మరుపిళ్ళ చిట్టి
సర్దార్ మరుపిళ్ళ చిట్టి అలియాస్ వారపు అప్పలస్వామి[1] (1898 - 1971) భారత స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ శాసనసభ్యుడు. భారత జాతీయ కాంగ్రేసు నాయకుడు. 1955లో విజయవాడ ఉత్తరం శాసనసభ నియోజకవర్గం నుండి ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. తిరిగి 1967లో విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు.
మరుపిళ్ళ చిట్టి 1898, నవంబరు 27న కృష్ణా జిల్లాలో జన్మించాడు. ఈయన తండ్రి సన్యానిపాత్రుడు.[2]: 212 చిట్టి అనేక కార్మిక సంఘాలను ఏర్పాటు చేశాడు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఐదు నెలల పాటు జైలుశిక్ష అనుభవించాడు. మరలా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు 1941, ఆగష్టు 18న అరెస్టయ్యాడు. వ్యక్తిగత సత్యాగ్రహంలో క్రియాశీలకంగా పాల్గొని 18 నెలల జైలుశిక్షతో పాటు 500 రూపాయల జరిమానా కట్టాడు.ఈయన అలీపురం, వెల్లూరు, నాగపూరు, అమరావతి జైళ్లలో శిక్షను అనుభవించాడు. ఇరవై ఏళ్లపాటు కృష్ణా జిల్లా కాంగ్రేసు అధ్యక్షుడిగా పనిచేశాడు. ఈయన భార్య భ్రమరాంబ[2] కూడా స్వాతంత్ర్యోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని, అరెస్టై చాలా సమయం జైల్లో గడిపింది.[1]
విశాఖపట్నం, విజయనగర ప్రాంతాలనుండి వలసవచ్చి విజయవాడలో స్థిరపడిన నగరా సామాజికవర్గానికి చెందిన చిట్టి, నగరాభివృద్ధికి విశేషంగా కృషి చేశాడు.[3] నగరానికి తలమానికంగా ఉన్న పాల ఫ్యాక్టరీ స్థాపనకు 25 ఎకరాల స్థలాన్ని దానం చేశాడు.[4][5]
విజయవాడలో మాల, మాదిగలు, ఎరుకలతో పాటు నగరాలు నివసిస్తున్న మురికివాడకు మరుపిళ్ళ చిట్టి పేరుతో చిట్టి నగర్ అని పేరు పెట్టారు.[6]
మరుపిళ్ళ చిట్టి, 1971, జూలై 18న ఎమ్మెల్యే పదవిలో ఉండగానే మరణించాడు.[2]: 212
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Parupilla Chitti varapu Appalaswamy". amritmahotsav.nic.in. Retrieved 25 September 2024.
- ↑ 2.0 2.1 2.2 తుమ్మల, వెంకటరామయ్య (1984). భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్ర మొదటి భాగం. p. 33. Retrieved 12 August 2024.
- ↑ "ఎవరీ నగరాలు?విజయవాడ రాజకీయాల్లో ఎలా కీలకం అయ్యారు?". iDreamPost. Archived from the original on 26 సెప్టెంబర్ 2024. Retrieved 26 September 2024.
{{cite web}}
: Check date values in:|archive-date=
(help) - ↑ "మరుపిళ్ల భూదానాలు చేస్తే కొంతమంది భూ కబ్జా చేస్తున్నారు: పోతిన వెంకట మహేష్". ఈటీవి భారత్. 5 February 2024. Retrieved 25 September 2024.
- ↑ "పాల ఫ్యాక్టరీ ఆవరణలో చిట్టి విగ్రహాన్ని పెడతాం". మహానాడు. 29 April 2024. Retrieved 26 September 2024.
- ↑ Kondapalli, Ranga Rao (1984). Cities and Slums: A Study of a Squatters' Settlement in the City of Vijayawada. Concept Publishing Company. pp. 20–22. Retrieved 25 September 2024.