మహ్మూదుల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహ్మూదుల్లా రియాద్
2018 లో శిక్షణా కార్యక్రమంలో మహ్మూదుల్లా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మొహమ్మద్ మహ్మూదుల్లా రియాద్[1]
పుట్టిన తేదీ (1986-02-04) 1986 ఫిబ్రవరి 4 (వయసు 38)
మైమెన్‌సింగ్, బంగ్లాదేశ్
మారుపేరుRiyad,[2] Silent Killer,[3][4]
ఎత్తు1.80 m (5 ft 11 in)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ స్పిన్
పాత్రBatting ఆల్ రౌండరు
బంధువులుMushfiqur Rahim (brother-in-law)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 55)2009 జూలై 9 - వెస్టిండీస్ తో
చివరి టెస్టు2021 జూలై 7 - జింబాబ్వే తో
తొలి వన్‌డే (క్యాప్ 85)2007 జూలై 28 - శ్రీలంక తో
చివరి వన్‌డే2023 సెప్టెంబరు 23 - న్యూజీలాండ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.30
తొలి T20I (క్యాప్ 13)2007 సెప్టెంబరు 1 - Kenya తో
చివరి T20I2022 సెప్టెంబరు 1 - శ్రీలంక తో
T20Iల్లో చొక్కా సంఖ్య.30
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2004/05–presentఢాకా డివిజను
2012–2013Chittagong Kings
2012Basnahira Cricket Dundee
2015Barisal Bulls
2016–2019Khulna Titans
2019Chattogram Challengers
2017–2018క్వెట్టా గ్లేడియేటర్స్
2017జమైకా Tallawahs
2018సెంట్ కిట్స్ & నెవిస్ పేట్రియాట్స్
2022Minister Dhaka
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ట్వంటీ20 ఫక్లా
మ్యాచ్‌లు 50 221 115 114
చేసిన పరుగులు 1,914 5,020 2002 6557
బ్యాటింగు సగటు 33.49 35.35 23.83 35.63
100లు/50లు 5/16 3/25 0/6 14/32
అత్యుత్తమ స్కోరు 150* 128* 64* 152
వేసిన బంతులు 3423 4320 831 9111
వికెట్లు 43 82 37 143
బౌలింగు సగటు 47.66 45.82 26.94 35.14
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 0 3
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 1
అత్యుత్తమ బౌలింగు 5/53 3/4 3/18 7/94
క్యాచ్‌లు/స్టంపింగులు 38/1 76/– 43/– 98/1
మూలం: ESPNcricinfo, 11 March 2023

మొహమ్మద్ మహ్మూదుల్లా [5] (జననం 1986 ఫిబ్రవరి 4), బంగ్లాదేశ్ క్రికెటరు, T20Iలో బంగ్లాదేశ్ జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్. అతన్ని రియాద్ అని కూడా పిలుస్తారు.[5] అతను ఢాకా డివిజన్ కొరకు ఫస్ట్-క్లాస్, లిస్టు A క్రికెట్ ఆడాడు. అన్ని రకాల ఆటలలో బంగ్లాదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆల్ రౌండరు, లోయర్ లేదా మిడిల్ ఆర్డర్ బ్యాటరు, అలాగే ఆఫ్ స్పిన్ బౌలరు. దాదాపు 10,000 పరుగులు, 150+ వికెట్లు అతని ఖాతాలో ఉన్నాయి. అతను ప్రపంచ కప్‌లో సెంచరీ చేసిన మొదటి బంగ్లాదేశ్ బ్యాటరు. ఐసిసి ఈవెంట్లలో 3 సెంచరీలు ఇంగ్లండ్, న్యూజిలాండ్‌పై బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు కూడా చేసాడు. [6] [7] సనత్ జయసూర్య, కెవిన్ పీటర్సన్, షోయబ్ మాలిక్, స్టీవ్ స్మిత్ తదితరుల్లాగా మహ్మూదుల్లా కూడా తన కెరీర్‌ను బౌలర్‌గా ప్రారంభించి, ఆపై బౌలింగ్ చేయగల బ్యాటరుగా మారాడు. [8]

అంతర్జాతీయ కెరీర్[మార్చు]

