Jump to content

మమతా మోహన్ దాస్

వికీపీడియా నుండి
(మమతా మోహన్‌దాస్ నుండి దారిమార్పు చెందింది)
మమతా మోహన్ దాస్

జన్మ నామంమమతా మోహన్ దాస్
జననం (1985-08-05) 1985 ఆగస్టు 5 (వయసు 39)
India భారత్
క్రియాశీలక సంవత్సరాలు 2005—ప్రస్తుతము
Filmfare Awards
తెలుగు ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి
2006 రాఖీ

మమతా మోహన్‌దాస్ ఒక భారతీయ సినీ నటి, నేపథ్య గాయని. ప్రధానంగా మలయాళ చిత్రాలలోను, కొన్ని తమిళ, తెలుగు సినిమాలలోనూ నటించింది. ఈమెను దర్శకుడు రాజమౌళి తెలుగు తెరకు యమదొంగ చిత్రం ద్వారా పరిచయం చేసాడు. ఆమె రెండు దక్షిణాది ఫిలింఫేర్ పురస్కారాలు, 2006 లో తెలుగులో ఉత్తమ నేపథ్య గాయని పురస్కారాన్ని, 2010 లో మలయాళంలో ఉత్తమ నటి, 2010 లో ఉత్తమ నటిగా కేరళ స్టేట్ ఫిల్మ్ పురస్కారంతో సహా పలు పురస్కారాలను గెలుచుకుంది.

జీవిత విశేషాలు

[మార్చు]

మమతా మోహన్‌దాస్ 1984 నవంబరు 14 న మోహన్‌దాస్, గంగ దంపతులకు మలయాళీ కుటుంబంలో జన్మించింది. వీరి కుటుంబం కన్నూరుకు చెందినది. ఆమె 2002 వరకు బహ్రెయిన్ లోని ఇండియన్ స్కూల్ లో చదువుకుంది. ఆమె బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీలో బ్యాచిలర్ డిగ్రీ చదివింది . ఆమె ఐబిఎం, కళ్యాణ కేంద్ర వంటి సంస్థలకు ప్రింట్ యాడ్స్ కోసం మోడలింగు చేసింది. మైసూర్ మహారాజా, రేమండ్స్ కోసం ర్యాంప్‌పై మోడలింగు చేసింది. మమత కర్ణాటక, హిందూస్థానీ సంగీతాల్లో శిక్షణ పొందింది. [1] [2]

మమతకు 2011 నవంబరు 11 న బహ్రెయిన్ కు చెందిన వ్యాపారవేత్త ప్రజిత్ పద్మనాభన్ తో నిశ్చితార్థం జరిగింది. వీరికి 2011 డిసెంబరు 28 న కోజికోడ్‌లో వివాహం జరిగింది. [3] 2012 డిసెంబరు 12 న, ఈ జంట విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. [4]

2010 లో మమతకు క్యాన్సర్ సోకింది. 2010 నుండి హాడ్కిన్స్ లింఫోమాతో పోరాడింది. [5] 2013 ఏప్రిల్‌లో, క్యాన్సర్ జబ్బు తిరగబెట్టింది. తిరిగి వైద్యం చేయించుకుని క్యాన్సరు ముక్తురాలైంది. [6] [7] [8]  

హోమం సినిమా పోస్టర్

మమతా మోహన్ దాస్ నటించిన తెలుగు చిత్రాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Mamta Mohandas – Malayalam celebrities the stories and the gossips". Movies.deepthi.com. Retrieved 2 March 2012.
  2. http://t2.gstatic.com/images?q=tbn:ANd9GcQCo8JF0aqtag5UBNrB-KN6ElgLas1jfw857N68tgL5C4aJauXPgg[permanent dead link]
  3. "Mamta Mohandas weds family friend". timesofindia.indiatimes.com. 28 December 2011.
  4. Parvathy S. Nayar. "Pregith and I have decided to part for good: Mamta Mohandas". The Times of India. Archived from the original on 2012-12-15. Retrieved 24 January 2013.
  5. "Interview with Mamtha Mohandas - Times of India". The Times of India. Retrieved 2017-11-06.
  6. Rohit Raj (25 April 2013). "There is a relapse of cancer, but will pass: Mamta Mohandas". Deccan Chronicle. Archived from the original on 2 మే 2013. Retrieved 14 May 2013.
  7. [1]
  8. [2]