రాగోలు చిన అప్పలస్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాగోలు చిన అప్పలస్వామి (1888 - 1939) ప్రసిద్ధ మూలికా వైద్యులు.

వీరు విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం లోని జగన్నాధపురం గ్రామంలో అప్పన్న మరియు చంద్రమ్మ దంపతులకు జన్మించారు.

ఈ ప్రాంతం అంతా అరణ్యంలా ఉండేది. పొలాలకు, కట్టెల కోసం పోయిన పేదలు ఎక్కువ పాము కాటుకు గురై మరణించేవారు. ఇది వారికి బాధ కలిగించేది. ఒకసారి ఊరి చివర పశువులు కాచుకుంటుండగా ఒక సాధువు పాము కాటుకు, కొన్ని వ్యాధులకు కొన్ని మూలికలు గురించి చెప్పాడు. నాటి నుండి వీరు ఎందరో సర్పదష్టుల ప్రాణాలను రక్షించారు.

ఈనాటికీ వీరి వారసులు ఉచితంగానే వైద్యం చేస్తున్నారు.