Jump to content

మహేంద్ర చక్రవర్తి కొక్కిరిగడ్డ

వికీపీడియా నుండి
మహేంద్ర చక్రవర్తి
జననం1978 అక్టోబర్ 23
వృత్తిరంగస్థల దర్శకుడు, రచయిత
నటుడు
తల్లిదండ్రులుకిషోర్

మహేంద్ర చక్రవర్తి కొక్కిరిగడ్డ తెలుగు నాటకరంగ దర్శకుడు, సినిమా రచయిత, నటుడు, నట శిక్షకుడు. ఆధునిక నాటకరంగంలో 29 సంవత్సరాలుగా దర్శకుడిగా దక్షణ భారతదేశ విభాగంలో 12సార్లు జాతీయస్థాయిలోనూ, 4సార్లు రాష్ట్రస్థాయి నంది అవార్డులు పొందాడు.[1] రాజీవ్ గాంధీ హత్యకేసులో 26 ఏళ్ళుగా జైలుశిక్ష అనుభవించిన నళిని జీవిత కథను ''కథా నళిని'' అనే నాటకంగా రూపొందించి తన దగ్గర శిక్షణ పొందిన నటీనటులచే ప్రదర్శించాడు, కళాకారుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.[2][3]

జీవిత విషయాలు

[మార్చు]

ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం మండలం, కొమరాడ గ్రామంలో 1978, అక్టోబరు 23న మహేంద్ర చక్రవర్తి జన్మించాడు. తండ్రిపేరు కిషోర్. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాయలం నుండి 2000-2002లో థియేటర్ ఆర్ట్స్‌లో డిప్లొమా, హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి 2005-2006 మాస్టర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎం.పి.ఏ)లో పూర్తిచేశాడు.[4]

కళారంగంలో కృషికి ది యూనివర్సల్ యూనివర్సిటీ కొడైకెనాల్ (తమిళనాడు) గౌరవ డాక్టరేట్ అందించింది.[5]

2005 ఫిల్మ్ టెక్ విభాగంలో నాగ్‌పూర్‌లోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వర్క్‌షాప్‌లో జానపద నాటకంలో శిక్షణ పొందాడు. ఫిల్మ్ డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్, స్క్రిప్ట్ సహకారం, స్క్రిప్ట్ డెవలప్‌మెంట్, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ఫిల్మ్ స్టైల్స్, సినిమా డెవలపింగ్ ప్రాసెస్, గ్లోబల్ సినిమా, సినిమా ఆన్ ఎడ్జ్ శిక్షణ పొందాడు. మా టీవీ (క్రుక్షేత్ర 2004)కి స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేశాడు.

నటశిక్షణ

[మార్చు]

2009లో హైదరాబాద్ లో మహేంద్ర స్కూల్ అఫ్ డ్రామా, 2011లో మహేంద్ర స్కూల్ అఫ్ కాస్టింగ్ సంస్థలను స్థాపించి ఔత్సాహికులకు నటనలో శిక్షణ ఇస్తున్నాడు, సినిమాలకి కాస్టింగ్ చేస్తున్నాడు. ఇప్పటివరకు రంగస్థల, సినీ మాధ్యమాలలో 400 మంది విద్యార్థులకు పై రెండు సంస్థల ద్వారా నట శిక్షణ అందుకున్నారు .

నాటకరంగంలోని వన్ యాక్ట్ ప్లే, మోనో యాక్ట్, మైమ్, లైవ్ స్ట్రీమింగ్ ఫిల్మింగ్ మోడ్రన్ డ్రామాలు, స్కిట్, స్ట్రీట్ ప్లే, షార్ట్ ఫిల్మ్ మేకింగ్ వంటి విభాగాలలో నటన, దర్శకత్వం విభాగంలోనూ పాశ్చాత్య నృత్యం, జానపదం (తప్పటం, కరగం, కుమ్మి, నట్టుపుర నందనం, ఒయిలట్టం, కోలాట్టం, పులియాట్టం, కావడి, మయిలట్టం, పోయ్ కాల్ కుతురై, ఉరుమ్మియాట్టం, కళీయాత్తమత్తమత్తం, కళీయత్తమత్తమట్టం లలో పాల్గొన్నాడు. ఆంధ్రా విశ్వవిద్యాలయం, కృష్ణ విశ్వవిద్యాలయం నిర్వహించిన 22 ఇంటర్ కాలేజియేట్ యూత్ ఫెస్టివల్స్‌లో నటుడిగా, డైరెక్టర్‌గా పాల్గొన్నారు.[6]

