Jump to content

బ్రజ్ కిషోర్ ప్రసాద్

వికీపీడియా నుండి

బ్రాజ్‌కిషోర్ ప్రసాద్ (1877 – 1946) బీహారుకు చెందిన భారత స్వాతంత్ర్య సమర యోధుడు, న్యాయవాది. మోహన్ దాస్ గాంధీ స్ఫూర్తితో స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు.

బీహర్ రాష్ట్రం, సివాన్ జిల్లా శ్రీనగర్‌లోని కాయస్థ కుటుంబంలో జన్మించిన ప్రసాద్, ఛాప్రా, పాట్నాలో ప్రాథమిక విద్యను అభ్యసించాడు. ఆ తరువాత కలకత్తా లోని ప్రెసిడెన్సీ కళాశాలలో చేరి న్యాయవాద విద్య చదివాడు. 

అతను ఫూల్ దేవిని వివాహం చేసుకున్నాడు. దర్భంగాలో న్యాయవాద వృత్తిని చేపట్టాడు. అతనికి విశ్వనాథ్, శివ నాథ్ ప్రసాద్ అనే ఇద్దరు కుమారులు, ప్రభావతి దేవి, విద్యావతి అనే ఇద్దరు కుమార్తెలూ ఉన్నారు.

అతను 1915 లో మహాత్మా గాంధీని కలుసుకున్నాడు. అతని నుండి ప్రేరణ పొంది, స్వాతంత్ర్య పోరాటంలో పూర్తి సమయం పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. తన న్యాయవాద వృత్తిని వదులుకున్నాడు. అతను మహాత్మా గాంధీ, చంపారన్, ఖేడా సత్యాగ్రహాలను చేపట్టడంలో ప్రసాద్ ప్రధాన కారకుడు. ఈ సత్యాగ్రహాన్ని జయప్రదం చేసేందుకు మహాత్మా గాంధీ, రాజేంద్ర ప్రసాద్, అనురాగ్ నారాయణ్ సిన్హా లతో పాటు ప్రసాద్‌ను కూడా ఎంపిక చేసుకున్నాడు. [1] ప్రసాద్ అంకితభావం గాంధీని ఎంతగానో ఆకట్టుకుంది. గాంధీ తన ఆత్మకథ పుస్తకం, ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్‌పెరిమెంట్స్ విత్ ట్రూత్‌లో "ది జెంటిల్ బిహారీ" అనే పేరుతో ఒక పూర్తి అధ్యాయాన్ని ప్రసాద్‌ కోసం కేటాయించాడు. 

బీహార్‌లో స్వాతంత్ర్య పోరాటంలో ప్రసాద్ ముందు వరుసలో ఉన్నాడు. బీహార్ విద్యాపీఠం ఏర్పాటులో అనేక మంది సహోద్యోగులతో కలిసి అతను చేసిన సహకారం కీలకమైంది. అతని జీవితంలో చివరి పది సంవత్సరాలు తీవ్ర అనారోగ్యంతో బాధపడి, 1946 లో మరణించాడు. [2]


సచ్చిదానంద్ సిన్హా రచించిన బ్రజ కిషోర్ ప్రసాద్: ది హీరో ఆఫ్ మెనీ బ్యాటిల్స్ అనే జీవిత చరిత్రను ఇటీవల నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. [3]

మూలాలు

[మార్చు]
  1. Kamat. "Biography: Anugrah Narayan Sinha". Kamat's archive. Retrieved 2006-06-25.
  2. s:The Story of My Experiments with Truth/Part V/The Gentle Bihari
  3. "BRAJA KISHORE PRASAD". National Book Trust, India. Retrieved 28 August 2018.