భారతీయ బాలిస్టిక్ క్షిపణి రక్షణ కార్యక్రమం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అడ్వాన్స్‌డ్‌ ఎయిర్ డిఫెన్స్ (AAD) క్షిపణి

భారతీయ బాలిస్టిక్ క్షిపణి రక్షణ కార్యక్రమం, క్షిపణి దాడుల నుండి దేశాన్ని రక్షించే బహుళ అంచెల రక్షణ వ్యవస్థ.[1][2] పాకిస్తాన్ నుండి ఎదురౌతున్న క్షిపణి ముప్పును ఎదుర్కొనేందుకు ప్రవేశపెట్టిన[3] ఈ వ్యవస్థలో రెండు నిరోధక క్షిపణులు ఉన్నాయి. అవి, అధిక ఎత్తులలో అడ్డుకునేందుకు పనిచేసే పృథ్వి ఎయిర్ డిఫెన్స్ (PAD) క్షిపణి, తక్కువ ఎత్తులలో అడ్డుకునే అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ (AAD) క్షిపణి. 5,000 కి.మీ. దూరం నుండి ప్రయోగించిన ఏ క్షిపణినైనా నిలువరించగల సామర్థ్యం ఈ రెండంచెల వ్యవస్థకు ఉంది.[4]

2006 నవంబరులో PAD ని పరీక్షించారు. 2007 డిసెంబరులో AAD ని పరీక్షించారు. PAD ని పరీక్షించడంతో, బాలిస్టిక్ క్షిపణి వ్యతిరేక వ్యవస్థలను అభివృద్ధి చేసుకున్న నాలుగో దేశంగా భారత్ అవతరించింది. అమెరికా, రష్యా, ఇజ్రాయిల్ మిగిలిన మూడు దేశాలు.[5] ఈ వ్యవస్థ చాలా పరీక్షలకు లోనయ్యింది. దీన్ని అధికారికంగా ప్రారంభించవలసి ఉంది.

నేపథ్యం[మార్చు]

1990 ల తొలినాళ్ళ నుండి భారత్, పాకిస్తాన్ నుండి క్షిపణి దాడి ముప్పును ఎదుర్కొంటోంది. ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలకు తోడు, పాకిస్తాన్ చైనానుండి కొన్న ఎమ్-11 క్షిపణులను మోహరించడంతో భారత్ 1995 ఆగస్టులో రష్యా నుండి 6 బ్యాటరీల S-300 భూమి-నుండి-గాలిలోకి పేల్చగలిగే క్షిపణులను కొనుగోలు చేసింది. ఢిల్లీ, ఇతర నగరాల రక్షణకు ఈ క్షిపణులను మోహరించింది.

1998 మేలో భారత్ తన రెండవ అణ్వస్త్ర పరీక్షను నిర్వహించింది. వెనువెంటనే పాకిస్తాన్ తన మొదటి అణ్వస్త్ర పరీక్షను నిర్వహించింది. దీంతో పాకిస్తాన్ నుంచి భారత్‌కు ఉన్న ముప్పు మరింత పెరిగింది. భారత్ కూడా క్షిపణులను ఉత్పత్తి చేసి పరీక్షించింది. (IGMDP).

అణ్వాయుధాలను సమకూర్చుకున్న తరువాత భారత పాకిస్తాన్ల మధ్య జరిగిన మొదటి ముఖాముఖి యుద్ధం, 1999 లో జరిగిన కార్గిల్ యుద్ధం. యుద్ధం కొనసాగుతూండగా అణ్వాయుధాన్ని ఉపయోగిస్తామనే మొదటి సూచన మే 31 న పాకిస్తాన్ ఫారిన్ సెక్రెటరీ షంషాద్ అహ్మద్ ద్వారా వచ్చింది. యుద్ధ తీవ్రత పెరిగితే పాకిస్తాన్ తనవద్ద ఉన్న"ఏ ఆయుధాన్నైనా" వాడేందుకు వెనుదీయదు అని ఆయన అన్నాడు.[6] యుద్ధం విస్తరిస్తే తాము అణ్వాయుధాలను వాడతామని పాకిస్తాన్ చేసిన బెదిరింపుగా దాన్ని భావించారు. పాకిస్తాన్ సెనేట్ నాయకుడు ఇలా అన్నాడు: "అవసరమైనప్పుడు ఆయుధాలను వాడకపోతే ఆ ఆయుధాలను ఉత్పత్తి చెయ్యడంలో అర్థం లేదు."[7] 1998 అణు పరీక్షల తరువాత పాకిస్తాన్ సైన్యానికి ధైర్యం వచ్చి, భారత్‌పై బలప్రయోగ ప్రయత్నాలను పెంచింది అని కొందరు నిపుణులు భావించారు.[8]

1999 లో భారత్‌లో క్షిపణి వ్యతిరేక వ్యవస్థ అభివృద్ధి మొదలైంది.[9] పాకిస్తాన్ అణ్వస్త్రాలను-ముందుగా-వాడను (నో ఫస్ట్ యూజ్) అనే విధానాన్ని అవలంబించక పోవడంతో ఈ కార్యక్రమం అవసరమైంది.

అభివృద్ధి[మార్చు]

మొదటి దశ[మార్చు]

క్షిపణి రక్షణ వ్యవస్థ అభివృద్ధి 1999 లో మొదలైంది. దాదాపు 40 ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యాయి. LRTR, MFCR (మల్టీ ఫంక్షన్ ఫైర్ కంట్రోల్ రాడార్) ల అభివృద్ధి ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (LRDE) నేతృత్వంలో జరిగింది.

