అవార్డును అందించింది. [5]

మూలాలు[మార్చు]

  1. "Budhi Kunderan". ESPNcricinfo.
  2. "Match scorecard". CricketArchive.
  3. "Match scorecard". CricketArchive.
  4. Most runs by wicket keepers in a series.
  5. "Kohli, Harmanpreet, Mandhana win top BCCI awards". ESPNcricinfo. Retrieved 7 June 2018.