2007 జూలైలో బంగ్లాదేశ్ పర్యటనలో శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం బంగ్లాదేశ్ వన్‌డే జట్టుకు మహ్మూదుల్లాను పిలిచారు. అతను పర్యటనలో రంగప్రవేశం చేసాడు, మూడవ వన్‌డేలో అతను బంగ్లాదేశ్‌లో రెండవ అత్యధిక స్కోరు (36) చేయడంతో పాటు, 2 వికెట్లు కూడా తీసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో శ్రీలంక 39 పరుగులతో గెలిచింది. [9]

2007 అతనులో కెన్యాలో జరిగిన క్వాడ్రాంగులర్ సిరీస్, 2007 ట్వంటీ20 ప్రపంచ ఛాంపియన్‌షిప్ కోసం బంగ్లాదేశ్ జట్టుకు ఎంపికయ్యాడు.[10][11]

మహ్మూదుల్లా 2009 జూలై 9న వెస్టిండీస్‌పై టెస్టుల్లో రంగప్రవేశం చేశాడు. అతను బ్యాటింగులో విఫలమయ్యాడు. అయితే రంగప్రవేశంలో. బంగ్లాదేశ్ బౌలర్లలో అత్యుత్తమ టెస్టు బౌలింగు గణాంకాలు సాధించాడు. రెండవ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల పంటతో సహా ఎనిమిది వికెట్లు సాధించాడు. [12] ఇది బంగ్లాదేశ్ సాధించిన రెండో టెస్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించింది. విదేశీ గడ్డపై తొలి టెస్టు విజయం సాధించింది.


టెస్టుల్లో మహ్మూదుల్లా 8 వ స్థానంలో బ్యాటింగు చేస్తూ న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసినప్పటికీ, ఫాస్టు బౌలింగును ఎదుర్కోవడంలో అతనికి ఇబ్బంది ఉందని భావించి సెలెక్షన్ కమిటీ, అతనిని బ్యాటింగు వరుసలో పైకి ప్రమోట్ చేయలేదు. [13] అతను 2011 ICC క్రికెట్ ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ 15 మంది సభ్యుల జట్టులో చేర్చబడ్డాడు. [14] 2011 సెప్టెంబరు 20న మహ్మూదుల్లా, బంగ్లాదేశ్ వైస్-కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. మునుపటి కెప్టెన్, డిప్యూటీలను తొలగించిన తర్వాత తమీమ్ ఇక్బాల్ నుండి ఆ బాధ్యతలు స్వీకరించారు. [15] అక్టోబరులో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లినప్పుడు, వైరల్ ఫీవర్‌తో మహ్మూదుల్లా అన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. [16] కోలుకున్నాక, నవంబరులో మూడు వన్డేల్లో పాకిస్థాన్‌తో తలపడే జట్టులో తిరిగి చేరాడు.[17] మహ్మూదుల్లా 56 పరుగులు చేశాడు. ఒక్క మ్యాచ్‌లోనే బౌలింగ్ చేసి, ఏడు బంతుల్లో మూడు వికెట్లు తీశాడు. [18] [19]

2015 ప్రపంచ కప్[మార్చు]

2015 మార్చి 9న మహ్మూదుల్లా, 2015 ICC క్రికెట్ ప్రపంచ కప్‌లో, ఇంగ్లండ్‌పై శతకం చేసి, ప్రపంచ కప్ చరిత్రలో సెంచరీని సాధించిన బంగ్లాదేశ్ బ్యాటరు అయ్యాడు. [20] బంగ్లాదేశ్‌ ఈ మ్యాచ్‌లో గెలిచి క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. [21] తదుపరి మ్యాచ్‌లో, మార్చి 13న, అతను మరో ప్రపంచ కప్ సెంచరీని సాధించాడు, ఈసారి న్యూజిలాండ్‌పై న్యూజిలాండ్ 3 వికెట్ల తేడాతో గెలిచింది.