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ (DRDL) AAD క్షిపణి యొక్క మిషన్ నియంత్రణ సాఫ్టువేరును తయారు చేసింది. నేవిగేషన్, ఎలెక్ట్రోమెకానికల్ యాక్చుయేషన్ వ్యవస్థలు, యాక్టివ్ రాడార్ సీకర్‌ను రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI) తయారు చేసింది. అడ్వాన్స్‌డ్ సిస్టమ్ లాబొరేటరీ (ASL) మోటార్లను, జెట్ వేన్లను, AAD, PAD ల స్ట్రక్చర్లనూ తయారు చేసింది. హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చి లాబొరేటరీ (HEMRL) క్షిపణికి ప్రొపెల్లంట్‌లను సరఫరా చేసింది.[10]

వివరణ[మార్చు]

BMD వ్యవస్థలో రెండు అంచెలుంటాయి. PAD, వాతావరణం బయట, 50 – 80 కి.మీ. ఎత్తులో ఛేదించేందుకూ, AAD క్షిపణి - వాతావరణం లోపల 30 కి.మీ. ఎత్తులో ఛేదించేందుకూ పనిచేస్తాయి. పూర్తిగా అభివృద్ధి చెందాక ఈ వ్యవస్థలో అనేక ప్రయోగ వాహకాలు, రాడార్లు, ప్రయోగ నియంత్రణ కేంద్రాలు (LCC) మిషన్ నియంత్రణ కేంద్రం (MCC) ఉంటాయి. ఇవన్నీ భౌగోళికంగా వివిధ ప్రాంతాల్లో విస్తరించి ఉండి, కట్టుదిట్టమైన సమాచార నెట్‌వర్కుతో అనుసంధానింపబడి ఉంటాయి.[9]

ఈ వ్యవస్థలో భాగమైన MCC, సాఫ్ట్‌వేరు ప్రబలంగా ఉండే వ్యవస్థ. రాడార్లు, ఉపగ్రహాలు మొదలైన వాటినుండి ఇది సమాచారం అందుకుంటుంది. ఈ వ్యవస్థలో ఉన్న 10 కంప్యూటర్లు ఆ సమాచారాన్ని విశ్లేషిస్తాయి. MCC, వ్యవస్థలోని మిగతా భాగాలతో WAN ద్వారా అనుసంధానింపబడి ఉంటుంది. లక్ష్యాన్ని విశ్లేషించడం, లక్ష్యాన్ని నిర్దేశించడం, విధ్వంస గణన MCC చేస్తుంది. అది కమాండరుకు నిర్ణయాలు తీసుకోవడంలో సాయపడుతుంది. లక్ష్యాన్ని కచ్చితంగా ధ్వంసం చేసేందుకు ఎన్ని క్షిపణులు అవసరం అవుతాయో కూడా ఇది నిర్ణయించగలదు.[9] ఈ పనులన్నీ చేసాక, లక్ష్యాన్ని ఓ లాంచి బ్యాటరీకి చెందిన ఎల్‌సిసి కి అందిస్తుంది. లక్ష్యం యొక్క వేగం, ఎత్తు, పథం మొదలైన వాటి ఆధారంగా ఎల్‌సిసి, ఛేదక క్షిపణిని ఎప్పుడు ప్రయోగించాలో నిర్ణయిస్తుంది. ఎల్‌సిసి, క్షిపణిని ప్రయోగించేందుకు సిద్ధం చేస్తుంది.[9]

ఛేదక క్షిపణిని ప్రయోగించాక, లక్ష్యానికి సంబంధించిన సమాచారాన్ని రాడార్ నుండి ఒక డేటా లింకు ద్వారా పంపిస్తారు. ఛేదక క్షిపణి లక్ష్యిత క్షిపణిని సమీపించాక, అది రాడార్ సీకర్‌ను చేతనం చేసి, లక్ష్యిత క్షిపణిపై లంఘించడానికి తనకు తాను మార్గ నిర్దేశకత్వం చేసుకుంటుంది. లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించడానికి ఒకే లక్ష్యం పైకి ఒకటి కంటే ఎక్కువ PAD, AAD క్షిపణులను ప్రయోగించే వీలు ఉంది.[9]

పృథ్వి ఎయిర్ డిఫెన్స్ (PAD) / ప్రద్యుమ్న బాలిస్టిక్ క్షిపణి ఛేదక క్షిపణి[మార్చు]

పృథ్వి ఎయిర్ డిఫెన్స్ (PAD)
రకంబాహ్య వాతావరణ క్షిపణి వ్యతిరేక క్షిపణి
అభివృద్ధి చేసిన దేశంభారత దేశము
సర్వీసు చరిత్ర
సర్వీసులోమోహరింపు దశ
ఉత్పత్తి చరిత్ర
తయారీదారుభారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ
తయారీ తేదీ26 నవంబరు 2006
విశిష్టతలు
పేలుడు
మెకానిజమ్
Proximity

ఇంజనుTwo Stage
ప్రొపెల్లెంటుLiquid fuel propelled first stage with two propellants and oxidisers, solid fuel propelled second stage with gas thruster.
ఆపరేషను
పరిధి
2,000 km (1,200 mi)
ఫ్లైటు ఎత్తు80 km (50 mi)[11]
వేగంమ్యాక్ 5+
గైడెన్స్
వ్యవస్థ
Inertial Navigation System
Ground-based mid-course correction
Active radar homing (Terminal phase)
లాంచి
ప్లాట్‌ఫారం
Tatra TEL 8 × 8