సినిమాల్లో అనుభవం

[మార్చు]
  • మా టీవీ (క్రుక్షేత్ర 2004)కి స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేశాడు
  • ఇండియన్ విడోస్, సిరి అనే ఇంగ్లీషు డాక్యుమెంటరీలకు దర్శకత్వం వహించాడు
  • వేణు కూరపాటి దర్శకత్వం వహించిన 'స్ట్రైక్' అనే షార్ట్ ఫిల్మ్‌లో హీరోగా నటించాడు
  • 2001 నుండి భీమవరంలోని డి.ఎన్.ఆర్.కళాశాలలో స్టేజ్ డైరెక్టర్‌గా పనిచేశాడు
  • భీమవరంలో రేడియో విష్ణు 90.4లో కంటెంట్ క్రియేటర్ న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ 2008-09లో పనిచేశారు
  • బైర్రాజు ఫౌండేషన్‌తో 2007-2010 కాలంలో రాష్ట్ర సాంస్కృతిక సమన్వయకర్తగా పనిచేశారు
  • ఎంఎల్పీ వీడియో డాక్యుమెంటరీ డైరెక్టర్ 2010 కోసం బైర్రాజు ఫౌండేషన్‌తో కలిసి పనిచేశారు
  • 2010లో బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా గ్రామ సంఘం కోసం రూపొందించిన 12 డాక్యుమెంటరీలకు దర్శకత్వం వహించాడు
  • 2012లో స్పృహ షార్ట్ ఫిల్మ్ తీశాడు

నటుడిగా

[మార్చు]

'బొమ్మలాట' 'శాంతి', 'విచ్ ఈజ్ ది వైల్డ్ యానిమల్', 'ఎవాల్యూషన్', 'గంగిరెద్దు ఆట', 'కరెప్షన్' నాటికలలో నటించాడు.

రచన-దర్శకత్వం

[మార్చు]

పోలవరం వీడతరమా', '0% ఇంట్రెస్ట్', 'ఇండియా టుడే', 'న్యూ డ్రామా, "కోర్టు", అన్వేషణ పోరాటం, బచావ్, భవద్వేషిని, వరదలు బాబోయ్ వరదలు, భూమిక, కథానళిని, సంఘర్షణ, చరిత్ర శూన్యంలోకి,[7] సంభవామి,[8] నడుస్తున్న చరిత్ర, 'జెండాలు మారేదేమిరా', "నిజమైన స్వాతంత్ర్యం', కన్నీటి కేరళ మొదలైన నాటికలకు రచన, దర్శకత్వం వహించాడు.[9]

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సేవ

[మార్చు]
  • 2004లో మోహన్ శృతి క్రియేషన్స్'శుభం' సినిమాకు సహాయ దర్శకుడు
  • 2014లో బిల్లా-రంగా తెలుగు సినిమాకు డైలాగ్ రైటర్, కాస్టింగ్ డైరెక్టర్ & చీఫ్ అసోసియేట్ డైరెక్టర్[10][11]
  • 2015లో జగన్నాటకం, 2011లో వారెవ్వ, 2016లో పెళ్ళిచూపులు, 2019లో ప్రేమంటే ఈజీ కాదురా, 2019 ఎబిసిడి, 2019లో డియర్ కామ్రేడ్ మొదలైన తెలుగు సినిమాలకు కాస్టింగ్ డైరెక్టర్‌

