Jump to content

మైసూర్ ఎం.నాగరాజ

వికీపీడియా నుండి
మైసూర్ ఎం.నాగరాజ
సోదరుడు మైసూర్ మంజునాథ్(ఎడమ)తో మైసూర్ ఎం.నాగరాజ
వ్యక్తిగత సమాచారం
జననం(1960-05-09)1960 మే 9
మైసూరు, కర్ణాటక, భారతదేశం
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తివాయులీన విద్వాంసుడు
వాయిద్యాలువయోలిన్

మైసూర్ ఎం.నాగరాజ ఒక కర్ణాటక సంగీత వాయులీన విద్వాంసుడు. తన సోదరుడు మైసూర్ మంజునాథ్‌తో కలిసి మైసూర్ బ్రదర్స్ పేరుతో జంటగా వయోలిన్ కచేరీలు నిర్వహిస్తున్నాడు.

విశేషాలు

[మార్చు]

ఇతడు 1960, మే 9వ తేదీన మైసూరులో జన్మించాడు. ఇతడు తన తండ్రి ఎస్.మహదేవప్ప వద్ద వయోలిన్‌లో శిక్షణ తీసుకున్నాడు.[1] ఇతడు తన 10వ యేటనే తన సోదరునితో కలిసి మొట్టమొదటి కచేరీ చేశాడు. 1980నాటికి అగ్రశ్రేణి వయోలిన్ విద్వాంసులలో ఒకడిగా ఎదిగాడు. ఇతడు ఆకాశవాణి మైసూరు కేంద్రం నిలయ విద్వాంసుడిగా పనిచేశాడు. దేశ విదేశాలలో విస్తృతంగా పర్యటించి అనేక మంది సంగీత విద్వాంసుల కచేరీలలో వాయులీన సహకారం అందించాడు. అనేక సోలో కార్యక్రమాలు చేశాడు. దూరదర్శన్, ఆకాశవాణిలలో అనేక కార్యక్రమాలు చేశాడు. తన సోదరుడు మైసూర్ మంజునాథ్‌తో కలిసి మంగళంపల్లి బాలమురళీకృష్ణ, వై.జి.జోగ్, విశ్వమోహన్ భట్, ఎన్.రాజం, తేజేంద్ర నారాయణ, రోను మజుందార్ వంటి అగ్రశ్రేణి కర్ణాటక, హిందుస్తానీ విద్వాంసుల కచేరీలకు వాయులీన సహకారం అందించాడు.

ఇతడు సంగీత గురువుగా అనేక మందికి వయోలిన్‌లో శిక్షణ ఇచ్చాడు. ఇతడు కర్ణాటక సంగీతంపై అనేక సెమినార్లు, వర్క్‌షాపుల్లో పాల్గొని పత్రసమర్పణ గావించాడు. ఇతడు అనేక సి.డి.లు, ఆడియో రికార్డులను విడుదల చేశాడు.

పురస్కారాలు

[మార్చు]

సంగీత రంగంలో ఇతడు చేసిన కృషికి ఫలితంగా అనేక పురస్కారాలు ఇతడిని వరించాయి. వాటిలో కొన్ని:

మూలాలు

[మార్చు]
  1. web master. "Mysore M. Nagaraja". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Retrieved 27 March 2021.[permanent dead link]