Jump to content

భూమి ధ్రువప్రాంతాలు

వికీపీడియా నుండి
భూమి ఉత్తర దక్షిణ ధ్రువప్రాంతాలను కప్పేసిన మంచు, ఐసు ల దృశ్యం
ఉత్తరార్ధగోళంలో శాశ్వత మంచు (శాశ్వతంగా ఘనీభవించిన నేల) - ఊదా రంగులో

భౌగోళిక ధ్రువాల (ఉత్తర దక్షిణ ధ్రువాలు) చుట్టూ ధ్రువ చక్రాల లోపల ఉండే ప్రాంతాలను భూమి ధ్రువ ప్రాంతాలు అంటారు. వీటిని స్తబ్ధ మండలాలు అని కూడా పిలుస్తారు. ఈ అధిక అక్షాంశాల వద్ద నీటిలో తేలే సముద్రపు ఐసు ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం, దక్షిణాన అంటార్కిటికా ఖండంలో అంటార్కిటిక్ మంచు పలక ఉన్నాయి.

నిర్వచనాలు

[మార్చు]

ఆర్కిటిక్ కు నిర్వచనం: ఆర్కిటిక్ సర్కిల్‌కు ఉత్తరాన ఉన్న ప్రాంతం (2010 లో 66 ° 33'44 "N వద్ద), లేదా 60 ° ఉత్తర అక్షాంశానికి ఉత్తరాన ఉన్న ప్రాంతం లేదా ఉత్తర ధ్రువం నుండి దక్షిణంగా వృక్షశ్రేణి వరకూ ఉన్న ప్రాంతం అనీ ఆర్కిటిక్కు వివిధ నిర్వచనాలు ఉన్నాయి.

అంటార్కిటిక్ అంటే సాధారణంగా 60° దక్షిణ అక్షాంశానికి దక్షిణాన ఉన్న ప్రాంతం అని నిర్వచిస్తారు. అంటార్కిటికా ఖండం అని కూడా దీన్ని అంటారు. 1959 అంటార్కిటిక్ ఒప్పందంలో మొదటి నిర్వచనాన్ని ఉపయోగించారు.

రెండు ధ్రువ ప్రాంతాలు కాకుండా భూమిపై మరో రెండు వాతావరణ, బయోమెట్రిక్ పట్టీలున్నాయి. అవి భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న ఉష్ణమండల పట్టీ ఒకటి, ఉష్ణమండలానికి ఉత్తర ధ్రువ ప్రాంతానికీ మధ్యనా, ఉష్ణమండలానికి దక్షిణ ధ్రువ ప్రాంతానికీ మధ్యనా ఉండే రెండు ప్రాంతాలు మరోకటి.

శీతోష్ణస్థితి

[మార్చు]

ధ్రువ ప్రాంతాల వద్ద సౌర వికిరణం, భూమి పైని ఇతర ప్రాంతాల వద్ద కంటే తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో సూర్యుడి శక్తి వాలుగా ఉన్న కోణంలో పడి, పెద్ద విస్తీర్ణంలో వ్యాపిస్తుంది. పైగా ఇది భూ వాతావరణంలో ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. సౌర వికిరణం ఈ వాతావరణంలో కరిగి, చెల్లాచెదురై, ప్రతిబింబింపబడి పోతుంది. భూమిపైనున్న ఇతర ప్రాంతాల్లో శీతాకాలాలు మిగతా కాలాల కంటే చల్లగా ఉండటానికి కూడా ఇదే కారణం.

