యతిరాజారావు పార్కు (తొర్రూరు)
యతిరాజారావు పార్కు | |
---|---|
రకం | పట్టణ పార్కు |
స్థానం | తొర్రూరు, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ |
సమీప పట్టణం | వరంగల్ |
విస్తీర్ణం | 7 ఎకరాలు |
నవీకరణ | 2023 |
నిర్వహిస్తుంది | తొర్రూరు పురపాలకసంఘం |
స్థితి | వాడులో ఉంది |
యతిరాజారావు పార్కు అనేది తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు పట్టణంలోని ఉన్న పార్కు.[1] తెలంగాణకు చెందిన సీనియర్ రాజకీయనాయకుడు, మాజీ మంత్రి నెమురుగోమ్ముల యెతిరాజారావు పేరుమీద ఈ పార్కు ఏర్పాటుచేయబడింది.
ఆధునీకరణ
[మార్చు]తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్‌ఐడీసీ) నుంచి 2.12 నిధులతో మెట్రో నగరాల్లో అభివృద్ధి చేసిన పార్కుల తరహాలో ఈ పార్కును అభివృద్ధి చేయబడింది. ఈ పార్కులో 85 రకాల పూలు, ఔషధ, అలంకారమైన మొక్కలతో గెజిబో, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, వాటర్ ఫౌంటెన్‌తోపాటు ఏర్పాటుచేయబడ్డాయి.[2]
ప్రారంభం
[మార్చు]తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ పట్టణ పార్కులు కార్యక్రమంలో 2.13 కోట్ల రూపాయలతో 14 ఎకరాలలో ఈ పార్కును ఆధునీకరించబడింది. ఈ యతిరాజారావు పార్కును 2023 మార్చి 8న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించాడు.[3] ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహిళా శిశు సంక్షేమ శాఖామంత్రి సత్యవతి రాధోడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇతర వివరాలు
[మార్చు]ఈ పార్కులో వివిధ రకాల క్రీడలు ఆడుతారు. ఇందులో క్రికెట్ వంటి క్రీడాపోటీలు కూడా నిర్వమించబడుతాయి.[4]
మూలాలు
[మార్చు]- ↑ "THORRUR MUNICIPALITY | District Mahabubabad, Government of Telangana | India". www.mahabubabad.telangana.gov.in. Archived from the original on 2021-01-25. Retrieved 2023-04-15.
- ↑ Today, Telangana (2021-06-06). "Thorrur gets idyllic lung space". Telangana Today. Archived from the original on 2021-06-07. Retrieved 2023-04-15.
- ↑ ABN (2023-03-09). "ప్రగతిలో తెలంగాణ టాప్". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-04-15. Retrieved 2023-04-15.
- ↑ India, The Hans (2021-11-08). "Errabelli Dayakar Rao takes a dig at BJP". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-11-08. Retrieved 2023-04-15.