పృథ్వి ఎయిర్ డిఫెన్స్ (PAD) బాలిస్టిక్ క్షిపణి ఛేదక క్షిపణి. శత్రు క్షిపణులను వాతావరణం బయట ఛేదించేందుకు ఉద్దేశించినది ఈ క్షిపణి. పృథ్వి క్షిపణిపై ఆధారపడిన ఈ క్షిపణిలో రెండు దశలుంటాయి. గరిష్ఠ ఛేదన ఎత్తు 80 కి.మీ.. మొదటి దశలో ఘన ఇంధనాన్ని, రెండవ దశలో ద్రవ ఇంధనాన్నీ వాడతారు.[9][12] దీనిలో మనూవర్ థ్రస్టర్లున్నాయి. ఇవి 50 కి.మీ. ఎత్తున 5 g లకంటె ఎక్కువ త్వరణాన్ని కలిగించగలవు. ఇనర్షియల్ నేవిగేషన్ వ్యవస్థ ద్వారా గైడెన్స్ లభిస్తుంది. ప్రయాణంలో ఉండగా LRTR ద్వారా తాజా సమాచారం తెలుస్తుంది. టర్మినల్ దశలో యాక్టివ్ రాడార్ హోమింగ్ ద్వారా తెలుస్తుంది.[9] 300 నుండి 2,000 కి.మీ. పరిధి గల బాలిస్టిక్ క్షిపణులను PAD, మ్యాక్ 5 వేగంతో అడ్డుకోగలదు.[9]

PAD క్షిపణి కోసం లక్ష్యాన్ని పట్టుకునేందుకు, పేలుడు నియంత్రించేందుకూ.. ఉపయోగించే రాడారును LRTR అంటారు. ఇది చురుకైన ఫేస్‌డ్ ఎర్రే రాడార్. ఇది 600 కి.మీ. పరిధిలో 200 లక్ష్యాలను గమనించగలదు.[9] PAD క్షిపణిని ప్రద్యుమ్న అని కూడా అంటారు.[13]

మరింత అభివృద్ధి చేసాక ఛేదక క్షిపణి పరిధిని 50 నుండి 80 కి.మీ.కు పెంచారు. ఈ క్షిపణిలో జింబాల్‌డ్ వార్‌హెడ్ ను వాడారు.ఈ సాంకేతికత కారణంగా చిన్న వార్‌హెడ్‌తో లక్ష్యాన్ని ఛేదించగలిగే వీలు కలిగింది.[14]

పృథ్వి రక్షణ కసరత్తులు[మార్చు]

పృథ్వి రక్షణ కసరత్తులను (PADE) 2006 నవంబరులో చేసారు. పృథ్వి రక్షక క్షిపణి, మార్పులు చేసిన పృథ్వి-2 క్షిపణిని 50 కి.మీ. ఎత్తులో విజయవంతంగా అడ్డుకుంది. పృథ్వి-2 బాలిస్టిక్ క్షిపణిని తగువిధంగా మార్చి అది ఎమ్-11 క్షిపణి పథాన్ని అనుకరించేలా చేసారు.

1,500 కి.మీ. పరిధి గల క్షిపణులకు వ్యతిరేకంగా ఈ రక్షక కవచాన్ని పరీక్షించాలని DRDO తలపెట్టింది. ఈ పరీక్షలో, మార్పులు చేసిన పృథ్వి క్షిపణిని నౌక నుంచి ప్రయోగిస్తారు. నిరోధక క్షిపణిని వీలర్ ఐలాండ్ నుండి ప్రయోగిస్తారు. ఇది లక్ష్యిత క్షిపణిని 80 కి.మీ. ఎత్తులో అడ్డుకుంటుంది.[15]

2009 మార్చి 6 న రక్షక క్షిపణిని DRDO రెండో సారి విజయవంతంగా పరీక్షించింది. ఈసారి పరీక్షలో ధనుష్ క్షిపణి శత్రు క్షిపణి పాత్రను నిర్వహించింది. 1500 కి.మీ. పరిధి ఉండే శత్రు క్షిపణి పథాన్ని ధనుష్ అనుకరించింది. దీన్ని స్వోర్డ్‌ఫిష్ (LRTR) రాడార్ అనుసరించగా పృథ్వి రక్షక క్షిపణి 75 కి.మీ. ఎత్తున ఛేదించింది.

2011 మార్చి 6 న DRDO అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ (AAD) ను పరీక్షించింది. మార్పు చేసిన పృథ్వి క్షిపణిని లక్ష్యంగా చేసుకుని ఈ పరీక్ష విజయవంతంగా జరిగింది. AAD క్షిపణిని వీలర్ ఐలండ్ నుండి ప్రయోగించారు. ఇది తీరంలో ఉంచిన రాడార్ల నుండి సంకేతాలు అందుకుని మ్యాక్ 4.5 వేగంతో ప్రయాణించి,శత్రు క్షిపణిని 16 కి.మీ. ఎత్తున అడ్డుకుంది.[16]

అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ (AAD)/అశ్విన్ బాలిస్టిక్ క్షిపణి వ్యతిరేక క్షిపణి[మార్చు]

అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ (AAD) ఒక బాలిస్టిక్ క్షిపణి ఛేదక క్షిపణి వ్యవస్థ. దాడికి వస్తున్న శత్రు దేశాల క్షిపణులను వాతావరణం లోపల, 30 కి.మీ. ఎత్తున, అడ్డుకునేందుకు ఈ క్షిపణిని అభివృద్ధి చేసారు. AAD ఒకే దశ కలిగిన ఘన ఇంధన క్షిపణి. దానికి ఇనర్షియల్ నేవిగేషన్ వ్యవస్థ ఉంది. ఇది భూమిపై ఉన్న రాడార్ల నుండి సంకేతాలు అందుకుంటుంది. 7.5 మీ పొడవుతో, 1.2 టన్నుల బరువుతో, 0.5 మీ వ్యాసం కలిగి ఉంటుంది.[17]

2007 డిసెంబరు 6 న, శత్రు క్షిపణిలాగా నటిస్తున్న పృథ్వి క్షిపణిని AAD విజయవంతంగా అడ్డుకుంది. వాతావరణం లోపల 15 కి.మీ. ఎత్తున ఇది జరిగింది. పరీక్షలోని అన్ని విభాగాలు సరిగ్గా అనుకున్న విధంగా పనిచేసాయి. ప్రయోగాన్ని వీడియో లింకు ద్వారా ఢిల్లీలో కూడా చూసారు.

