మాచిపత్రి
Appearance
మాచిపత్రి | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | ఆ. వల్గారిస్
|
Binomial name | |
ఆర్టిమీసియా వల్గారిస్ |
మాచిపత్రి ఒక రకమైన మందుమొక్క. దీని శాస్త్రీయనామం ఆర్టిమీసియా వల్గారిస్ (Artemesia vulgaris). ఇది ఆస్టరేసి కుటుంబానికి చెందినది.మాచీ పత్రి మాఛిపత్రి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రపూజ క్రమములో ఈ ఆకు ఒకట వది.[1] ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం Artemisia.vulgaris.
లక్షణాలు
[మార్చు]- ఈ ఆకు లేత పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం సూదికొనలతో ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు చిన్న మొక్క గా పెరుగుతుంది.
- సువాసన వెదజల్లే బహువార్షిక గుల్మం.
- అనేక తమ్మెలుగా చీలిన వివిధ ఆకారాలు గల సరళ పత్రాలు.
- భిన్నపుష్టి శీర్షవద్విన్యాసంలో అమరి ఉన్న తెలుపు రంగు పుష్పాలు. ఊలు వంటి నూగున్న రక్షకపత్రాలు.
వైద్య గుణాలు
[మార్చు]ఈ పత్రి యొక్క ఔశధ గుణాలు :
- ఈ ఆకుని పసుపు, నువ్వుల నూనెతో కలిపి నూరి ఆ ముద్దను చర్మ వ్యాధులు ఉన్న చోట రాస్తే త్వరగా వ్యాధి నివారణ అవుతుంది.
- వాత రోగాలు
- ఇది నేత్ర సంబంధ రోగాలకు అద్భుత నివారిణి. మాచీ పత్రాన్ని నీళ్లలో తడిపి కళ్లకి కట్టుకుంటే నేత్రవ్యాధులు నయమవుతాయి.
సువాసన గుణం
[మార్చు]ఈ పత్రి సుగంధభరితంగా ఉంటుంది.
ఇతర ఉపయోగాలు
[మార్చు]ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు :
- 1. వ్రణాలు, క్రిమిహారి, దద్దుర్లు, వాత రోగాలు, నులిపురుగులను తగ్గిస్తుంది.
- 2.అతి దాహాన్ని హరిస్తుంది.
- 3. కొన్ని రకాల జ్వరాలను కూడా ఇది తగ్గించగలదు.
ఆయుర్వేదంలో
[మార్చు]ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. ఇది నేత్రవ్యాధులు , రకాల జ్వరాలను,వాత రోగాల నివారణకు ఉపయోగపడుతుంది.
వనరులు
[మార్చు]- http://www.suryaa.com/main/features/article.asp?category=4&SubCategory=1&ContentId=100018[permanent dead link]
మూలాలు
[మార్చు]- ↑ "వినాయకుడి పత్రిలతో కరోనా సంహారం!". web.archive.org. 2021-10-04. Archived from the original on 2021-10-04. Retrieved 2021-10-04.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)