Jump to content

మల్లికార్జున్ గౌడ్

వికీపీడియా నుండి
మల్లికార్జున్‌ గౌడ్‌

పదవీ కాలం
1980-1984, 1989-1998
ముందు జానంపల్లి రామేశ్వరరావు
తరువాత ఎస్.జైపాల్‌రెడ్డి
నియోజకవర్గం మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం

పదవీ కాలం
1971-1980
ముందు సంగం లక్ష్మీబాయి
తరువాత ఇందిరా గాంధీ
నియోజకవర్గం మెదక్ లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1941-05-14)1941 మే 14
నల్లగండ్ల, మెదక్‌ జిల్లా, తెలంగాణ
మరణం 2002 డిసెంబరు 24(2002-12-24) (వయసు: 61)
హైదరాబాదు, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
సంతానం ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె
మతం హిందూ మతం

మల్లికార్జున్‌ గౌడ్‌ ( 1941 మే 14 - 2002 డిసెంబరు 24) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి.[1] ఆయన ఆరుసార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేశాడు.[2] కొంతకాలం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కూడా ఉన్నాడు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున 5వ లోక్‌సభ, 6వ లోక్‌సభ, 7వ లోక్‌సభ, 9వ లోక్‌సభ, 10వ లోక్‌సభ, 11వ లోక్‌సభలలో పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[3] మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి నాలుగు సార్లు, మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎన్నికయ్యాడు. రైల్వేలు, విద్య, సాంఘిక సంక్షేమం, సమాచార - ప్రసార, రక్షణశాఖలకు కేంద్ర డిప్యూటీ మంత్రి, కేంద్ర రాష్ట్ర మంత్రి హోదాలో భారత కేంద్ర ప్రభుత్వంలో పనిచేశాడు.[4][5]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

మల్లికార్జున్‌ గౌడ్‌ 1941, మే 14న తెలంగాణ రాష్ట్రం, మెదక్‌ జిల్లా, నల్లగండ్ల గ్రామంలో జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి విద్యాభాస్యం పూర్తి చేశాడు.

ఉద్యమ జీవితం

[మార్చు]

ఆయన 1969లో జరిగిన తొలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ముల్కీ, నాన్‌ ముల్కీ ఉద్యమంలో పాల్గొన్నాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్‌లోనే తెలంగాణ నాయకుల బృందాన్ని ఏర్పాటు చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

మల్లికార్జున్‌ గౌడ్‌ తెలంగాణ ఉద్యమం సమయంలో ఏర్పడిన తెలంగాణ ప్రజా సమితిలో కీలక నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఆయన 1971లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుండి తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్‌) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నర్సింహా రెడ్డి పై 53431 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎంపీగా పార్లమెంట్‌లో అడుగు పెట్టాడు. ఆయన 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మెదక్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు. 1980లో ఇందిరాగాంధీ మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేయగా, మల్లికార్జున్‌ గౌడ్‌ మహబూబ్ నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచి, కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు.ఆయన అనంతరం 1989, 1991, 1996 ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ ఎంపీగా గెలిచాడు. మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ, పివి నరసింహారావుల మంత్రి వర్గాలలో కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి, సమాచారశాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడిగా 1996 నుంచి 1998 వరకు పనిచేశాడు.

నిర్వర్తించిన పదవులు

[మార్చు]
  • 1980 జూన్ - 1983 ఫిబ్రవరి: కేంద్ర రైల్వే డిప్యూటీ మంత్రి
  • 1981 నవంబరు - 1983 ఫిబ్రవరి: కేంద్ర విద్య, సాంఘిక సంక్షేమశాఖ ఉప మంత్రి
  • 1983 ఫిబ్రవరి - 1984 ఫిబ్రవరి: కేంద్ర సమాచార, బ్రాడ్‌కాస్టింగ్, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ ఉప మంత్రి
  • 1984 ఫిబ్రవరి - 1984 అక్టోబరు: కేంద్ర వర్క్స్ అండ్ హౌసింగ్, స్పోర్ట్స్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఉప మంత్రి
  • 1990 జనవరి-1990 ఆగస్టు: ప్రివిలేజెస్ కమిటీ సభ్యుడు
  • 1990 మే-91: పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడు
  • 1990-91: కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
  • 1991 జూన్-1993 జనవరి: కేంద్ర రైల్వే రాష్ట్ర మంత్రి
  • 1992 ఏప్రిల్-1996 మే: కేంద్ర రాష్ట్ర రక్షణ పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి

మరణం

[మార్చు]

మల్లికార్జున్‌ గౌడ్‌ 2002 డిసెంబరు 24న గుండెపోటుతో మరణించాడు.[6][7] 2002 డిసెంబరు 25న మెదక్ జిల్లా నల్లగండ్ల గ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.[7] ఇతనికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

మూలాలు

[మార్చు]
  1. Former Union minister Mallikarjun dead
  2. Sakshi (21 March 2019). "తొలి ఉద్యమ సైరన్‌". Sakshi. ఒరిజినల్ నుండి 8 June 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 June 2021.
  3. Mallikarjun,Dr. I.N.C., Lok Sabha Members Archived 2008-02-10 at the Wayback Machine
  4. "Biographical Sketch of Member of XI Lok Sabha (MALLIKARJUN, DR.)". loksabhaph.nic.in. ఒరిజినల్ నుండి 2020-11-27 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-12-15.
  5. "మల్లికార్జున్​ యాదిలో.. రాజకీయ జీవితాన్ని మలుపుతిప్పిన ఉద్యమం". V6 Velugu. 5 August 2023. the original నుండి 24 December 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 December 2024. {{cite news}}: zero width space character in |title= at position 14 (help)
  6. Rediff (25 December 2002). "Former Union minister Mallikarjun dead". www.rediff.com. ఒరిజినల్ నుండి 8 June 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 June 2021.
  7. 1 2 Mallikarjun Cremated with State Honours