పరీక్ష యొక్క ఘటనా క్రమం ఇలా ఉంది: చాందీపూర్ ఇంటెగ్రేటెడ్ టెస్ట్ రేంజిలో ఉన్న లాంచ్ కాంప్లెక్స్-3 నుండి ఉదయం 11 గంటలకు పృథ్వి క్షిపణి పైకి లేచింది. కోణార్క, పరదీప్ వద్ద ఉన్న రాడార్లు క్షిపణిని గుర్తించాయి. అవి క్షిపణిని నిరంతరం గమనిస్తూ ఉన్నాయి. లక్ష్యం గురించి ఈ రాడార్లు సేకరించిన సమాచారాన్ని మరింత ప్రాసెసింగు చెయ్యడం కోసం MCC కి పంపించారు. MCC, లక్ష్యం యొక్క లక్షణాలను విశ్లేషించి, క్షిపణి పథాన్ని గణించి, లక్ష్యాన్ని వీలర్ ఐలండ్ లో ఉన్న AAD బాటరీకి అప్పగించింది.

అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ (AAD)
2007 డిసెంబరులో అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ (AAD) క్షిపణి ప్రయోగంలో ఉండగా అబ్దుల్ కలాం ఐలండ్ (వీలర్ ఐలండ్) నుండి
రకంEndoatmospheric Anti-ballistic missile
అభివృద్ధి చేసిన దేశంభారత్
సర్వీసు చరిత్ర
సర్వీసులోమోహరింపు దశ
ఉత్పత్తి చరిత్ర
తయారీదారుభారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ
తయారీ తేదీ6 డిసెంబరు 2007
విశిష్టతలు
బరువు1,200 kg (2,600 lb)
పొడవు7.5 m (25 ft)
వ్యాసం<0.5 m (1.6 ft)
పేలుడు
మెకానిజమ్
కైనెటిక్ విధ్వంసం (గుద్ది చంపడం)

ఇంజనుSingle Stage[18]
ప్రొపెల్లెంటుఘన ఇంధనం
ఫ్లైట్ సీలింగు30 km (19 mi) SAM operational range = 150 km (93 mi) - 200 km (120 mi)
వేగంమ్యాక్ 4.5
గైడెన్స్
వ్యవస్థ
Inertial Navigation System
Mid-course update
Active radar homing (Terminal phase)
లాంచి
ప్లాట్‌ఫారం
Tatra TEL 8 × 8
manoeuvrability g-limits=between +25 to +30g[19]

పృథ్వి 110 కి.మీ. అపోజీకి చేరినపుడు AAD ని ప్రయోగించారు. ప్రయాణంలో రాడార్ల నుండి అందిన సమాచారం సహాయంతోను, టర్మినల్ సీకర్ రాడారు సహాయం తోను, AAD తన లక్ష్యం వైపుగా దూసుకుపోయింది. 15 కి.మీ. ఎత్తున, మ్యాక్ 4 వేగంతో AAD సూటిగా శత్రు క్షిపణిని గుద్దింది. ఆకాశంలో ఎన్నో ట్రాక్‌లు ఏర్పడడాన్ని రాడార్లు గుర్తించాయి. లక్ష్యం అనేక ముక్కలైపోయిందని దానికి అర్థం. వీలర్ ఐలండ్‌లో ఉన్న థర్మల్ కెమెరాలు కూడా ఈ విధ్వంసాన్ని పట్టుకున్నాయి.[10]

రెండు క్షిపణి ఛేదన పరీక్షలు విజయవంతమయ్యాక, శాస్త్రవేత్తలు AAD క్షిపణి పరిధిని 150 కి.మీ. వరకూ పెంచి ఓ కొత్త భూమి-నుండి-గాల్లోకి ప్రయోగించే క్షిపణిగా మార్చవచ్చని, దాన్ని అశ్విన్‌గా పిలవాలనీ భావించారు.[20]

2010 మార్చి 15 న AAD ఛేదన క్షిపణి పరీక్షను రద్దు చెయ్యవలసి వచ్చింది. లక్ష్యిత క్షిపణి దాని పథం నుండి తప్పుకుని సముద్రంలో పడిపోవడంతో ఇలా జరిగింది. AAD క్షిపణి, తన లక్ష్యాన్ని సముద్రానికి 15 నుండి 20 కి.మీ. ఎత్తున ఛేదించాల్సి ఉంది. లక్ష్యంగా ఎంచుకున్న పృథ్వి క్షిపణిని ఉదయం 10:02 కు చాందీపూర్ లోని కాంప్లెక్స్-3 నుండి ప్రయోగించారు.11  కి.మీ. ప్రయాణించాక, దాని పథం నుండి తప్పిపోయి, సముద్రంలో కూలిపోయింది.

