మల్లిపెద్ది సుధీర్ రెడ్డి
మల్లిపెద్ది సుధీర్ రెడ్డి | |||
మాజీ ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2014 - 2018 | |||
ముందు | కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి | ||
---|---|---|---|
తరువాత | చామకూర మల్లారెడ్డి | ||
మాజీ ఎమ్మెల్యే
| |||
నియోజకవర్గం | మేడ్చల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 10 ఏప్రిల్ 1955 ప్రతాపసింగారం గ్రామం, ఘటకేసర్ మండలం, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | చంద్రశేఖర్ రెడ్డి | ||
జీవిత భాగస్వామి | చంద్ర కళ ( పెళ్లి - 10 ఏప్రిల్ 1976) | ||
సంతానం | మల్లిపెద్ది శరత్ చంద్ర రెడ్డి | ||
నివాసం | ప్రతాపసింగారం |
మల్లిపెద్ది సుధీర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.
జననం, విద్యాభాస్యం
[మార్చు]మల్లిపెద్ది సుధీర్ రెడ్డి 1955 ఏప్రిల్ 10లో మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, ఘటకేసర్ మండలం, ప్రతాపసింగారం గ్రామంలో జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]మల్లిపెద్ది సుధీర్ రెడ్డి 1976లో జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 1982లో తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఆయన రెండు పర్యాయాలు ప్రతాపసింగారం గ్రామ సర్పంచ్ గా, ఘటకేసర్ వైస్ ఎంపీపీగా పనిచేశాడు. సుధీర్ రెడ్డి 1995లో ఘటకేసర్ సహకార బ్యాంక్ ఛైర్మన్‌గా, 1998లో హైదరాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా, 2001లో ఘటకేసర్ ఎంపీపీగా, ఘటకేసర్ రైతు సేవా సహకార సంఘం ఛైర్మన్‌గా, రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌గా పనిచేశాడు.
సుధీర్ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో 2012లో తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాడు. ఆయన 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తోటకూర జంగయ్య యాదవ్ పై 43455 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు.[1][2] ఆయనకు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. ఆయన ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శిగా ఉన్నాడు.[3]
మల్లిపెద్ది సుధీర్ రెడ్డి 2023 అక్టోబరు 18న కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ప్రతాపసింగారంలోని సుధీర్‌రెడ్డి ఇంటికి వెళ్లిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ Result University (2014). "Medchal Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.
- ↑ The Hans India (21 July 2018). "MLA Sudheer participates in Haritha Haram" (in ఇంగ్లీష్). Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.
- ↑ Sakshi (5 October 2018). "కనకారెడ్డి, సుధీర్‌రెడ్డికి 'ఎమ్మెల్సీ' అభయం". Archived from the original on 5 October 2018. Retrieved 15 July 2021.
- ↑ Mana Telangana (18 October 2023). "కాంగ్రెస్ పార్టీలో చేరిన సుధీర్ రెడ్డి". Archived from the original on 18 October 2023. Retrieved 18 October 2023.
- ↑ Sakshi (18 October 2023). "కీలక పరిణామం.. కాంగ్రెస్ గూటికి బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే". Archived from the original on 18 October 2023. Retrieved 18 October 2023.