Jump to content

బ్రిజ్ మోహన్ లాల్ ముంజల్

వికీపీడియా నుండి

బ్రిజ్ మోహన్ లాల్ ముంజల్ (పంజాబీ:ਬ੍ਰਿਜਮੋਹਨ ਲਾਲ ਮੁੰਜਾਲ; 1923 జూలై 1 – 2015 నవంబరు 1), ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త. హీరో మోటోక్రాప్ (హీరో గ్రూప్) వ్యవస్థాపకుడు, చైర్మన్. భారత్ లోని 30మంది అత్యంత ధనికులలో ఈయన ఒకరు.[1]

కెరీర్

[మార్చు]

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

బ్రిజ్ మోహన్ లాల్ 1923లో పాకిస్థానీ పంజాబ్ లోని తోబా టెక్ సింగ్ ప్రావిన్స్ లో కమాలియా మండలంలో జన్మించారు. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. చదువు పూర్తయిన తరువాత  భారత విభజన కు ముందు  ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఆర్మీలో ఉద్యోగం చేశారు ఆయన.

హీరో సైకిల్స్

[మార్చు]

1954 వరకు హీరో సైకిల్స్ హ్యాండిల్ బార్స్, ఫ్రంట్ ఫోర్క్స్, చైన్లు వంటివి సరఫరా చేసేది. కానీ ఆ తరువాత వాటిని తయారు చేయడం మొదలు పెట్టింది. 1956లో పంజాబ్ ప్రభుత్వం లుథియానాలో స్థాపించేందుకు 12 సైకిల్ పరిశ్రమలకు లైసెన్సులు ఇవ్వడానికి టెండర్లు జారీ చేసింది. ముంజల్ సోదరులు కాంట్రాక్ట్ గెలుచుకున్నారు. దానితో హీరో సైకిల్స్ లార్జ్ స్కేల్ పరిశ్రమగా రూపుదిద్దుకుంది. దీనికి కొంత పెట్టుబడి పంజాబ్ ప్రభుత్వం పెట్టుకుంది.[2]

బ్రిజ్ మోహన్ నాయకత్వంలో, భారతదేశంలో పెద్ద మొత్తంలో సైకిల్స్ ను ఎగుమతి చేసిన ఏకైక కంపెనీగా హీరో సైకిల్స్ నిలిచింది. 1975లో భారత్ లోనే అతిపెద్ద సైకిళ్ళ తయారీదారుగా ఎదిగింది హీరో కంపెనీ. 1986లో ప్రపంచం మొత్తం మీద అతిపెద్ద సైకిళ్ళ తయారీదారుగా హీరో సైకిల్స్ గిన్నీస్ ప్రపంచ రికార్డులు ల్లోకి ఎక్కింది.[3]

హీరో హోండా

[మార్చు]

హోండా మోటర్స్ తో ఉమ్మడి వెంచర్ మొదలు పెట్టేముందు హీరో మెజిస్టిక్ మోపెడ్ అనే బండిని తయారు చేశారు హీరో మోటర్స్ సంస్థ. 1984లో బ్రిజ్ నాయకత్వంలో హీరో గ్రూప్ హోండాతో కలసి ఉమ్మడి వెంచర్ ప్రారంభించింది. హర్యానా లోని ధరుహెరా లో హీరో హోండా తయారీ పరిశ్రమ నెలకొల్పారు. 2002 సంవత్సరం వచ్చేటప్పటికి రోజుకు 16,000 మోటార్ సైకిల్స్ తయారీ చేస్తూ, 8.6మిలియన్ సైకిల్స్ అమ్మి టాప్ లో నిలిచిందీ సంస్థ.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

బిర్జ్ మోహన్ సంతోష్ ను వివాహం చేసుకున్నరు. వీరికి ఐదుగురు పిల్లలు. రమన్ కాంత్ (చనిపోయారు), సుమన్ కాంత్, పవన్ కాంత్, సునిల్ కాంత్, ఒక కుమార్తె గీతా ఆనంద్[4] అనార్యోగ్య కారణాలతో దక్షిణ ఢిల్లీలో 2015 నవంబరు 1న చనిపోయారు.[5]