అవార్డులు, గుర్తింపులు

[మార్చు]
  • 2001లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన నంది నాటకోత్సవంలో పశ్చిమ గోదావరి జిల్లా నుండి మొదటి పార్టిసిపెంట్
  • 2001లో భారత ప్రభుత్వచే వారణాసిలో మైమ్లో మూడవ ఉత్తమ అవార్డు
  • 2003లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ ద్వారా ఉగాది పురస్కారం
  • 2006 జాతీయ మైమ్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ నుండి ది వార్ ఎవల్యూషన్ కాన్సెప్ట్ & డిజైన్ డైరెక్టర్‌గా మూడవ స్థానం
  • 2006లో థియేటర్ వర్క్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు డి.ఎన్.ఆర్.కళాశాల అసోసియేషన్ ద్వారా సత్కారం
  • 2010లో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌చే విశాఖపట్నంలో థియేటర్ ఎక్సల్టెన్సీతో అవార్డు
  • 2014లో భవద్వేషినీమ్ నాటకానికి ఉత్తమ లైటింగ్‌గా నంది అవార్డు
  • 2015లో తిరుపతిలో నడుస్తున్న చరిత్ర నాటకానికి ఉత్తమ సంగీత నంది అవార్డు
  • 2016లో రచన, దర్శకత్వం వహించిన "సంభవామి" నాటికకు బంగారు నంది అవార్డు[12]
  • 2017లో మహారాష్ట్రలోని కొల్హాపూర్ జరిగిన 32వ అంతర్ విశ్వవిద్యాలయ జాతీయ యువజనోత్సవాలలో ననయ్న విశ్వవిద్యాలయం నుండి ప్రదర్శించిన "సంభవామి" నాటికకి మూడవ బహుమతి[13]

మూలాలు

[మార్చు]
  1. 2019 సెప్టెంబరు 22వ తేదీన ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన ''మహేంద్ర చక్రవర్తికి గౌరవ డాక్టరేట్ '' అనే న్యూస్ నుండి
  2. "Raghu Kunche to be a part of Kokkirigadda Mahendra's Katha Nalini". The Times of India. 2020-07-04. ISSN 0971-8257. Retrieved 2023-05-28.
  3. "Noted music composer to act in a film based on Rajiv Gandhi's assassination?". 123telugu.com (in ఇంగ్లీష్). 2020-07-03. Retrieved 2023-05-28.
  4. ఈనాడులో భీమవరం పేపర్లో వచ్చిన 'కళారంగ చక్రవర్తి' అనే న్యూస్ నుండి
  5. 2019 సెప్టెంబరు 22వ తేదీన కోస్తా ప్రభ పేపర్లో వచ్చిన''కొమరాడ కళాకారుడికి గౌరవ డాక్టరేట్'' అనే న్యూస్ నుండి
  6. ఈనాడు ఈతరం పేపర్లో వచ్చిన 'యువజనం... కళకలం' అనే న్యూస్ నుండి
  7. సాక్షి హైదరాబాదలో పేపర్లో వచ్చిన 'అవినీతిపై బాణం చరిత్ర శూన్యంలోకి' అనే న్యూస్ నుండి
  8. "సామాజిక అంశాలే ఇతివృత్తంగా చిత్రాల నిర్మాణం". www.andhrabhoomi.net. Archived from the original on 2023-05-28. Retrieved 2023-05-28.
  9. "ఉల్లాసంగా.. ఉత్సాహంగా." Sakshi. 2016-12-13. Retrieved 2023-05-28.
  10. Bureau, Our (2013-11-23). "Vizag Satyanand turns actor". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2023-05-28.
  11. "'బిల్లా-రంగ'విడుదల తేదీ ఖరారు". telugu.filmibeat.com. 2014-02-09. Retrieved 2023-05-28.
  12. 2017 ఫిబ్రవరి 25వ తేదీన ఆంధ్రజ్యోతి-జీవన గోదావరి పేపర్లో వచ్చిన''అవినీతిపై సమరమే సంభవామి'' అనే న్యూస్ నుండి
  13. The Hans India, Rajahmundry, 19.02.2017, ANU Wins National Award