మగాహి భాష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మగాహి
  • मगही/मागधी
  • মগহী/মাগধী
  • ମଗହୀ/ମାଗଧୀ
స్థానిక భాషభారతదేశం
ప్రాంతంబీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా,అస్సాం[1][2][3]
స్థానికంగా మాట్లాడేవారు
2 కోట్ల 70 లక్షలు (2011 జనాభా లెక్కలు)
భరోపెలి
  • ఇండో-ఇరానియన్ భాషలు
    • ఇండో-ఆర్యన్ భాషా కుటుంబం
      • తూర్పు ఇండో-ఆర్యన్ భాషలు
        • బిహారీ భాషలు
          • మగాహి
దేవనాగరి లిపి

బెంగాలీ లిపి
ఒడియా లిపి

కైతి లిపి
అధికారిక హోదా
అధికార భాష
 భారతదేశం (జార్ఖండ్ రెండవ భాష)[4]
భాషా సంకేతాలు
ISO 639-2mag
ISO 639-3mag

మగాహి లేదా మాగధీ భాష భారతదేశంలోని మధ్య ప్రాచ్య జిల్లాలలో మాట్లాడే ప్రధాన భాష. ఇది భోజ్‌పురి, మైథిలీ భాషలకు దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. దీనిని దేవనాగరి లిపిలో వ్రాస్తారు. 2002లో మగాహి మాట్లాడే వారి సంఖ్య దాదాపు 13 మిలియన్లు. దీనిని ప్రధానంగా భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలోని గయా, పాట్నా, రాజ్‌గిర్, నలంద, జెహానాబాద్, అర్వాల్, నవాడా, ఔరంగాబాద్ ప్రాంతాల్లో మాట్లాడతారు.

మగాహి కూడా మతపరమైన భాషగా గుర్తింపు పొందింది. అనేక జైన గ్రంథాలు మాగాహి భాషలో వ్రాయబడ్డాయి. ఇది నేటికీ మనుగడలో ఉంది. 1960-62 మధ్యకాలంలో గౌతమ్ మహాకవి యోగేష్ మగాహి మొదటి కావ్యాన్ని రచించాడు. ఇతను ఆధునిక మగాహి భాషలో అత్యంత ప్రజాదరణ పొందిన కవిగా పరిగణించబడ్డాడు. భారతదేశంలో అతని జన్మదినమైన అక్టోబర్ 23న మగాహి దివాస్‌గా జరుపుకుంటారు. 1952లో మగాహి పరిషత్ పాట్నాలో 'బీహార్ మగాహి మండల్' పేరుతో స్థాపించబడింది. మగధి అనే పత్రిక దాదాపు అదే సమయంలో ప్రారంభమైంది, తరువాత దానికి బీహాన్ అని పేరు మార్చారు, బీహాన్ అంటే "రేపు" లేదా రాబోయే తెల్లవారుజామున అని అర్ధం. డాక్టర్ రామ్ ప్రసాద్ సింగ్ 1977 లో అఖిల భారత మగాహి సాహిత్య సమ్మేళన్ ను స్థాపించి " మగాహి లోక్ " అనే ప్రసిద్ధ పత్రికను ప్రచురించాడు. ప్రసిద్ధ మాసపత్రికను డాక్టర్ రామ్ ప్రసాద్ సింగ్ సంపాదకత్వంలో గయలోని మగాహి అకాడమీ ప్రారంభించింది. ఆలిండియా మగాహి భాషా సదస్సు ద్వారా "మగధీ" అనే మరో పత్రిక ప్రచురితమైంది.

చరిత్ర

[మార్చు]

మగాహి అనే పేరు మాగధి అనే పదం నుండి ఉద్భవించింది. ఇది ప్రాచీన మగధ రాజ్యంలో ఏర్పడింది , దీని మూలాలు గంగానదికి దక్షిణాన, సోనా నదికి తూర్పున ఉన్నాయి. ఈ భాష భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా గుర్తించబడలేదు. బీహార్ రాష్ట్రంలో విద్యా, అధికారిక విషయాలలో హిందీని ఉపయోగిస్తారు.[5] 1961 జనాభా లెక్కల ప్రకారం, మగాహి అధికారికంగా హిందీలో విలీనం చేయబడింది.వ్యాకరణవేత్త కచ్చాయనో మాగధి ప్రాముఖ్యత గురించి ఇలా వ్రాశాడు, "ఇది అన్ని భాషలకు తల్లి అయిన భాష. కల్పాల ప్రారంభంలో పురుషులు, బ్రాహ్మణులు దీని గురుంచి చెప్పారు, దీనికి ముందు మానవ సమ్మతి లేదు, పరమ బుద్ధుడు కూడా చెప్పాడు." అయితే, మగాహి భాష అస్సామీ, బెంగాలీ, భోజ్‌పురి, మైథిలి, ఒరియాతో పాటు మిథిలా ప్రాకృతం లేదా బహుశా బెంగాలీ ప్రాకృతం నుండి 8 - 11వ శతాబ్దాల మధ్య ఉద్భవించిందని భాషావేత్తలు నిర్ధారణకు వచ్చారు. సంచార ప్రజలు ఈ భాషలో దీర్ఘ పురాణ పద్యాలను సృష్టించారు, దీనికి కారణం "మగాహి" అనే పదానికి "ఒక బార్డ్" అని అర్థం. మగాహికి తెలిసిన లిఖిత సాహిత్యం లేదు.

మగాహి మాట్లాడేవారు

[మార్చు]

మాగధీలో చాలా ఉప భాషలు ఉన్నాయి. పాట్నా, నలంద, గయా, జెహనాబాద్, అర్వాల్, ఔరంగాబాద్, లఖిసరాయ్, షేక్‌పురా, నవాడా ముంగేర్ జిల్లాలు, పురాతన మగధ రాజ్యంలో ప్రధాన భాగాలుగా ఏర్పడిన ప్రాంతాలలో దీనిని మాట్లాడుతారు. జార్ఖండ్‌లోని ఉత్తర చోటానాగ్‌పూర్ డివిజన్‌లో బొకారో, చత్రా, ధన్‌బాద్, గిరిది, హజారీబాగ్, కోడెర్మా, రామ్‌గఢ్ జిల్లాలలో మగాహి భాష మిశ్రమాన్ని ఖోర్తా అని కూడా పిలుస్తారు. దక్షిణ బీహార్, ఉత్తర జార్ఖండ్ ప్రజలు ఎక్కువగా మగాహి మాట్లాడతారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో కూడా మగాహి మాట్లాడతారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, దాదాపు మగాహి మాట్లాడేవారు 14 మిలియన్లు ఉన్నారు.[6]

ఇవి కూడ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Grierson, G.A. "Magahi or Magadhi". Internet Archive.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Magahi". Omniglot.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. Atreya, Lata. "Magahi and Magadh: Language and the People" (PDF). Global Journal of Interdisciplinary Social Sciences.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "झारखंड : रघुवर कैबिनेट से मगही, भोजपुरी, मैथिली व अंगिका को द्वितीय भाषा का दर्जा". Prabhat Khabar. 21 March 2018. Retrieved 17 November 2018.
  5. "History of Indian Languages". web.archive.org. 2012-02-26. Archived from the original on 2012-02-26. Retrieved 2023-06-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. "Magahi alphabet, pronunciation and language". omniglot.com. Retrieved 2023-06-15.
"https://te.wikipedia.org/w/index.php?title=మగాహి_భాష&oldid=3918807" నుండి వెలికితీశారు