అవార్డులు, గుర్తింఫులు

[మార్చు]
  • వ్యాపార పత్రిక "బిజినెస్ ఇండియా" బ్రిజ్ కు బిజినెస్ మాన్ ఆఫ్ ది ఇయర్ 1994 పురస్కారం ఇచ్చింది.
  • భారత స్మాల్ స్కేల్ రంగ అభివృద్ధి కోసం చేసిన కృషికి 1995లో జాతీయ పురస్కారం
  • 1999లో బిజినెస్ బరోన్స్ పత్రిక మోస్ట్ ఎడ్మైర్డ్ సి.ఈ.వోగా ప్రకటించింది.
  • 1997లో పి.హెచ్.డి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారు డిస్టింగ్విష్డ్ ఎంటర్పెన్యుర్షిప్ అవార్డు ఇచ్చింది.
  • గ్జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్స్టిట్యూట్ (ఎక్స్.ఎల్.ఆర్.ఐ) బ్రిజ్ ను సర్ జహంగిర్ ఘెండీ మెడల్ ఫర్ ఇండస్ట్రియల్ పీస్ ఇన్ 2000 అవార్డుతో గౌరవించింది.
  • ఎర్నెస్ట్ అండ్ ఎంటర్పెన్యూర్ ఆఫ్ ది ఇయర్ ఇన్ 2001గా పేర్కొనబడ్డారు.
  • ఆల్ ఇండియా మేనేజ్ మెంట్ అసోసియేషన్ 2003లో మేనేజ్ మెంట్ లో జీవిత సఫల్య పురస్కారం ఇచ్చింది
  • అక్టోబరు 2004లో, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం
  • 2005లో భారత ప్రభుత్వం బ్రిజ్ మోహన్ ను పద్మభూషణ్ తో గౌరవించింది.[6] 
  • 2008లో ఎన్.ఐ.టి.ఐ.ఇ బ్రిజ్ కు లక్ష్య బిజినెస్ విజినరీ అవార్డు ఇచ్చింది
  • 2011లో టి.ఇ.ఆర్.ఐ సంస్థ ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం ఇచ్చింది.
  • ఎర్నెస్ట్ & యంగ్ 2011 చే జీవితి సాఫల్య పురస్కారం[7]
  • 2011లో ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆయనకు లైఫ్ టైం కంట్రిబ్యూషన్ పురస్కారం ఇచ్చింది
  • ఐఐటి ఖరగ్ పూర్ 2011లో సైన్స్ లో గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది
  • ఆసియా పసిఫిక్ ఎంటర్పెన్యూర్షిప్ 2011లో జీవిత సాఫల్య పురస్కారం ఇచ్చింది
  • 2011లో ఎంటర్పైజ్ ఆసియా పురస్కారం అందించింది

References and notes

[మార్చు]
  1. "Brijmohan Lall Munjal on Forbes Lists". Forbes. Retrieved 10 January 2015.
  2. "Brijmohan Lall Munjal: A Hero for Life". Forbes. Archived from the original on 10 జనవరి 2015. Retrieved 10 January 2015.
  3. "Amazing story of how Munjal built Hero Honda". Rediff.com. Retrieved 10 January 2015.
  4. "The succession story of Munjal family". NDTV. Archived from the original on 10 జనవరి 2015. Retrieved 10 January 2015.
  5. http://www.business-standard.com/article/companies/end-of-an-era-brijmohan-lall-munjal-dies-after-brief-illness-115110100779_1.html
  6. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 2015-10-15. Retrieved July 21, 2015.
  7. "Entrepreneur Of The Year 2010 Lifetime Achievement". EY. Archived from the original on 10 జనవరి 2015. Retrieved 10 January 2015.