బ్యుటేన్

వికీపీడియా నుండి
(బ్యుటేను నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బ్యుటేన్
Skeletal formula of butane
Skeletal formula of butane
Skeletal formula of butane with all carbon and hydrogen atoms shown
Skeletal formula of butane with all carbon and hydrogen atoms shown
Ball and stick model of butane
Ball and stick model of butane
Spacefill model of butane
Spacefill model of butane
పేర్లు
IUPAC నామము
Butane[1]
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [106-97-8]
పబ్ కెమ్ 7843
యూరోపియన్ కమిషన్ సంఖ్య 203-448-7
కెగ్ D03186
వైద్య విషయ శీర్షిక butane
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:37808
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య EJ4200000
SMILES CCCC
బైల్ స్టెయిన్ సూచిక 969129
జి.మెలిన్ సూచిక 1148
ధర్మములు
C4H10
మోలార్ ద్రవ్యరాశి 58.12 g·mol−1
స్వరూపం Colorless gas
వాసన Petrol-like
సాంద్రత 2.48 g dm−3 (at 15 °C)
61 mg L−1 (at 20 °C)
log P 2.745
బాష్ప పీడనం ~25 PSI (at 50 °F) [2]
kH 11 nmol Pa−1 kg−1
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
−126.3–−124.9 kJ mol−1
దహనక్రియకు కావాల్సిన
ప్రామాణీక ఎంథ్రఫీ
ΔcHo298
−2.8781–−2.8769 MJ mol−1
విశిష్టోష్ణ సామర్థ్యం, C 98.49 J K−1 mol−1
ప్రమాదాలు
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు GHS02: Flammable
జి.హెచ్.ఎస్.సంకేత పదం DANGER
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు H220
GHS precautionary statements P210
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు R12
S-పదబంధాలు (S2) S16
జ్వలన స్థానం {{{value}}}
విస్ఫోటక పరిమితులు 1.8–8.4%
సంబంధిత సమ్మేళనాలు
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

బ్యుటేన్

[మార్చు]

బ్యుటేన్అనునది ఒక హైడ్రోకార్బను సమ్మేళనం.కర్బనరసాయన శాస్త్రంలో బ్యుటేన్ ఆల్కేను (alkane) సముహాంనకు చెందినది.బ్యుటేన్ సాధారణ వాతావరణ పీడనం, సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఇది వాయు రూపం వుండును. ఇది రంగు, వాసన లేని, సులభంగా మండే గుణము ఉన్న వాయువు[4].ఇది ఒక సంతృప్త ఉదజని-కర్బనపు సమ్మేళనం. కార్బను-ఉదజని గొలుసులో ద్విబంధాలు వుండవు.

ఉనికి-సౌష్టవ నిర్మాణ వివరాలు

[మార్చు]

బ్యుటేన్ వాయువు ముడి పెట్రోలియం బావులనుండి వెలువడు సహజ వాయువులోను ముడిపెట్రోలియంలో లభించును.బ్యుటేను వాయువును మొదటగా పిట్సుబర్గ్ (pittsburg) కు చెందిన డా.వాల్టరు స్నెల్లింగ్ పెట్రోలలో మిశ్రితమై వున్నట్లుగా గుర్తించాడు [5].బ్యుటేన్ తో పాటు ప్రొపేన్ వాయువును కూడా గుర్తించడం జరిగింది.

బ్యుటేన్ వాయువు నాలుగు కార్బనులను కలిగిన కర్బన-ఉదజని సమ్మేళనం.ఇది సంతృప్త కర్బన-ఉదజని సమ్మేళనం. అందుచే దీనిని ఆల్కేన్ సమూహంలో చేర్చారు. బ్యుటేన్ నాలుగుకార్బను పరమాణువులు, పది హైడ్రోజన్పరమాణువులు సంయోగం చెందటం వలన ఏర్పడిన సమ్మేళనం.దీని అణుఫార్ములా C4H10.బ్యుటెను రెండు రూపాలలో లభిస్తుంది.ఒకటి n-బ్యుటేను.n-బ్యుటేను లేదా సాధారణ బ్యుటేనుయొక్క ఉదజని-కర్బన సమ్మేళనంలో ఎటువంటి శాఖలు/కొమ్మలు (branches) ఉండవు. మరియొకటి దీని ఐసోమరు అయిన ఐసోబ్యుటేను (Isobutane). ఐసోబ్యుటేను అనునది శాఖాయుత సౌష్టవమున్న సమ్మేళన వాయు పదార్థం.n-బ్యుటేను యొక్క శాస్త్రీయ నామం (IUPAC) బ్యుటేను కాగా, బుటేన్ యొక్క సమాంగం అయిన ఐసోబ్యుటేన్ యొక్క శాస్త్రీయ నామం 2-మిథైల్ ప్రొపేన్ (2-methyl propane).

