Jump to content

మైనే ప్యార్ కియా

వికీపీడియా నుండి
మైనే ప్యార్ కియా
దర్శకత్వంప్రదీప్ మాదుగుల
నిర్మాతసన వెంకట్ రావు
ఉపేంద్ర కుమార్ గిరడ
తారాగణం
సంగీతంవి ప్రదీప్ కుమార్
నిర్మాణ
సంస్థ
యూనిఫై క్రియేషన్స్
విడుదల తేదీ
20 జూన్ 2014 (2014-06-20)
సినిమా నిడివి
132 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

మైనే ప్యార్ కియా 2014లో విడుదలైన తెలుగు సినిమా. యూనిఫై క్రియేషన్స్ బ్యానర్‌పై సన వెంకట్ రావు, ఉపేంద్ర కుమార్ గిరడ నిర్మించిన ఈ సినిమాకు ప్రదీప్ మాదుగుల దర్శకత్వం వహించాడు. ప్రదీప్, సత్యదేవ్, ఇషా తల్వార్, మధుమిత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను జూన్ 20న విడుదల చేశారు.

నవీన్(ప్రదీప్) ఒక  సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. నవీన్ రోజూ తన ఆఫీసులో ఉన్న అమ్మాయిలని ప్రేమలో పడేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తన చిన్ననాటి స్నేహితురాలు శాలిని(ఇషా తల్వార్) అదే ఆఫీసులో చేరుతుంది. ఆమెతో గతంలో నవీన్ కి ఒక చేదు అనుభవంఉండడం వల్ల తను ఎవరనేది చెప్పకుండా శాలినితో పరిచయం పెంచోకోగా, అది కాస్తా ప్రేమగా మారుతుంది. ఈ క్రమంలో శాలినికి నవీన్ తన ప్రేమ గురించి చెప్పే క్రమంలో తన గతం తెలిసి బ్రేకప్ చెబుతుంది. అసలు శాలిని నవీన్ కి మధ్య గతంలో ఏమి జరిగింది ? ఈ క్రమంలో శాలినిని నవీన్ ఒపించాడా లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[1]

నటీనటులు

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

కదలకుండా, గానం. ప్రదీప్ కుమార్

ఈ ప్రేమ మనకొద్దు , గానం.సీన్ రోల్డన్

శ్వాసే నువ్వే , గానం.శక్తిశ్రీ గోపాలన్ , ప్రదీప్ కుమార్

నింగిలోన ,(వెర్షన్1.) గానం.ప్రదీప్ కుమార్

అడిగిందే , గానం.అభయ్ జోధపుర్కర్ , కళ్యాణి నాయర్

పండు ,(థీమ్) గానం.చిన్నా, గణేష్ కుమార్, పోసాని.

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: యూనిఫై క్రియేషన్స్
  • నిర్మాతలు: సన వెంకట్ రావు, ఉపేంద్ర కుమార్ గిరడ
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రదీప్ మాదుగుల
  • సంగీతం: వి ప్రదీప్ కుమార్
  • సినిమాటోగ్రఫీ:ఎస్.వి.విశ్వ

మూలాలు

[మార్చు]
  1. Deccan Chronicle (21 June 2014). "Movie review 'Maine Pyar Kiya': Good attempt by a debutant director!" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2022. Retrieved 18 June 2022.