Jump to content

మోహన్ భగవత్

వికీపీడియా నుండి
మోహన్ భగవత్
సంఘ ప్రార్థన చేస్తున్న మోహన్ భగవత్
6వ సర్ సంఘచాలక్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్
Assumed office
21 మార్చి 2009 (2009-03-21)
అంతకు ముందు వారుకె.ఎస్.సుదర్శన్
వ్యక్తిగత వివరాలు
జననం
Mōhana Bhāgavata

(1950-09-11) 1950 సెప్టెంబరు 11 (వయసు 74)
చంద్రపూర్, ముంబాయి, భారతదేశం
కళాశాలనాగపూర్ వెటర్నరీ కాలేజ్

మోహన్ భగవత్ పూర్తి పేరు మోహన్ మధుకర్ భగవత్. ఈయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రస్తుత సర్ సంఘ్ చాలక్. కె.ఎస్. సుదర్శన్ తర్వాత 2009 మార్చిలో ఆరవ సర్ సంఘ చాలక్ గా ఎంపికయ్యారు.

ప్రారంభ జీవితం

[మార్చు]

మోహన్ మధుకర్ భగవత్ అప్పటి బొంబాయి రాష్టం లోని చంద్రపూర్ లో కార్హడే బ్రాహ్మణ మరాఠీ కుటుంబంలో జన్మించారు.[1][2] ఈయన ఆర్ఎస్ఎస్ కార్యకర్తల కుటుంబం నుండి వచ్చారు. ఈయన తండ్రి మధుకర్ రావు భగవత్, చంద్రపూర్ లోని కార్యావాహా (కార్యదర్శి) గా, తరువాత గుజరాత్లో ప్రాంత ప్రచారక్ గా పనిచేశారు. అతని తల్లి మాలతి, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన రాష్ట్రీయ సేవికా సమితి సభ్యురాలు.

విద్య

[మార్చు]

భగవత్ పాఠశాల విద్యను లోకమాన్య తిలక్ విద్యాలయంలో, చంద్రపూర్ లోని జనతా కళాశాలలో బిఎస్సి మొదటి సంవత్సరం పూర్తి చేసి, నాగ్‌పూర్‌లోని ప్రభుత్వ పశువైద్య కళాశాల నుండి వెటర్నరీ సైన్సెస్ పశుసంవర్ధకంలో పట్టభద్రుడయ్యాడు. తరువాత వెటర్నరీ సైన్సెస్‌లో తన పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సు నుండి తప్పుకొని, తన పూర్తి సమయాన్ని 1975 చివరినాటికి ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ గా ప్రారంభించారు.

RSS తో అనుబంధం

[మార్చు]

భగవత్ 1977 లో మహారాష్ట్రలోని అకోలా ప్రాంతానికి ప్రచారక్ గా వెళ్ళారు. నాగ్పూర్, విదర్భ ప్రాంతాలకు బాధ్యత వహించే సంస్థలో ఎదిగారు. అతను 1991 నుండి 1999 వరకు భారతదేశానికి అఖిల భారతీయ శారీరక్ ప్రముఖ్ గా పనిచేశారు. తర్వాత అఖిల భారతీయ ప్రచారక్ ప్రముఖ్ గా పనిచేశారు. 2000 సంవత్సరంలో నాల్గవ సర్ సంఘ చాలక్ రాజేంద్ర సింగ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ పదవి నుండి, హెచ్. వి. శేషాద్రి ప్రధాన కార్యదర్శి పదవి నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నప్పుడు, కె. ఎస్. సుదర్శన్ కొత్త చీఫ్ గా, భగవత్ 'సహకార్యవహా' గా (ప్రధాన కార్యదర్శి)ఎంపికయ్యారు.

సర్ సంఘ్ చాలక్

[మార్చు]
2009 మార్చి 21 న భగవత్ ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్ చాలక్ (చీఫ్ ఎగ్జిక్యూటివ్) గా ఎన్నుకోబడ్డారు. 2015 జూన్ లో, వివిధ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల నుండి అధిక ముప్పు ఉన్నందున, భగవత్‌కు రౌండ్-ది-క్లాక్ రక్షణ కల్పించాలని భారత ప్రభుత్వం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాన్ని (సిఐఎస్ఎఫ్) ఆదేశించింది. Z + VVIP భద్రతా కవర్ తో, భగవత్ ఈ రోజు అత్యంత రక్షిత భారతీయులలో ఒకరు.[3]

రాష్ట్రపతి భవన్ కు ఆహ్వానం

[మార్చు]

2017 లో, అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేత రాష్ట్రపతి భవన్‌కు అధికారికంగా ఆహ్వానించబడిన మొదటి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌గా భగవత్ నిలిచారు. 2018 సెప్టెంబరులో మోహన్ భగవత్ డిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 3 రోజుల సమావేశానికి అధ్యక్షత వహించారు.[4]

తెలంగాణలో విజయ సంకల్ప శిబిరం

[మార్చు]

మోహన్ భగవత్, 2019 డిసెంబరు 24,25,26 తేదీలలో హైదరాబాద్ లోని మంగళంపల్లిలో మూడు రోజుల విజయ సంకల్ప శిబిరంలో పాల్గొని, సరూర్ నగర్ లో జరిగిన ముగింపు కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.[5]

రామ జన్మభూమి భూమి పూజ

[మార్చు]

2020లో రామజన్మభూమి అయిన అయోధ్య నగరంలో రామాలయ నిర్మాణ భూమి పూజలో పాల్గొన్నారు.

అవార్డులు, గుర్తింపులు

[మార్చు]

2017 లో, ప్రభుత్వ-జంతు, మత్స్య శాస్త్ర విశ్వవిద్యాలయం నాగ్‌పూర్‌లో జరిగిన కాన్వొకేషన్ కార్యక్రమంలో మోహన్ భగవత్‌ గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందాడు.[6]

చిత్రాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. India Today, Volume 34, Issues 9-17. Thomson Living Media India Limited. 2009. p. 21. Born on September 11, 1950, in a Karhade Brahmin family in Chandrapur, Maharashtra, he began his career as a veterinary officer. His father, Madhukar Rao Bhagwat, was a close associate of Hedgewar and M.S. Golwalkar
  2. Saba Naqvi (26 November 2012). "A Thread That Holds". Outlook. Retrieved 23 November 2018.
  3. "RSS chief Mohan Bhagwat gets Z+ VVIP security cover". Hindustan Times. 8 June 2015. Archived from the original on 17 సెప్టెంబరు 2015. Retrieved 16 April 2018.
  4. "Mohan Bhagwat: RSS has discarded chunks of Golwalkar's thoughts". The Times of India (in ఇంగ్లీష్). 20 September 2018. Retrieved 7 February 2021.
  5. "ఈనాడు దినపత్రిక డిసెంబర్ 27,2019". Eenadu.net.
  6. Pradip Kumar Maitra (7 March 2017). "RSS chief Mohan Bhagwat to get honorary doctorate in veterinary sciences". Hindustan Times. Retrieved 16 April 2018.