ప్రపంచ కప్‌లోని ఆరు మ్యాచ్‌లలో, అతను 73.00 సగటుతో 365 పరుగులు చేశాడు. చివరికి ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. [22] అతను క్రిక్‌బజ్ వారి 'టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్'లో కూడా పేరు పొందాడు. [23]

కెప్టెన్సీ[మార్చు]

2018 జనవరిలో, శ్రీలంకతో జరిగిన బంగ్లాదేశ్ ట్రై-సిరీస్ ఫైనల్‌లో, శాశ్వత టెస్టు కెప్టెన్ షకీబ్ గాయంతో, శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ నుండి తప్పుకున్నాడు. దీంతో టెస్టు జట్టు కెప్టెన్‌గా మహ్మూదుల్లా ఎంపికయ్యాడు. [24] 2018 జనవరి 31న, టెస్టుల్లో బంగ్లాదేశ్‌కు నాయకత్వం వహించిన పదవ ఆటగాడిగా నిలిచాడు. [25] [26] T20I జట్టుకు కూడా మహ్మూదుల్లా మరోసారి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. [27] అతని కెప్టెన్సీలో, బంగ్లాదేశ్ T20I లలో అత్యధిక స్కోరును నమోదు చేసింది (193/5), కానీ చివరకు బంగ్లాదేశ్‌లో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది. [28] నిదాహాస్ ట్రోఫీలో శ్రీలంకతో జరిగిన తదుపరి మ్యాచ్‌లో, బంగ్లాదేశ్ 214 పరుగుల లక్ష్యాన్ని చేధించినప్పుడు మొదటిసారి 200 పరుగులు చేసింది. [29] మార్చి 16న, సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై 160 పరుగుల విజయ లక్ష్యాన్ని చేరుకోవడానికి మహ్మూదుల్లా అజేయంగా 43 పరుగులు చేసి, చివరి నిర్ణయాత్మక ఓవర్‌లో ఒక సిక్సర్ కొట్టి, బంగ్లాదేశ్ నిదాహాస్ ట్రోఫీ ఫైనల్‌కు అర్హత సాధించాడు. [30]

2018 ఏప్రిల్లో, 2018 సీజన్‌కు ముందు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (BCB) ద్వారా సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన పది మంది క్రికెటర్లలో అతను ఒకడు. [31]

2021 జూలైలో బంగ్లాదేశ్, జింబాబ్వేల మధ్య జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ మూడవ రోజున, టెస్టు క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నట్లు మహ్మూదుల్లా తన సహచరులకు సూచించాడు. ఐదో రోజు ఆట ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్ ఆటగాళ్లు అతనికి గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వడంతో ఈ వార్త ధృవపడింది. ఒక మ్యాచ్‌లో అతను ఆకస్మికంగా రిటైర్మెంట్ తీసుకున్న నిర్ణయం జట్టును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని బీసీబీ అధ్యక్షుడు విమర్శించారు. ఈ మ్యాచ్ టెస్టు క్రికెట్‌లో అతని 50వ మ్యాచ్. అతను మొదటి ఇన్నింగ్స్‌లో అజేయంగా 150 పరుగులు చేశాడు. అది అతని కెరీర్ బెస్ట్. ఆ మ్యాచ్‌ బంగ్లాదేశ్ 220 పరుగుల తేడాతో గెలిచింది. అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. [32] [33] 2021 నవంబరులో బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ల మధ్య జరిగే మొదటి టెస్టుకు ముందు అతను టెస్టు క్రికెట్‌కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. [34]

వ్యక్తిగత జీవితం[మార్చు]

2011 జూన్ 25న, మహ్మూదుల్లా, జన్నతుల్ కౌసర్ మిష్టిని వివాహం చేసుకున్నాడు. అతనికి ఇద్దరు కుమారులు - రయీద్, మాయెద్. [35] అతని భార్య చెల్లెలైన జన్నతుల్ కిఫాయెత్ మొండి, తోటి క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్‌ను వివాహం చేసుకున్నందున వాళ్ళిద్దరూ తోడల్లుళ్ళు అయ్యారు. [36] [37] 2020 నవంబరు 8 న, అతనికి కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. [38] 2023 మార్చిలో, అతను అమెరికన్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ-బంగ్లాదేశ్ నుండి MBA డిగ్రీని అందుకున్నాడు. [39]

రికార్డులు, విజయాలు[మార్చు]

కెప్టెన్సీ రికార్డు[మార్చు]

కెప్టెన్‌గా మహ్మూదుల్లా రికార్డు
ఫార్మాట్ ↓ మ్యాచ్‌లు గెలిచింది కోల్పోయిన డ్రా/NR
పరీక్ష [40] 6 1 4 0
వన్‌డే [41] కెప్టెన్‌గా చేయలేదు
T20I [42] 38 15 13 0
చివరిగా నవీకరించబడినది: 2021 డిసెంబరు 17
 • 2021 సెప్టెంబరులో, న్యూజిలాండ్‌తో జరిగిన 2వ T20I మ్యాచ్‌లో గెలిచిన తర్వాత, అతను T20I లలో (12 విజయాలతో) బంగ్లాదేశ్‌కు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా మష్రఫే మోర్తజాను అధిగమించాడు. [43]

