శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్

వికీపీడియా నుండి
(రమణయ్య రాజా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రాజా-లక్ష్మీ అవార్డు
పురస్కారం గురించి
విభాగం కళలు, సంగీతం, విజ్ఞానం, పత్రికారంగం
వైద్యం, సమాజ సేవ
వ్యవస్థాపిత 1979
మొదటి బహూకరణ 1979
క్రితం బహూకరణ 2007
మొత్తం బహూకరణలు 29
బహూకరించేవారు శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్
నగదు బహుమతి లక్ష రూపాయలు
మొదటి గ్రహీత(లు) శ్రీశ్రీ
క్రితం గ్రహీత(లు) డా. సి.హెచ్. జ్ఞానేశ్వర్ మెమోరియల్ ఎండోమెంట్ ఫండ్
రాజ్యలక్ష్మీ పౌండేషన్ వ్యవస్థాపకులు పి.వి.రమణయ్య రాజా

శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ కళలు, విజ్ఞానం, సాహిత్యం, వైద్యం, పత్రికలు, ఇతర మేధోకృషులను గుర్తించి ఆయా రంగాలలో ఉన్నత సాధన జరిపినవారిని సన్మానించడానికి వెలకొల్పబడిన ఒక సంస్థ. 1979లో చెన్నైలో పి.వి.రమణయ్య రాజా అనే వాణిజ్యవేత్త ఈ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ రాజా లక్ష్మీ అవార్డు అనే బహుమతిని ప్రారంభించింది. ఈ బహుమతిలో భాగంగా లక్ష రూపాయల నగదును, ప్రశంసా పత్రాన్ని, Plaqueను అందజేస్తారు. అదే బహుమతి గ్రహీత అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన తెలుగు కళా సమితి (TFAS) నుండి డా. కె. వి. రావు, డా. జ్యోతిరావు బహుమతిగా 2000 అమెరికన్ డాలర్ల బహుమతి కూడా అందుకొంటారు.

రాజా లక్ష్మీ ఫౌండేషన్ "రాజా లక్ష్మీ సాహిత్య అవార్డు" (1987-1999), "గురువును గుర్తించండి" ("Recognise the Teacher") అవార్డును కూడా ప్రారంభించింది. కొన్ని ప్రత్యేక అవార్డులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం "రాజా-లక్ష్మీ అవార్డు", "లక్ష్మీ-రాజా వైదిక అవార్డు" (1994 నుండి) ఇస్తున్నారు. ఈ అవార్డులను శ్రీమతి మహాలక్ష్మీ రాజా పుట్టినరోజు అయిన ఆగస్టు 15న ప్రకటిస్తారు. రమణయ్య రాజా పుట్టినరోజు అయిన నవంబరు 19న బహూకరిస్తారు. ఐ.ఐ.టి. మద్రాస్ M. Sc. Chemistryలో ఉత్తమ విద్యార్థికి రత్నారావు స్మారక బహుమతిని ఇస్తున్నారు. ప్రతి యేటా మార్చి 13న మహాలక్ష్మీరాజా స్మారక ఉపన్యాస సభను నిర్వహిస్తున్నారు.

2008 సంవత్సరానికి గాను రాజా లక్ష్మీ అవార్డు కోనేరు హంపికి, ఆచంట శరత్ కమల్‌కు క్రీడారంగంలో వాఱి ప్రతిభకు గుర్తింపుగా ప్రకటించారు. క్రీడా రంగంలో ఫౌండేషన్ నుండి ఇది మొదటి అవార్డు.

ప్రచురణలు

[మార్చు]
క్రమ సంఖ్య సంవత్సరం ప్రచురణ పేరు రచయిత
01 1985 భజ గోవిందం డా.పప్పు వేణుగోపాలరావు
02 1986 సుందర కాండము ఉషశ్రీ
03 1987 లీలా కృష్ణుడు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
04 1988 నిత్యార్చన డా.పప్పు వేణుగోపాలరావు
05 1990 శ్రీ మాత శ్రీ మాతాజీ త్యాగీశానందపురి
06 1992 ఆత్మ బోధ కరిదేహల్ వెంకటరావు
07 1996 సనత్సు జాతీయ సౌరభం ప్రొ.సలాక రఘునాధ శర్మ
08 2000 శివానంద లహరి హంస ప్రొ.సలాక రఘునాధ శర్మ
09 2006 ప్రతిభా పంచామృతం రాంభట్ల నృసింహ శర్మ
10 2006 రామదాసు, త్యాగరాజు ప్రొ.ఎ.ప్రసన్నకుమార్

ఇవి కూడా చూడండి

[మార్చు]

రాజ్యలక్ష్మీ పౌండేషన్ లో అవార్డు గ్రహీతల చిత్రాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
పత్రికలలో వార్తలు