తిరిగి, 2010 జూలై 26 న AAD ని విజయవంతంగా పరీక్షించారు.[21]

2006 నవంబరులో PAD ని పరీక్షించారు. 2007 డిసెంబరులో AAD ని పరీక్షించారు. PAD ని పరీక్షించడంతో, బాలిస్టిక్ క్షిపణి వ్యతిరేక వ్యవస్థలను అభివృద్ధి చేసుకున్న నాలుగో దేశంగా భారత్ అవతరించింది. అమెరికా, రష్యా, ఇజ్రాయిల్ లు మిగిలిన మూడు దేశాలు.[5] ఈ వ్యవస్థ చాలా పరీక్షలకు లోనయ్యింది. దీన్ని అధికారికంగా ప్రారంభించవలసి ఉంది.

2012 ఫిబ్రవరి 10 న, AAD మళ్ళీవిజయవంతంగా పరీక్షించారు.[22]

2012 నవంబరు 23 న సూపర్‌సోనిక్ AAD క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. "భారత్ తన పై దాడి చేసే శత్రు క్షిపణులకు వ్యతిరేకంగా క్షిపణి రక్షక కవచాన్ని నిర్మించుకోవడంలో భాగమే ఈ పరీక్ష. చాందీపూర్ నుండి ప్రయోగించిన శత్రు క్షిపణిని, వీలర్ ఐలండ్ నుంచి ప్రయోగించిన AAD ఛేదక క్షిపణి గాలిలో అడ్డుకుంది"[23]

2015 ఏప్రిల్ 6 న మెరుగు పరచిన AAD ని పరీక్షించారు. క్షిపణిని మొదటిసారిగా క్యానిస్టరు నుండి ప్రయోగించారు. కాంపోసైట్ రాకెట్ మోటారు విజయవంతంగా మండింది. గత క్షిపణి కంటే పెద్ద వార్‌హెడ్ తోను, మెరుగైన మనూవరబిలిటీ తోను, ఈ కొత్త క్షిపణిని తయారు చేసారు. క్షిపణి గాల్లోకి లేచాక, ఒక ఉపవ్యవస్థ సరిగ్గా పనిచెయ్యకపోవడాన, క్షిపణి దాని పథం నుండి తప్పి ప్రయోగం విఫలమైంది. సమస్యను పరిష్కరించి, 30–45 రోజుల తరువాత మళ్ళీ పరీక్షించాల్సి ఉంది .[24][25]

2015 నవంబరు 22 న AAD యొక్క మెరుగైన కూర్పును విజయవంతంగా పరీక్షించారు. వీలర్ ఐలాండ్ నుండి ఉదయం 9.40 గంటలకు ప్రయోగించిన క్షిపణికి ఎలక్ట్రానిక్ గా సిమ్యులేట్ చేసిన లక్ష్యాన్ని ఛేదించమని క్షిపణికి ఆదేశాలిచ్చారు. లక్ష్యం యొక్క కోఆర్డినేట్లు రాగానే ఛేదక క్షిపణి సూపర్‌సోనిక్ వేగంతో ప్రయాణిస్తూ లక్ష్యాన్ని గాల్లోనే ధ్వంసం చేసింది.[26]

2016 మే 15 న నౌక నుండి ప్రయోగించిన పృథ్వి క్షిపణిని AAD అడ్డుకుని ధ్వంసం చేసిందని DRDO చెప్పింది.[27] అయితే, హిందూ పత్రికలో ఈ పరీక్ష విఫలమై ఉండవచ్చని రాసారు.[28][29]

స్వోర్డ్‌ఫిష్ రాడార్[మార్చు]

స్వోర్డ్‌ఫిష్, క్షిపణి రక్షక వ్యవస్థకు లక్ష్యాన్ని పట్టుకునేందుకు, ఫైర్ నియంత్రణకు పనిచేస్తుంది. ప్రస్తుతం LRTR పరిధి 600 కి.మీ. నుండి 800  కి.మీ. వరకు ఉంది. ఈ దూరంలో క్రికెట్ బంతి పరిమాణంలో ఉన్న వస్తువులను కూడా ఇది గుర్తించగలదు. 2011 నాటికి దీని పరిధిని 1,500  కి.మీ.కు పెంచాలని DRDO లక్ష్యంగా పెట్టుకుంది.[30]

రెండవ దశ[మార్చు]

మధ్యంతర పరిధి బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకునే రెండు కొత్త క్షిపణులను తయారు చేస్తున్నారు. ఈ అతి వేగవంతమైన క్షిపణులు (AD-1, AD-2) 5,000  కి.మీ. పరిధి గల క్షిపణులను అడ్డుకునేందుకు తయారు చేస్తున్నారు.[31] 2011 లో ఈ క్షిపణులను పరీక్షించే అవకాశం ఉంది.[32] ఈ కొత్త క్షిపణి అమెరికా మోహరించిన THAAD క్షిపణిని పోలి ఉంటుంది. ఈ క్షిపణులు హైపర్‌సోనిక్ వేగాలతో ప్రయాణిస్తాయి. వీటిని కనుక్కునేందుకు 1500 కి.మీ. పై చిలుకు దూరాలను చూడగలిగే రాడార్లు అవసరమౌతాయి.[33] 2012 మే 6 న, డా వికె సరస్వత్ మొదటి దశ పూర్తయిందని చెబుతూ, 5,000 కి.మీ. పరిధి గల క్షిపణులను ఎదుర్కొనే రెండవ దశ 2016 కల్లా పూర్తవుతుందని చెప్పాడు.[34]