అంతర్జాతీయ రికార్డు[మార్చు]

 • న్యూజిలాండ్ ఆటగాడు జాన్ రిచర్డ్ రీడ్ తర్వాత, టెస్టు మ్యాచ్‌లలో సెంచరీ సాధించి, ఐదు వికెట్ల పంట తీసి, స్టంపింగు చేసి ట్రిపుల్‌ను సాధించిన రెండో క్రికెటరు మహ్మూదుల్లా. [44] [45]

జాతీయ రికార్డు[మార్చు]

 • మహ్మూదుల్లా 2015 క్రికెట్ ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్‌పై సెంచరీ చేయడంతో క్రికెట్ ప్రపంచ కప్‌లో సెంచరీ చేసిన మొదటి బంగ్లాదేశ్ బ్యాటరు అయ్యాడు. [6] [7] 2015 క్రికెట్ ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ క్రికెట్ జట్టుపై మరో సెంచరీ సాధించాడు
 • ప్రపంచకప్‌లో వరుసగా రెండు సెంచరీలు సాధించిన తొలి బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అతను 2015 ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌లపై సెంచరీలు కొట్టాడు.
 • అతను 2014 ICC వరల్డ్ ట్వంటీ 20 లో ఆఫ్ఘనిస్తాన్‌పై 4 ఓవర్లలో 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. T20Iలో బంగ్లాదేశ్ బౌలర్లలో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన రికార్డు అది. [46]
 • 2021 సెప్టెంబరులో, 100 T20I మ్యాచ్‌లు ఆడిన మొదటి బంగ్లాదేశ్ ఆటగాడయ్యాడు. [47]

మూలాలు[మార్చు]

