బొగ్గారపు దయానంద్
బొగ్గారపు దయానంద్ | |||
| |||
ఎమ్మెల్సీ
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2020 నవంబరు 15 - ప్రస్తుతం | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | హైదరాబాదు, తెలంగాణ | 1954 మే 3||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | రాములు, వజ్రమ్మ | ||
జీవిత భాగస్వామి | సుజాత | ||
సంతానం | ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె |
బొగ్గారపు దయానంద్ తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి తరపున తెలంగాణ శాసన మండలి సభ్యుడిగా ఉన్నాడు.[1][2]
జీవిత విషయాలు
[మార్చు]దయానంద్ 1954, మే 3న రాములు, వజ్రమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు.[3] బిఎస్సీ చదువుకున్నాడు.[1] ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రోటోకాల్ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేసి 2003లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు.
వ్యక్తిగత వివరాలు
[మార్చు]దయానంద్ కు సుజాతతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.
రాజకీయరంగం
[మార్చు]2003లో తెలుగుదేశం పార్టీలో చేరాడు. 2009 - 2014 మధ్యకాలంఓ గోషామహల్ శాసనసభ నియోజకవర్గం నుండి టిడిపి బిజినెస్ సెల్ రాష్ట్ర కమిటీ అభ్యర్థిగా పనిచేశాడు. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. 2020, నవంబరు 15న టిఆర్ఎస్ పార్టీ తరపున గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4][5]
2024 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి లోక్‌సభ పరిధిలోని ఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్‌గా నియమితుడయ్యాడు.[6] ఆయన 2024 జూలై 5న టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[7]
ఇతర వివరాలు
[మార్చు]నేపాల్, థాయిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదలైన దేశాలలో పర్యటించాడు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Telangana Legislature, MLCs (3 August 2021). "Members Information - Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 3 August 2021. Retrieved 3 August 2021.
- ↑ GTNEWS1 (2020-11-13). "Governor quota MLCs finalised Governor quota MLCs finalised". Great Telangaana | English (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-03.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Telangana Legislature, MLCs. "Telangana-Legislature Members Information". telanganalegislature.org.in. Archived from the original on 4 ఆగస్టు 2021. Retrieved 4 August 2021.
- ↑ Sakshi Post, Telangana (15 November 2020). "english.sakshi.com/news/telangana/ktr-congratulates-mlcs-goreti-venkanna-b-saraiah-b-dayanand-%C2%A0elected-under-governors" (in ఇంగ్లీష్). Archived from the original on 15 November 2020. Retrieved 3 August 2021.
- ↑ "MLCs Nominated By Governor" (PDF). www.ceotelangana.nic.in. Retrieved 2021-08-03.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Eenadu (6 April 2024). "పార్లమెంటు నియోజకవర్గాల్లో భారాస సమన్వయకర్తల నియామకం". Archived from the original on 6 April 2024. Retrieved 6 April 2024.
- ↑ NT News (5 July 2024). "కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు." Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.