భారత్‌పై దాడి చేసేందుకు శత్రు క్షిపణులను లాంచ్ చేసీ చెయ్యగానే వాటిని కూల్చేసేందుకు ఓ లేజర్ ఆధారిత ఆయుధ వ్యవస్థను అభివృద్ధి చెయ్యాలని భారత్ సంకల్పిస్తోంది. అణ్వాయుధ సహిత బాలిస్టిక్ క్షిపణిని బూస్ట్ దశలోనే ధ్వంసం చెయ్యడం ఉత్తమమని DRDO డైరెక్టరు వికె సరస్వత్ చెప్పాడు. ఈ వ్యవస్థ ఉపయోగంలోకి రావాలంటే మరో 10-15 ఏళ్ళు పడుతుందని కూడా ఆయన చెప్పాడు.[35]

PDV[మార్చు]

2009 లో PDV అనే ఓ కొత్త క్షిపణి గురించిన వార్తలు వెలువడ్డాయి. DRDO, PDV అనే సంకేత నామం గల ఓ కొత్త పృథ్వి ఇంటర్‌సెప్టార్ క్షిపణిని తయారు చేస్తోంది. దాని రెండు దశల్లోనూ ఘన ఇంధనాన్ని ఉపయోగిస్తారు. 150 కి.మీ. కంటే ఎత్తున వాహనాన్ని నియంత్రించడానికి దానిలో ఒక వినూత్న వ్యవస్థ ఉంది. PAD/AAD యుగళంలో PAD ని తొలగించి దాని స్థానాన్ని PDV తో భర్తీ చేస్తారు. దానికి కూడా IIR సీకర్ ఉంటుంది. PDV లో PAD కంటే ఎంతో ఎక్కువ సామర్థ్యం గల క్షిపణి ఉంటుంది. దీనితో BMD వ్యవస్థ యొక్క మొదటి దశ పూర్తయి, 2013 కల్లా మోహరింపు దశకు వస్తుంది. అక్కడి నుండి రెండవ దశ అభివృద్ధి మొదలౌతుంది. అది 5,000 కి.మీ. పై చిలుకు పరిధితో ఉండే శత్రు క్షిపణుల నుండి రక్షణకు కృషిచేస్తుంది.[36] మొదటి పరీక్ష 2010 లో చేసేందుకు సంకల్పించారు.[37] లక్ష్యిత క్షిపణిని 150 కి.మీ. ఎత్తున అడ్డుకునేందుకు PDV రూపకల్పన చేసారు.[38] మొదటి PDV ని 2014 ఏప్రిల్ 27 న విజయవంతంగా పరీక్షించారు.[39]

అమెరికా అందించిన సహకారం[మార్చు]

అమెరికా డెప్యూటీ డిఫెన్స్ సెక్రెటరీ ఆష్టన్ కార్టర్ ప్రకారం, బాలిస్టిక్ క్షిపణుల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చెయ్యడంలో భారత్‌తో సహకారానికి అమెరికాకు అవకాశం ఉంది. "మన రెండు దేశల సహకారానికి ఇది ఒక ముఖ్యమైన రంగం" అని 2012 జూలైలో తన భారత పర్యటనలో కార్టర్ చెప్పాడు.[40]

మోహరింపు[మార్చు]

DRDO డైరెక్టరు వి కె సరస్వత్ చెప్పిన ప్రకారం ఈ క్షిపణులు సంయుక్తంగా లక్ష్య ఛేదనలో 99.8 శాతం సఫలమౌతాయి. 2012 మే 6 న మొదటి దశ పూర్తయిందని ఆయన ధ్రువీకరించాడు. తక్కువ వ్యవధిలోనే రెండు భారతీయ నగరాలను క్షిపణి రక్షణ కవచం లోకి తీసుకు రాగలమని చెప్పాడు. మొదటి దశ PAC-3 వ్యవస్థతో సరిపోల్చదగినది అని కూడా ఆయన చెప్పాడు..[41][42] ఢిల్లీ ముంబై నగరాలు క్షిపణి రక్షణ కవచం కోసం ఎంపికయ్యాయి.[43] ఈ రెందు నగరాల్లో విజయవంతంగా ఏర్పాటు చేసాక, దేశంలోని ఇతర నగరాలకు కూడా ఈ వ్యవస్థను విస్తరిస్తారు.[44] 2,500 కి.మీ. దూరం నుండి ప్రయోగించిన క్షిపణులను కూడా ఈ వ్యవస్థ అడ్డుకోగలదు. రెందవ దశ పూర్తై, PDV ని అభివృద్ధి చేసాక, రెండు ఛేదక క్షిపణులు కలిసి 5,000 కి.మీ. దూరం నుండి వచ్చే క్షిపణులను కూడా ఛేదించగలవు. రెండు కలిసి 99.8 శాతం సంభావ్యతతో శత్రు క్షిపణులను ఛేదించగలవు.[45][46]

ఎస్-400[మార్చు]

2015 అక్టోబరులో డిఫెన్స్ ఎక్విజిషన్ ఏజెన్సీ 12 S-400 క్షిపణులను సేకరిస్తోందని వార్తలు వచ్చాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2015 డిసెంబరులో చేసిన రష్యా పర్యటనకు ముందు ఈ ఒప్పందం ఖరారు కావలసి ఉంది. 2015 డిసెంబరు 17 న ఆర్డరు 12 కు కాక, ఐదింటికి మాత్రమే నని ధ్రువీకరించబడింది. దీని విలువ 40,000 కోట్ల రూపాయలు. తగ్గిన సంఖ్య భారత రక్షణ అవసరాలకు సరిపోతుందని భావిస్తున్నారు.[47]

క్రూయిజ్ క్షిపణి ఛేదక క్షిపణి[మార్చు]

క్రూయిజ్ క్షిపణి దాడిని ఎదుర్కోవడమంటే తక్కువ ఎత్తులో ఎగురుతున్న విమానాన్ని ఎదుర్కోవడం లాంటిదే. విమాన దాడులను ఎదుర్కొనే రక్షణ పద్ధతులు దీనికీ వినియోగించవచ్చు.