 1. Mahmudullah Riyad, Crictracker, 4 February 2016, retrieved 4 February 2016
 2. "Mahmudullah profile and biography, stats, records, averages, photos and videos".
 3. Mahmudullah the silent killer, Daily Bangladesh, retrieved 21 May 2019
 4. Mahmudullah the silent killer, Daily Sun, retrieved 10 June 2017
 5. 5.0 5.1 "Mahmudullah profile and biography, stats, records, averages, photos and videos". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-08-03.
 6. 6.0 6.1 "Mohammad Mahmudullah Hits Bangladesh's First World Cup Century | Cricket News". NDTVSports.com (in ఇంగ్లీష్). Retrieved 17 April 2020.
 7. 7.0 7.1 "Mahmudullah hits Bangladesh's first World Cup century". Yahoo Sports. Archived from the original on 3 ఆగస్టు 2022. Retrieved 1 June 2018.
 8. "Profile". Shamim Nesco. Retrieved 27 October 2022.
 9. "3rd ODI: Sri Lanka v Bangladesh at Colombo (RPS)". 25 July 2007. Retrieved 2007-09-01.
 10. "Twenty20 Quadrangular (in Kenya), 2007/08 – Bangladesh Squad". 25 August 2007. Retrieved 2007-09-01.
 11. "ICC World Twenty20, 2007/08 – Bangladesh Squad". ESPNcricinfo. 9 August 2007. Retrieved 2007-09-01.
 12. "1st Test: West Indies v Bangladesh at Kingstown, Jul 9–13, 2009". espncricinfo. Retrieved 2011-12-18.
 13. Isam, Mohammad (12 July 2011), Plenty to ponder for Bangladesh selectors, ESPNcricinfo, retrieved 2011-07-12
 14. Mashrafe Mortaza not in World Cup squad, ESPNcricinfo, 19 January 2011, retrieved 2011-02-04
 15. Mushfiqur Rahim named Bangladesh captain, Cricinfo, 20 September 2011, retrieved 2011-09-20
 16. Razzak dropped for West Indies Tests; Shafiul injured, ESPNricinfo, 18 October 2011, retrieved 2011-10-18
 17. Ashraful recalled for Pakistan Tests, Cricinfo, 7 December 2011, retrieved 2011-12-14
 18. Records / Pakistan in Bangladesh ODI Series, 2011/12 / Most runs, Cricinfo, retrieved 2011-12-14
 19. Records / Pakistan in Bangladesh ODI Series, 2011/12 / Most wickets, Cricinfo, retrieved 2011-12-14
 20. "Mahmudullah scores first World Cup century for Bangladesh during tie against England in ICC Cricket World Cup 2015, Pool A match at Adelaide". Cricket Country. 9 March 2015. Retrieved 1 June 2018.
 21. Mahmudullah, Rubel knock England out, Cricinfo, 9 March 2015, retrieved 2015-03-09
 22. "Batting and fielding for Bangladesh, World Cup 2014–15". CricketArchive. Retrieved 23 March 2015.
 23. "ICC Cricket World Cup 2015: Cricbuzz team of the tournament". Cricbuzz.
 24. "Finger injury rules Shakib out of first Sri Lanka Test". ESPNcricinfo. Retrieved 27 January 2018.
 25. "In-form Sri Lanka look to upset hosts Bangladesh". International Cricket Council. Retrieved 30 January 2018.
 26. "Didn't want it this way but excited: Mahmudullah". BDCrictime. Archived from the original on 30 January 2018. Retrieved 30 January 2018.
 27. "Nazmul Hossain Apu replaces Shakib Al Hasan in squad for first T20I". Sport24. Retrieved 13 February 2018.
 28. "Kusal Mendis, Thisara Perera overpower Bangladesh". ESPNcricinfo. Retrieved 15 February 2018.
 29. "Mushfiqur pulls off record Bangladesh chase". ESPNcricinfo. Retrieved 10 March 2018.
 30. "Mahmudullah takes Bangladesh to Nidahas Trophy final after dramatic win". The Indian Express. 16 March 2018. Retrieved 1 June 2018.
 31. "BCB cuts contracts list for 2018 to ten". ESPN Cricinfo. Retrieved 18 April 2018.
 32. "Mahmudullah makes shock decision to retire from Test cricket". ESPNCricinfo. Retrieved 11 July 2021.
 33. "Only Test, Harare, Jul 7 - 11 2021, Bangladesh tour of Zimbabwe". Cricinfo. Retrieved 3 December 2021.
 34. "Mahmudullah: 'It's the right time to end my Test career'". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 24 November 2021.
 35. "Mahmudullah Riyad with his new bride", The Daily Star, 26 June 2011, retrieved 2011-07-25
 36. "Mahmudullah blessed with a baby boy". Daily Sun. 7 April 2020. Retrieved 13 November 2020.
 37. "Mushfiqur Rahim marries Jannatul Kifayet". The New Nation. 26 September 2014. Archived from the original on 14 November 2020. Retrieved 13 November 2020.
 38. "Mahmudullah tests COVID19 positive". Dhaka Tribune. 8 November 2020. Retrieved 13 November 2020.
 39. "ক্লাস, অ্যাসাইনমেন্ট, পরীক্ষা—কিছুই বাদ দেননি মাহমুদউল্লাহ". Prothomalo (in Bengali). Retrieved 22 March 2023.
 40. Bangladesh captains' playing record in Test matches, ESPNCricinfo, retrieved 4 April 2012
 41. Bangladesh captains' playing record in ODI matches, ESPNCricinfo, retrieved 27 January 2016
 42. Bangladesh captains' playing record in Twenty20 International matches, ESPNCricinfo, retrieved 27 January 2016
 43. Ibne Kamal, Md Ashequl Morsalin. "BAN vs. NZ Series 2021: Mahmudullah Becomes Bangladesh's Most Successful T20I Captain". unb.com.bd (in English). Retrieved 5 September 2021.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
 44. "We asked you yesterday who was the only player ..." Official Facebook page of ICC. 16 April 2020. Retrieved 8 July 2021.
 45. মাহমুদউল্লাহর যে কীর্তি মনে করিয়ে দিল আইসিসি. Prothom Alo (in Bengali). Retrieved 17 April 2020.
 46. সোলায়মান, মোহাম্মদ. মাহমুদউল্লাহর '১০০'. Prothom Alo (in Bengali). Retrieved 5 September 2021.
 47. "Mahmudullah on course to be first Bangladeshi player to play 100 T20Is". jagonews24.com. Retrieved 5 September 2021.