మవంబర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మవంబర్ సందర్భంగా మీసాలను పెంచి ప్రదర్శిస్తున్న పురుషులు.

మవంబర్ (ఆంగ్లం: Movember) అనేది పురుషులు ఎదుర్కొనే పౌరుష గ్రంధి క్యాన్సర్ వంటి వివిధ క్యాన్సర్లపై అవగాహన కలిగించే ఒక వార్షిక ఉత్సవం. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపబడే నవంబరు నెల అంతా మవంబరు నెలగా గుర్తించబడుతోన్నది. మవంబరు అనగా Mo (ustache) + November. దీనినే No-shave నవంబరుగా కూడా వ్యవహరిస్తారు. విశ్వవ్యాప్తంగా పురుషులు నవంబరు నెలలో మీసాలను పెంచి క్యాన్సర్ వ్యతిరేక పోరాటం చేస్తారు. ఆస్ట్రేలియాకు చెందిన మవంబర్ ఫౌండేషన్ అనే సంస్థ ఈ ఉత్సవాలకు నాంది పలికినది. పురుషుల ఆరోగ్యం యొక్క రూపురేఖలను మార్చేయటమే ఈ ఉత్సవాల ఉద్దేశం.

ఇలా మీసాలను పెంచే పురుషులను Mo Bros (Moustache Brothers) గా వ్యవహరిస్తారు. షేవింగ్ చేయకుండా ఉండటం వలన మిగిలే డబ్బును మవంబర్ ఫౌండేషన్ విరాళాలుగా స్వీకరిస్తుంది. తొలిదశలలోనే క్యాన్సర్ ను గుర్తించటం, వాటిపై పరీక్షలు జరుపటం, వాటికి చికిత్సలు సూచించటంతో పురుషులలో మరణాలను తగ్గుముఖం పట్టించటమే మవంబరు ధ్యేయం. 2004 నుండి ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఐర్లాండ్, కెనడా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఎల్ సాల్వడార్, స్పెయిన్, యునైటెడ్ కింగ్డమ్, ఇజ్రాయెల్, దక్షిణ ఆఫ్రికా, తైవాన్, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఈ ఉత్సవాలను జరుపుతున్నాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=మవంబర్&oldid=2889081" నుండి వెలికితీశారు