మల్లెపూవు (సినిమా)
(మల్లెపూవు నుండి దారిమార్పు చెందింది)
మల్లెపువ్వు (1978 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి.మధుసూదన రావు |
---|---|
తారాగణం | శోభన్ బాబు , లక్ష్మీ , రావు గోపాలరావు |
సంగీతం | కె. చక్రవర్తి |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, వాణీ జయరాం |
గీతరచన | ఆరుద్ర, వేటూరి |
నిర్మాణ సంస్థ | సమత ఆర్ట్స్ |
భాష | తెలుగు |
ఇది 1978లో విడుదలైన ఒక మంచి తెలుగుచిత్రం. గురుదత్ హిందీ చిత్రం "ప్యాసా" (1957) ఆధారంగా తీయబడింది. ఒక గుర్తింపురాని కవి, విఫల ప్రేమ, అన్నదమ్ముల చీత్కారం, తన రచనల్ని ప్రేమించే వేశ్య, జీవించి ఉండగారాని గుర్తింపు కవి మరణం తర్వాత రావడం , ప్రజల అవకాశవాదం వీటన్నిటి సమాహారం ఈ చిత్రం. చిత్రం చక్కని పాటలతో తెలుగులో కూడా విజయవంతమయ్యింది కాని హిందీ చిత్రంలోని సమకాలీనత, నేటివిటి తెలుగుచిత్రంలో కనరాదు. ఆరుద్ర, వేటూరి చిత్రంలో కనిపించడం విశేషం.[1]
తారాగణం
[మార్చు]- శోభన్ బాబు
- లక్ష్మి
- జయసుధ
- శ్రీధర్
- రావు గోపాలరావు
- గిరిబాబు
- కె.వి.చలం
- మాడా వెంకటేశ్వరరావు
- కె.విజయ
- సూర్యకళ
- విజయలక్ష్మి
- వీరభద్రరావు
- మోదుకూరి సత్యం
- పొట్టి ప్రసాద్
- మల్లికార్జునరావు
- అల్లు రామలింగయ్య (అతిథి)
- ఆరుద్ర (అతిథి)
- వేటూరి సుందరరామమూర్తి (అతిథి)
- నిర్మల (అతిథి)
- పండరీబాయి (అతిథి)
సాంకేతికవర్గం
[మార్చు]నిర్మాతలు: వి.ఆర్.యాచేంద్ర, కె.ఛటర్జీ చిత్రానువాదం, దర్శకత్వం: వి.మధుసూధనరావు సంభాషణలు: ఆత్రేయ, వీటూరి పాటలు: ఆత్రేయ, వేటూరి, ఆరుద్ర, వీటూరి సంగీతం: చక్రవర్తి [2]
పాటలు
[మార్చు]వరుస సంఖ్య | పాట | రచన | సంగీతం | పాడిన వారు |
---|---|---|---|---|
1 | చక చక సాగే చక్కని బుల్లెమ్మ.... | వీటూరి | చక్రవర్తి | ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల |
2 | చిన్న మాట ఒక చిన్నమాట...... | వేటూరి | చక్రవర్తి | పి.సుశీల |
3 | ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని | వేటూరి | చక్రవర్తి | ఎస్.పి.బాలసుబ్రమణ్యం |
4 | ఎవ్వరో... ఈ నేరాలడిగే వారెవ్వరో | వేటూరి | చక్రవర్తి | |
5 | జుంబాంబ జుంబాంబ.. మాలీష్ మాలీష్...రాందాస్ మాలీష్.. | ఆరుద్ర | చక్రవర్తి | చక్రవర్తి |
6 | బ్రతికున్నా.. చచ్చినట్టే.. ఈ సంఘంలో | ఆచార్య ఆత్రేయ | చక్రవర్తి | |
7 | మల్లెపూవులా వసంతం మాతోతకి వచ్చింది | వేటూరి | చక్రవర్తి | ఎస్.పి.బాలసుబ్రమణ్యం |
8 | నువ్వు వస్తావని బృందావని ఆశగా చూశేనయ్యా... | ఆరుద్ర | చక్రవర్తి | వాణీ జయరాం |
9 | ఓహో లలితా.. నా ప్రేమ కవితా.. | వేటూరి | చక్రవర్తి | ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల |
10 | ఓ ప్రియా... మరుమల్లియ కన్నా తెల్లనిది | ఆరుద్ర[3] | చక్రవర్తి | ఎస్.పి.బాలసుబ్రమణ్యం |
మూలాలు
[మార్చు]- ↑ "Mallepoovu (1978)". Indiancine.ma. Retrieved 2022-05-31.
- ↑ డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- ↑ కురిసే చిరుజల్లులో, ఆరుద్ర సినీ గీతాలు, 5వ సంపుటం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.