Jump to content

మైనంపాటి భాస్కర్

వికీపీడియా నుండి
మైనంపాటి భాస్కర్
జననం(1945-10-27)1945 అక్టోబరు 27 [1]
మరణం2013 జూన్ 4(2013-06-04) (వయసు 67)
విద్యాసంస్థఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు[1]
వృత్తిరచయిత, కార్టూనిస్టు
జీవిత భాగస్వామివిమల[1]
పిల్లలుఅపర్ణ[1]
తల్లిదండ్రులు
  • ఎం. హెచ్. వి. అప్పారావు [1] (తండ్రి)
  • మహాలక్ష్మమ్మ[1] (తల్లి)

మైనంపాటి భాస్కర్(1945-2013) ప్రముఖ తెలుగు నవలా/కథా రచయిత, కార్టూనిస్టు. 40 సంవత్సరాలపాటు నవలలు, కథలు, రేడియోనాటకాలు, సమీక్షలు, కాలమ్స్, సినిమా రివ్యూలు, విమర్శావ్యాసాలు వ్రాశాడు. 30 దాకా నవలలు, వందకు పైగా కథలు వ్రాశాడు. ఎన్నో బహుమతులు అందుకున్నాడు. మైనంపాటి రచనల్లో స్త్రీ పక్షపాతం, దేశభక్తి కనిపిస్తాయి[2]. ఇతని నవలలు వాషింగ్‌టన్ లోని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌లో భద్రపరచబడినాయి.

జీవిత విశేషాలు

[మార్చు]

ఈయన 1945, నవంబరు 27 వతేదీన ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఎం.హెచ్.వి.అప్పారావు, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ఈయన కర్నూలులోని కొత్తపేట మునిసిపల్ స్కూలులోను, కోల్సు మెమోరియల్ హైస్కూలులోను, మునిసిపల్ హైస్కూలులోను చదివాడు. తరువాత హైదరాబాదులో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పొందాడు. ఈయన కార్మిక భీమాసంస్థలో 20 సంవత్సరాలు పనిచేసి పదవీవిరమణ చేసి తరువాత రచనా వ్యాసంగాన్నే జీవనోపాధిగా స్వీకరించాడు. కొంత కాలం కలర్‌చిప్స్ సంస్థలో ఫీచర్స్ ఎడిటర్‌గా పనిచేశాడు. ఈయన మొదట కార్టూనిస్టుగా పత్రికా రంగంలో ప్రవేశించి పిమ్మట కథలు, నవలలు వ్రాశాడు. ఈయన వ్రాసిన వెన్నెలమెట్లు అనే నవల అరుణకిరణం అనే సినిమాగా వెలువడి నంది పురస్కారాన్ని గెలుపొందింది. ఇతడు వ్రాసిన కథలు ఆంగ్లంలోనికి, ఇతర భారతీయ భాషలలోనికి అనువాదం అయ్యాయి. ఈయన 2013లో జూన్ 4వ తేదీన ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

నవలలు

[మార్చు]
  1. అగ్నిసాక్షి
  2. ఆఖరిమలుపు
  3. క్లైమాక్స్
  4. డైమండ్ రాజా ఆఠిన్ రాణి
  5. తులసీదళం
  6. దావాగ్ని
  7. పెళ్ళాంతో పెళ్ళి
  8. ప్రేమతరంగం
  9. ప్రేమపురాణం
  10. బుద్ధిజీవి
  11. బ్రహ్మప్రళయం
  12. భామకలాపం
  13. మనీబాంబ్
  14. మండువెన్నెల
  15. మారణహోమం
  16. మిస్టర్ 'యూ'
  17. మౌనరాగాలు
  18. యమదూత
  19. రౌడీరాజ్యం
  20. వలపుసంకెళ్ళు
  21. వెన్నెలమెట్లు
  22. వేగుచుక్క
  23. వైరం
  24. హైజాక్

కథా సంపుటాలు

[మార్చు]
  1. అర్ధరాత్రి ఆడపడుచులు

పత్రికలలో నిర్వహించిన శీర్షికలు

[మార్చు]
  1. మిర్చి మసాలా
  2. అంతా ఇంతే
  3. తారాతీరం
  4. ప్లెజర్ కుక్కర్

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "మైనంపాటి భాస్కర్ గురించి". mynampatibhaskar.com. మైనంపాటి భాస్కర్. Archived from the original on 4 జూన్ 2016. Retrieved 29 September 2016.
  2. విలేకరి (4 June 2013). "రచయిత మైనంపాటి భాస్కర్ కన్నుమూత". సాక్షి. Sakshi Media group. న్యూస్‌లైన్. Archived from the original on 26 సెప్టెంబరు 2016. Retrieved 26 September 2016.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లింకులు

[మార్చు]