రాపోలు ఆనంద భాస్కర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాపోలు ఆనంద భాస్కర్

మాజీ రాజ్యసభ సభ్యులు
పదవీ కాలం
2012, ఏప్రిల్ 3 – 2018, ఏప్రిల్ 2
తరువాత బడుగుల లింగయ్య యాదవ్

వ్యక్తిగత వివరాలు

జననం (1964-01-15) 1964 జనవరి 15 (వయసు 60)
ముంబై, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి సరోజా
సంతానం ప్రయాంక, ఆదిత్యరాం
పూర్వ విద్యార్థి ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఎం.ఏ)
వృత్తి రాజకీయ నాయకులు
మతం హిందూ

రాపోలు ఆనంద భాస్కర్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు. 2012, ఏప్రిల్ 3 నుండి 2018, ఏప్రిల్ 2 వరకు రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు.[1] జాతీయ చేనేత దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించడంలో కీలకపాత్ర పోషించాడు.

జననం - విద్యాభ్యాసం[మార్చు]

ఆనంద భాస్కర్ 1964, జనవరి 15బొంబాయిలోని పద్మశాలి కుంటుబంలో జన్మించాడు. ఆయన స్వస్థలం తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లాలోని కొడకండ్ల గ్రామం. 1987 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి సోషియాలజీ లో మాస్టర్ డిగ్రీ అందుకున్నారు.[2]

వ్యక్తిగత జీవితం[మార్చు]

సరోజ ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె (ప్రియాంక), కుమారుడు (ఆదిత్యారాం) ఉన్నారు.

వృత్తి జీవితం[మార్చు]

ప్రముఖ దినపత్రికలో జర్నలిస్ట్ తన జీవితాన్ని ప్రారంభించిన ఆనంద భాస్కర్, 1994లో కాంగ్రెస్ పార్టీ చేరారు.

రాజకీయ జీవితం[మార్చు]

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం (గాంధీ భవన్) లో మేనేజర్ గా పనిచేసారు. తెలంగాణ కోసం రాష్ట్రం కోసం తెలంగాణ కాంగ్రెస్ మానిటరింగ్ గ్రూప్ నడిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా కూడా పనిచేశారు.

2012లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనీయాగాంధీ చే రాజ్యసభకు ఎన్నికయ్యారు.[3] ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికై ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత 2014 మే 2న తెలంగాణ రాష్ట్రానికి కేటాయించబడింది.[4]

రాపోలు ఆనంద భాస్కర్ 2019 మార్చి 23న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి[5] ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో 2019 ఏప్రిల్ 4న కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, జేపీ నడ్డా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు.[6] ఆనంద్ భాస్కర్ 2022 అక్టోబర్ 26న మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు.[7]

జాతీయ చేనేత దినోత్సవ ప్రకటన[మార్చు]

2015లో కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవం అధికారికంగా ప్రకటించడంలో కీలకపాత్ర పోషించారు. భారత స్వాతంత్ర్యోద్యమంలో చేనేత అహింసాయుత ఉద్యమానికి నాంది పలికిన చేనేతరంగానికి ఒకరోజు ఉండాలన్న ఉద్దేశంతో 2005లో చేనేత దినోత్సవానికి సంబంధించిన పరిశోధన చేసి చారిత్రిక ఆనవాళ్ళను శోధించాడు, చేనేత దినోత్సవానికి సరైన తేదీ కోసం అధ్యయనం చేశారు. విదేశి వస్తు బహిష్కరణలో కీలకపాత్ర వహించిన ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా చేయాలని ఆనంద భాస్కర్ ప్రతిపాదించారు.[8][9] 2015 మార్చి 3న రాజ్యసభలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రకటించాలని కోరుతూ, అందుకు సంబంధించిన డాక్యుమెంటేషన్, రికార్డులు, పూర్వ చరిత్రను కేంద్ర ప్రభుత్వానికి అందించారు.[10][11] ఆనంద భాస్కర్ ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల, కేంద్ర ప్రాంత ప్రభుత్వాల అంగీకారంతో 2015, జూలై 29న భారత ప్రభుత్వం ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా అధికారిక గెజిట్ విడుదల చేసింది.[12]

మూలాలు[మార్చు]

 1. "Telangana action shifts back to Delhi". Deccan Chronicle. 24 July 2013. Archived from the original on 27 July 2013. Retrieved 24 June 2019.
 2. timesofindia.indiatimes.com (Mar 20, 2012). "Humble Rapolu Congress's aam aadmi". Retrieved 28 November 2016.
 3. www.thehindu.com (March 19, 2012). "RS list: Congress springs surprises". Retrieved 28 November 2016.
 4. www.thehindu.com (30 May 2014). "Draw of lots decides Rajya Sabha members for Telangana, Andhra". ది హిందూ. Retrieved 28 November 2016.
 5. "కాంగ్రెస్‌కు మరో ఇద్దరు రాజీనామా". 23 March 2019. Archived from the original on 24 October 2022. Retrieved 24 October 2022.
 6. "బీజేపీలో చేరిన రాపోలు ఆనంద భాస్కర్". 4 April 2019. Archived from the original on 24 October 2022. Retrieved 24 October 2022.
 7. "కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన రాపోలు ఆనంద్ భాస్కర్". 26 October 2022. Archived from the original on 26 October 2022. Retrieved 26 October 2022.
 8. "ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం". telugu.getlokalapp.com. 2020-08-07. Retrieved 2023-08-06.
 9. admin (2020-08-07). "చేనేత అభివృద్ధే లక్ష్యంగా పోరాడిన వ్యక్తి రాపోలు ఆనంద్ భాస్కర్". RBM Creative Media (in ఇంగ్లీష్). Archived from the original on 2023-08-06. Retrieved 2023-08-06.
 10. RAPOLU, ANANDA BHASKAR (2016-04-28). "Demand for declaring August 7 as National Handloom Weavers' Day". RajyaSabha Debate (in English): 2 (475-476). Archived from the original on 2023-08-06 – via rsdebate.nic.in.{{cite journal}}: CS1 maint: unrecognized language (link)
 11. Sucheta, Priyadarsini. "National Handloom Day 2015" (PDF). magazines.odisha.gov.in. Archived from the original (PDF) on 2023-08-06. Retrieved 2023-08-06.
 12. "PM Modi declares August 7 National Handloom Day to mark Swadeshi movement". 2015-08-07. Archived from the original on 2015-08-08. Retrieved 2023-08-06.