భూమి భ్రమణాక్షపు వాలు ధ్రువ ప్రాంతాల వాతావరణంపై ప్రధాన ప్రభావాన్ని చూపుతుంది. అయితే, ధ్రువ ప్రాంతాలు భూమధ్యరేఖకు చాలా దూరంలో ఉన్నందున, అక్కడ సౌరవికిరణం బలహీనంగా ఉంటుంది. ముందే తక్కువగా ఉండే ఈ సూర్యకాంతిలో ఎక్కువ భాగాన్ని పెద్ద మొత్తంలో ఉన్న ఐసు, మంచులు వెనక్కి ప్రతిఫలిస్తాయి. ఇది శైత్యానికి దోహదం చేస్తుంది. ధ్రువ ప్రాంతాల్లో చాలా తక్కువ ఉష్ణోగ్రతలు ఉండి, తగినంత అవపాతం ఉన్నచోట భారీ గ్లేసియేషను జరిగి శాశ్వతమైన మంచు ఏర్పడుతుంది. పగటి సమయాల్లో తీవ్రమైన వైవిధ్యాలు ఉంటాయి. వేసవిలో ఇరవై నాలుగు గంటల పగలు, శీతాకాలం మధ్యకాలంలో పూర్తిగా చీకటి ఉంటాయి.

సర్కంపోలార్ ఆర్కిటిక్ ప్రాంతం

[మార్చు]
ఉత్తర ధ్రువ ప్రాంతం ధ్రువ ఎలుగుబంట్లు

భూమి ఉత్తర ధ్రువ ప్రాంతంలో అనేక స్థావరాలు ఉన్నాయి. ఆర్కిటిక్ ప్రాంతాలలో తమ దేశ భూభాగం ఉన్న దేశాలు: అమెరికా (అలాస్కా), కెనడా (యుకాన్, వాయవ్య భూభాగాలు, నునావుట్), డెన్మార్క్ (గ్రీన్లాండ్), నార్వే, ఫిన్లాండ్, స్వీడన్, ఐస్‌ల్యాండ్, రష్యా. ఈ ధ్రువ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు తమతమ దేశాల్లోని ఇతర ప్రాంతాల ప్రజలతో కంటే ఇతర ధ్రువ ప్రాంతాల ప్రజల తోటే ఎక్కువ సారూప్యతలుంటాయిఅందుకని, ఉత్తర ధ్రువ ప్రాంతం మానవ స్థావరాలు, సంస్కృతులలో వైవిధ్యత ఉంటుంది.

అంటార్కిటికా, దక్షిణ సముద్రం

[మార్చు]
ఉత్తర ధ్రువ ప్రాంతపు ధ్రువ ఎలుగుబంట్లు

దక్షిణ ధ్రువ ప్రాంతంలో శాశ్వత మానవ నివాసం లేదు. [1] మెక్‌ముర్డో స్టేషన్ అంటార్కిటికా లోని అతిపెద్ద పరిశోధనా కేంద్రం, దీనిని అమెరికా నిర్వహిస్తుంది. పామర్ స్టేషన్, అముండ్సెన్-స్కాట్ సౌత్ పోల్ స్టేషన్ (అమెరికా), ఎస్పెరంజా బేస్, మరాంబియో బేస్ ( అర్జెంటీనా ), స్కాట్ బేస్ ( న్యూజిలాండ్ ), వోస్టాక్ స్టేషన్ (రష్యా), ఇతర ముఖ్యమైన స్టేషన్లు. భారతదేశం దక్షిణ గంగోత్రి అనే స్టేషన్ను నిర్వహిస్తోంది.

స్వదేశీ మానవ సంస్కృతులు లేనప్పటికీ, ముఖ్యంగా అంటార్కిటికా తీర ప్రాంతాలలో సంక్లిష్టమైన పర్యావరణ వ్యవస్థ ఉంది. తీరప్రాంతాల్లో ఉండే పొంగు, సమృద్ధిగా పోషకాలను అందిస్తుంది. ఇది ఒక రకమైన సముద్రపు క్రస్టేషియాను అయిన క్రిల్‌కు ఆహారాన్ని ఇస్తుంది. ఈ క్రిల్, పెంగ్విన్‌ల నుండి నీలి తిమింగలాల వరకు అనేక జీవులకు ఆహారం.

మూలాలు

[మార్చు]

 

  1. Matthew Teller (20 June 2014). "Why do so many nations want a piece of Antarctica?" (in English). BBC. Retrieved 22 March 2019.{{cite web}}: CS1 maint: unrecognized language (link)

బాహ్య లంకెలు

[మార్చు]