మండాజి నర్సింహాచారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండాజి నర్సింహాచారి
మండాజి నర్సింహాచారి
జననం
మండాజి నర్సింహాచారి

10 జూన్ 1979
నవీపేట
విద్యబి.యస్సీ (ఎలక్ట్రానిక్స్), బి.టెక్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
శాస్త్రవేత్త.
జీవిత భాగస్వామిశ్వేత
పిల్లలుచరిత్ చారి
తల్లిదండ్రులు
  • సత్యనారాయణ (తండ్రి)
  • లక్ష్మీబాయి (తల్లి)
చారీ ఫార్ములాతో పాడైపోయిన ట్యూబ్ లైటు వెలిగిస్తున్న నరసింహాచారి

మండాజి నర్సింహాచారి తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువ శాస్త్రవేత్త. ఆయన ఆరిపోయిన ట్యూబ్ లైట్లతో మళ్లీ వెలుగులు నింపేందుకు క్రొత్త ఆవిష్కరణ "చారి ఫార్ములా" ను రూపొందించాడు.[1] ప్రపంచంలో అనేక దేశాలలో ప్రజల మరణానికి కారణమవుతున్న మహమ్మారి కరోనా వైరస్ ను 15 సెకెన్లలో అంతంచేసే కరోనా వైరస్ సంహారిణి (యూవీ బాక్స్) ను రూపొందించాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

మండాజి నరసింహాచారి నిజామాబాదు జిల్లా కు చెందిన నవీపేట్ గ్రామంలో 1979 జూన్ 10న సత్యనారాయణ, లక్ష్మీబాయి దంపతులకు జన్మించాడు.[2] బాల్యం నుండి అతను ఎలక్ట్రానిక్స్ రంగంలో ఆసక్తి కలిగియుండేవాడు. చిన్నతనంలో తన తోటి బాలలు ఆటలపై శ్రద్ధ కనబరుస్తుంటే నరసింహాచారి ప్లాస్టిక్, సిలికాన్, లిథియం తో తయారయ్యే వస్తువులను పరిశీలించేవాడు. తన మామయ్యకు గల మెకానిక్ షాపులో గల విద్యుత్ మోటార్లు, విద్యుదయస్కాంతంతోపనిచేసే బొమ్మల గూర్చి, అవి పనిచేసే విధానం గూర్చి నిశితంగా పరిశీలించేవాడు. ఒకనాడు తన గ్రామంలో పాడైపోయిన ట్యూబ్ లైట్లను ఊరి చివర గల చెత్తలో వేయుటను అతను గమనించాడు. ఆ పాడైపోయిన ట్యూబ్ లైట్లు మరలా తిరిగి వెలిగించలేమా? అనే సందేహంతో ఎలక్ట్రీషియన్ కు తనకు గల సందేహాలను అడిగాడు. అవి తిరిగి పనిచేయవు అని తెలులుసున్న తరువాత అతను తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడే కాలిపోయిన ట్యూబ్ లైట్లను తిగిగి వెలిగించుటకు అనేక ప్రక్రియల కోసం పరిశోధనలు మొదలుపెట్టాడు. ట్యూబ్ లైట్లలో గల వివిధ పరికరాల గూర్చి గ్రంథాలయంలో గల వివిధ పుస్తకాలను చదివి తెలుసుకున్నాడు. అనేక పరిశోధనలు చేసి చివరికి ఆయన కాలిపోయిన ట్యూబ్ లైట్ ను కూడా వెలిగించగల సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించి అందరిని అబ్బురపరచిన ఆవిష్కర్త గా చరిత్రలో నిలిచాడు. ఈయన రూపొందించిన ఈ పరికరం మాడిపోయిన ట్యూబ్‌లైట్ ను వెలిగించటమే ప్రధానమైనను ఈ పరికరం ద్వారా కొత్త ట్యూబ్‌లైట్ నూ వెలిగించవచ్చు. ఈ పరికరం ద్వారా ట్యూబ్‌లైట్‌ను వెలిగించినట్లయితే విద్యుత్ ఆదా కూడా అవుతుంది. ఇతను రూపొందించిన పరికరం ద్వారా ట్యూబ్‌లైట్ వెలుగునప్పుడు గతకడం కూడా జరగదు, తడిసినా నీటిలో మునిగినా లైట్ వెలుగునిస్తూ ఉంటుంది.

ఆయన కనుగొన్న "చారీ ఫార్ములా" తో ఆరిపోయిన ట్యూబ్ లైట్లను వెలిగించుటలో, ట్యూబ్ లైట్ల వ్యర్థాలనుండి పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టడంలో చేసిన కృషి ప్రపంచ మేథావులను అబ్బురపరచింది. ఆయన చేసిన "చారీ ఫార్ములా" ను, నిజామాబాదు మ్యునిసిపాలిటీ ముందుకు వచ్చి, వీధి దీపాలకు అమర్చింది. ఆయనకు అనేక అంతర్జాతీయ, జాతీయ అవార్డులు వచ్చాయి.

చారి ఫార్ములా

[మార్చు]

గ్రామ విద్యుత్ దీపాలు

[మార్చు]

మాడిపోయిన ట్యూబ్‌లైట్ లో మళ్ళీవెలుగులు నింపేందుకు నర్సింహాచారి రూపొందించిన పరికరం పేరు చారీ ఫార్ములా.[3] ఈ పరికరం వల్ల గ్రామాలలో నివసిస్తున్న ప్రజలు వారి ఇండ్లలో కాలిపోయిన /కొత్త ట్యూబ్‌లైట్ ను వెలిగించవచ్చు. ఈ ట్యూబ్ లైట్ చోక్, స్టార్టర్ లేకుండా తక్కువ వోల్టేజిలో పనిచేస్తుంది. దీనిని ఉపయోగించడం చాలా సులభం ఈ ఆవిష్కరణకు గాను అనేక పురస్కారాలను పొందాడు.

కరోనా వైరస్ సంహారిణి

[మార్చు]

అతను కరోనా వైరస్ ను అంతమొందించే పరికరం ఆవిష్కరించాడు. అతను యూవీసీ లైట్ సాయంతో అతినీలలోహిత కిరణాల ద్వారా వైరస్ లను సమూలంగా దూరం చేసే పరికరాన్ని ఆవిష్కరించాడు. అదే యూవీ బాక్స్. ఈ పరికరానికి హైదరాబాదులోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) వారు ప్రశంసించారు.ఆ సంస్థ ఈ పరికరం ద్వారా కరోనా వైరస్ 100 శాతం ఖచ్చితంగా చంపబడుతుందని నిర్థారించింది. ఈ పరికరాన్ని అభివృద్ధి చేసేందుకు నరసింహాచారి తో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. [4] ఈ పరికరం ద్వారా 15 సెకండ్లలో కరోనా వైరస్ సంహరించబడుతుందని నిర్థారణ అయింది. ఈ ఆవిష్కరణకు తెలంగాణ రాష్ట్ర ఐ.టీ శాఖామంత్రి కె.టి.రామారావు అతనిని ప్రశంసించారు.

చిత్రమాలిక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Ideas from the abyss need ground to grow
  2. "Indian Edison Mandaji Narasimhachary". Archived from the original on 2016-03-07. Retrieved 2015-09-09.
  3. Ideas from the abyss need ground to grow-Dr N R Sudheendra Rao, July 29, 2013, DHNS
  4. Telangana, Namasthe. "Namasthe Telangana ePaper". Namasthe Telangana ePaper. Retrieved 2021-08-07.

ఇతర లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.