ఆణ్వాయుధ యుత క్రూయిజ్ క్షిపణి దాడుల ముప్పును ఎదుర్కొనేందుకు గాను క్రూయిజ్ క్షిపణులను ఎదుర్కొనే కార్యక్రమాన్ని భారత్ చేపట్టింది. AADలో ఉన్న సాంకేతికతను ఇందుకు వాడుకోవచ్చని DRDO భావించింది.[48] డా వి కె సరస్వత్ ఓ ఇంటర్వ్యూలో ఇలా అన్నాడు, "మా అధ్యయనాల ప్రకారం క్రూయిజ్ క్షిపణిని అడ్డుకునేందుకు AAD సరిపోతుంది,"[48]

పైగా, క్రూయిజ్ క్షిపణులను కనుక్కోగలిగే AWACS లాంటి ఎయిర్‌బోర్న్ రాడార్లను భారత్ సమకూర్చుకుంటోంది. దీంతో ముప్పును ఎదుర్కోగలిగే సామర్థ్యాన్ని పెంచుకుంటోంది.[48]

ఛేదక క్షిపణిని ప్రయోగించాక, లక్ష్యానికి సంబంధించిన సమాచారాన్ని రాడార్ నుండి ఒక డేటా లింకు ద్వారా పంపిస్తారు. ఛేదక క్షిపణి లక్ష్యిత క్షిపణిని సమీపించాక, అది రాడార్ సీకర్ ను చేతనం చేసి, లక్ష్యిత క్షిపణిపై లంఘించడానికి తనకు తాను మార్గ నిర్దేశకత్వం చేసుకుంటుంది. లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించడానికి ఒకే లక్ష్యం పైకి ఒకటి కంటే ఎక్కువ PAD, AAD ఛేదక క్షిపణులను ప్రయోగించే వీలు ఉంది.[9]

బరాక్-8 ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (IAI), DRDO సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న దూర పరిధి క్షిపణి వ్యతిరేక, విమాన వ్యతిరేక రక్షణ వ్యవస్థ. ఒక రకం బరాక్-8 క్షిపణిని మధ్యదూర పరిధి గల, భూమి-నుండి-గాల్లోకి ప్రయోగించే రక్షణ క్షిపణిగా వాడాలని భారత సైన్యం సంకల్పించింది. యుద్ధనౌకలను శత్రు క్రూయిజ్ క్షిపణుల నుండి కాపాడే శక్తి బరాక్ యొక్క నావల్ కూర్పుకు ఉంది. భారత్ సైన్యం తరువాత, భారత వాయు సేన కూడా ఈ క్షిపణిని సమకూర్చుకుంటోంది. ఈ క్షిపణి అభివృద్ధి కోసం భారత్ ఇజ్రాయిల్ తో కలిసి సంయుక్త సంస్థను ఏర్పాటు చేసింది. ఇటీవలే భారత్ అభివృద్ధి చేసిన ఆకాశ్ క్షిపణి వ్యవస్థకు యుద్ధ విమానాలను, క్రూయిజ్ క్షిపణులను, గాల్లో నుండి భూమ్మిదకు ప్రయోగించే క్షిపణులను అడ్డుకునే శక్తి ఉంది.

2010 నవంబరు 17 న, రాఫేల్ వైస్ ప్రెసిడెంట్ లోవా డ్రోరి మాట్లాడుతూ భారత్‌కు డేవిడ్‌స్ స్లింగ్ ను ఇవ్వ జూపామని తెలిపాడు.[49][50]

ఆంతర్జాతీయ ప్రతిస్పందన[మార్చు]

పాకిస్తాన్[మార్చు]

2016 మే 15 న భారత్ చేసిన పరీక్ష విజయవంతమయ్యాక, మే 20 న పాకిస్తాన్ దీనిపై ఆందోళన వ్యక్తం చేసింది. దేశ రక్షణను మెరుగుపరచేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని పాకిస్తాన్ ప్రకటించింది.[51]

మూలాలు వనరులు[మార్చు]