సాధారణ పేరు సాధారణ బ్యుటేన్
శాఖారహిత బ్యుటేన్
n-బ్యుటేన్
ఐసోబ్యుటేన్
i-బ్యుటేన్
శాస్త్రీయ (IUPAC) పేరు బ్యుటేన్ 2-మిథైల్ ప్రొపేన్
అణుసౌష్టవ
చిత్రం
రేఖా (Skeletal)
చిత్రం
దస్త్రం:I-Butane simple.svg

రసాయనిక భౌతిక ధర్మాలు

[మార్చు]

భౌతిక ధర్మాల పట్టిక [6]

గుణము విలువల మితి
అణుభారం 58.122 గ్రాం/మోల్
ఘన స్థితిలో
ద్రవీభవన ఉష్ణోగ్రత
-138.29 °C
ఘన స్థిథతిలో
గుప్తోష్ణం (కరుగుటకు) (.013 బార్‌వద్ద
కేజి
ద్రవస్థితిలో
సాంద్రత (1.013బార్ వద్ద
601.26 కే.జీ/మీ3
ద్రవస్థితిలో
బాష్పీకరణ ఉష్ణోగ్రత
1.013 బార్ వద్ద
-.049 °C
ద్రవస్థితిలో
బాష్పీకరణ గుప్తోష్ణణం
1.013బార్ వద్ద
385.71కిలో జౌల్/కే.జి.
వాయు స్థితిలో
సాంద్రత
1.013 బార్, మరుగు ఉష్ణోగ్రత వద్ద
2.7093 కే.జి./మీ3
సాంద్రత
1.013బార్,15°Cవద్ద
2.5436 కే.జీ/మీ3
విశిష్ట గుర్వుత్వం 2.08
విశిష్టఘనపరిమాణం
1.013 బార్/250C
0.4084 మీ3/కే.జి
ఉష్ణవాహకతత్వం
1.013బార్/O°Cవద్ద
14.189 mW/m.K)
నీటిలో ద్రావీయత 0.0325

రసాయనిక చర్యలు

[మార్చు]
  • బ్యుటెను వాయువును గాలి లేదా ఆక్సిజనుతో కలిపి మండించినప్పుడు బొగ్గుపులుసు వాయువు, నీరు ఎర్పడి, అధిక ప్రమాణంలో ఉష్ణం విడుదల అగును.


2C4H10 + 13O2 → 8CO2 + 10H2O +Heat
  • బ్యుటెను నుండి డ్యుపాంట్ ఉత్ప్రేరక పద్ధతిలో మాలిక్ ఆన్‌హైడ్రైడ్ ( maleic anhydride) ను ఆక్సిజనుతో చర్య జరిపించడం ద్వారా ఉత్పత్తి చెయ్యబడును.


2 CH3CH2CH2CH3 + 7 O2 → 2 C2H2 (CO) 2O + 8 H2O

ఉపయోగం

[మార్చు]
  • బ్యుటేన్ వాయువునుప్రొపేను, కొన్ని ఉదజని, కర్బన సమ్మేళనాలను కలిపి ద్రవరూపంలోకి మార్చి, లోహ సిలెండరులలో నింపి వంట ఇంధనంగా, వాహన ఇంధనంగా వినియోగిస్తున్నారు[7] .ఈ విధంగా ద్రవరూపానికి మార్చిన వాయువు సమ్మేళానాన్ని ఎల్.పి.జి (ద్రవికరించిన పెట్రోలియం వాయువు) అని ఆంటారు.
  • సిగరెట్ లైటరులలో, క్యాంపింగ్‌ స్టవులలో (camping stove) ఇంధనంగాను, ఇళ్లలో వాడు శీతలీకరణ పరికరం (fridge) శీతలీకరణ ద్రవంగాను ఉపయోగిస్తారు.[8]
  • బ్యుటేన్ వాయువును ఉష్ణమాపకాలలో (thermometer, వత్తిడి మాపకాలలో (pressure Guages, ఇతర మాపకాలలో వినియోగిస్తున్నారు[9]
  • ప్రయోగశాలలలో ఉపయోగిస్తారు.

బ్యుటేన్ వలన ఇబ్బందులు

[మార్చు]
  • ఈ వాయువును తక్కువ మోతాదులో పీల్చినప్పుడు, తలతిరగడం, చూపు మసకబారడం, వాంతులవ్వడం, మాటల తడబాటు, దగ్గుట, బుమ్ముట వంటి లక్షణాలు కన్పించును.ఎక్కువగా పీల్చిన ఈ లక్షణాల తీవ్రత పెరుగుతుంది, శ్వాసకోసం పై, గుండెపనితీరుపై ప్రభావం చూపును.[10]

ఇవికూడా చూడండి

[మార్చు]
  1. ప్రొపేన్
  2. హెక్సేను

బయటి లింకులు

[మార్చు]

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. మూస:PubChem
  2. W. B. Kay. "Pressure-Volume-Temperature Relations for n-Butane". Standard Oil Company.
  3. "Safety Data Sheet, Material Name: N-Butane" (PDF). USA: Matheson Tri-Gas Incorporated. 5 February 2011. Archived from the original (PDF) on 1 అక్టోబరు 2011. Retrieved 11 December 2011.
  4. "butane". thefreedictionary.com. Retrieved 2013-11-24.
  5. "Who Discovered Butane?". ask.com. Retrieved 2013-11-24.[permanent dead link]
  6. "n-butane". encyclopedia.airliquide.com/. Archived from the original on 2016-03-05. Retrieved 2013-11-24.
  7. "Butane". princeton.edu. Archived from the original on 2013-10-17. Retrieved 2013-11-24.
  8. "Butane". butane.weebly.com/. Archived from the original on 2016-03-05. Retrieved 2013-11-24.
  9. "n - Butane". c-f-c.com/. Archived from the original on 2013-11-09. Retrieved 2013-11-24.
  10. "Butane". inchem.org. Archived from the original on 2014-03-14. Retrieved 2013-11-24.
"https://te.wikipedia.org/w/index.php?title=బ్యుటేన్&oldid=3834938" నుండి వెలికితీశారు