  1. Ratliff, Ben (30 November 2012). "India expects to use missile interception system as a weapon, top scientist says". International Herald Tribune. Archived from the original on 9 డిసెంబరు 2006. Retrieved 6 December 2012.
  2. "India developing new missiles Towards destroying hostile missiles". The Hindu. 3 December 2006. Archived from the original on 5 డిసెంబరు 2006. Retrieved 6 December 2012.
  3. The New Guardian Archived 2008-02-02 at the Wayback Machine India unveils an all new anti-ballistic missile expected to be the fore-runner of a sophisticated air defence system to thwart, among other threats, a Pakistani nuclear weapons attack [dead link]
  4. "India tests interceptor missile". Google. 6 March 2009. Retrieved 6 December 2012.
  5. 5.0 5.1 Ratliff, Ben. "India successfully tests missile interceptor". International Herald Tribune. Archived from the original on 10 మార్చి 2009. Retrieved 6 December 2012.
  6. Quoted in News Desk, "Pakistan May Use Any Weapon," The News, 31 May 1999.
  7. Pakistan's Nuclear Weapons Program (PDF)
  8. Options Available to the United States to Counter a Nuclear Iran By George Perkovich – Testimony by George Perkovich before the House Armed Services Committee, 1 February 2006
  9. 9.00 9.01 9.02 9.03 9.04 9.05 9.06 9.07 9.08 9.09 Interview: Vijay Kumar Saraswat[permanent dead link][dead link]
  10. 10.0 10.1 T.S. SUBRAMANIAN (22 December 2007). "Smashing hit". Frontline. Chennai, India. Archived from the original on 17 ఆగస్టు 2011. Retrieved 6 February 2008.
  11. "India to test Layered Missile Defence – Frontier India – News, Analysis, Opinion – Frontier India – News, Analysis, Opinion". Frontier India. Archived from the original on 27 ఆగస్టు 2012. Retrieved 2 August 2012.
  12. India Plans Second Anti-Ballistic-Missile Test in June Archived 11 July 2009 at the Wayback Machine.
  13. Missile shield interceptor rocket to be test-fired again[dead link]
  14. "Crucial interceptor missile test this week". The Hindu. Archived from the original on 8 నవంబరు 2012. Retrieved 6 December 2012.
  15. Missile shield Archived 31 January 2009 at the Wayback Machine.
  16. "Interceptor missile test fired successfully". Ndtv.com. 6 March 2011. Retrieved 6 December 2012.
  17. "Interceptor missile scores 'direct hit'". The Hindu. 7 December 2007. Archived from the original on 26 అక్టోబరు 2012. Retrieved 6 December 2012.
  18. Aroor, Shiv (1 February 2007). "Another anti-missile test planned for June". The Indian Express. Retrieved 27 January 2008.
  19. https://www.youtube.com/watch?v=-pBQjJXQM7s
  20. "India's interceptor missile test yields new surface-to-surface missile as a spin off – Thaindian News". Thaindian.com. 12 December 2007. Archived from the original on 16 అక్టోబరు 2012. Retrieved 2 August 2012.
  21. "Advanced Air Defence interceptor missile successfully test-fired". NDTV.com. 26 July 2010. Retrieved 2 August 2012.
  22. "India successfully test-fires missile interceptor". The Times of India. 10 February 2012.
  23. "India successfully test-fires AAD missile interceptor". 23 November 2012. Archived from the original on 11 మార్చి 2013. Retrieved 25 జూలై 2016.
  24. Star Wars setback as DRDO interceptor missile malfunctions
  25. Interceptor missile test off Odisha coast fails
  26. "Upgraded interceptor missile successfully hits virtual target". 22 November 2015.
  27. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-05-18. Retrieved 2016-07-25.
  28. http://www.thehindu.com/news/national/interceptor-missile-mission-a-failure/article8634085.ece
  29. http://thediplomat.com/2016/05/did-india-hide-a-failed-supersonic-missile-test/
  30. Peerzada Abrar (3 December 2009). "Major defence deals up for grabs". The Economic Times. Retrieved 6 December 2012.
  31. "India to develop high speed interceptors". The Hindu. 7 January 2008. Archived from the original on 5 నవంబరు 2012. Retrieved 6 December 2012.
  32. "India developing ballistic missiles to destroy IRBMs, ICBMs". Earthtimes.org. Archived from the original on 4 ఫిబ్రవరి 2013. Retrieved 6 December 2012.
  33. "DRDO readies shield against Chinese ICBMs". India Today. 9 March 2009. Retrieved 6 December 2012.
  34. "Missile defence shield ready: DRDO chief". The Hindu. Press Trust of India. 6 May 2012. Retrieved 6 December 2012.
  35. "India plans to use laser weapons in Ballistic Missile Defence". The Hindu. Chennai, India. 18 January 2009. Archived from the original on 1 ఫిబ్రవరి 2011. Retrieved 25 జూలై 2016.
  36. "DRDO readies shield against Chinese ICBMs". India Today. 9 March 2009. Retrieved 6 December 2012.
  37. "DRDO publication Jan 2010" (PDF). Archived from the original (PDF) on 2013-04-11. Retrieved 2016-07-25.
  38. "DRDO to launch series of missiles". The Hindu. Retrieved 6 December 2012.
  39. "India Successfully Test-Fires New Interceptor Missile". News.outlookindia.com. Archived from the original on 2014-04-28. Retrieved 2014-04-30.
  40. "Potential for cooperation with India to develop BMD: US". Business Standard. 23 July 2012. Retrieved 25 July 2012.
  41. "Missile defence shield ready: DRDO chief". The Hindu. Press Trust of India. 6 May 2012. Retrieved 6 December 2012.
  42. Rajat Pandit (26 November 2007). "India on way to joining exclusive BMD club". The Times of India. Retrieved 6 December 2012.
  43. "Delhi, Mumbai selected for ballistic missile defence shield". 24 June 2012.
  44. "Delhi, Mumbai to get missile defence shield – NDTV News". Ndtv.com. 24 June 2012. Archived from the original on 12 ఏప్రిల్ 2013. Retrieved 6 December 2012.
  45. "More Teeth to Defence System". IBNLive. Archived from the original on 24 సెప్టెంబరు 2015. Retrieved 27 July 2012.
  46. "Delhi, Mumbai to be first provided with missile defence shield". The Economic Times. Press Trust of India. 24 June 2012. Retrieved 6 December 2012.
  47. [1]
  48. 48.0 48.1 48.2 "India discovers methods to face missile wars". IBNLive. 16 Dec 2007. Archived from the original on 24 సెప్టెంబరు 2015. Retrieved 8 August 2012.
  49. "Rafael Confirms Offer of Iron Dome, David's Sling to Indian Armed Forces". India-defence.com. Retrieved 2013-04-19.
  50. India in talks to buy Iron Dome, David's Sling
  51. http://www.dnaindia.com/india/report-wary-pakistan-pushes-un-to-declare-indian-ocean-nuclear-free-zone-2214563