Jump to content

లక్షద్వీప సముద్రం

అక్షాంశ రేఖాంశాలు: 08°N 75°E / 8°N 75°E / 8; 75 (Laccadive Sea)
వికీపీడియా నుండి
(లక్కదీవ్ సముద్రం నుండి దారిమార్పు చెందింది)
లక్షద్వీప సముద్రం
లక్కదీవ్ సముద్రం
లక్షద్వీప సముద్రం
లక్షద్వీప సముద్రం
అక్షాంశ,రేఖాంశాలు08°N 75°E / 8°N 75°E / 8; 75 (Laccadive Sea)
రకంసముద్రం
ప్రవహించే దేశాలుభారతదేశం, శ్రీలంక, మాల్దీవులు
ఉపరితల వైశాల్యం786,000 కి.మీ2 (303,500 చ. మై.)
సరాసరి లోతు1,929 మీ. (6,329 అ.)
గరిష్ట లోతు4,131 మీ. (13,553 అ.)
మూలాలు[1]

లక్షద్వీప సముద్రం, భారతదేశం (లక్షద్వీప దీవులతో సహా), మాల్దీవులు, శ్రీలంకలు సరిహద్దులుగా ఉన్న జల నిలయం. ఇది కర్ణాటకకు నైరుతి లోను, కేరళకు పశ్చిమాన ఉంది. దీన్ని లక్కదీవు సముద్రం అని కూడా అంటారు. ఈ వెచ్చని సముద్రపు నీటి ఉష్ణోగ్రత ఏడాది పొడవునా స్థిరంగా ఉండి, సముద్ర జీవులతో సమృద్ధిగా ఉంటుంది. ఒక్క మన్నార్ సింధుశాఖ లోనే దాదాపు 3,600 జాతుల సముద్ర జీవులు ఉన్నాయి. మంగళూరు, కాసరగోడ్, కన్నూర్, కోజికోడ్, పొన్నాని, కొచ్చి, అలప్పుజా, కొల్లాం, తిరువనంతపురం, టుటికోరిన్, కొలంబో, మాలే లు లక్కదీవు సముద్రం ఒడ్డున ఉన్న ప్రధాన నగరాలు. ద్వీపకల్ప భారతదేశపు దక్షిణ కొన అయిన కన్యాకుమారి కూడా ఈ సముద్రానికి సరిహద్దుగా ఉంది.

పరిధి

[మార్చు]

ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్, లక్షద్వీప సముద్రపు హద్దులను క్రింది విధంగా నిర్వచించింది:[2]

పశ్చిమం వైపు. భారతదేశ పశ్చిమ తీరంలో సదాశివగడ్ నుండి (14°48′N 74°07′E / 14.800°N 74.117°E / 14.800; 74.117) కోరా దీవ్ వరకు (13°42′N 72°10′E / 13.700°N 72.167°E / 13.700; 72.167), అక్కడి నుండి లక్ష ద్వీపాల పశ్చిమ వైపుగా, మాల్దీవుల దక్షిణ కొన వద్ద ఉన్న అడ్డూ అటాల్ వరకు.

దక్షిణాన. శ్రీలంకలోని డోండ్రా హెడ్ నుండి అడ్డు అటోల్ లోని దక్షిణ కొన్న వరకు ఉన్న రేఖ.

తూర్పున. శ్రీలంక, భారత పశ్చిమ తీరాలు.

ఈశాన్యంలో. రామసేతు (భారత, శ్రీలంకల మధ్య)

జలవిజ్ఞానం

[మార్చు]

ఈ సముద్రంలో నీటి ఉష్ణోగ్రత ఏడాది పొడవునా స్థిరంగా ఉంటుంది. వేసవిలో సగటున 26-28 °C, శీతాకాలంలో 25 °C ఉంటుంది. లవణీయత మధ్య, ఉత్తర భాగాల్లో 34‰ (వెయ్యికి భాగాలు) దక్షిణాన 35.5‰ వరకు ఉంటుంది. తీరాలు ఇసుకతో కూడుకుని ఉంటాయి. లోతైన భాగాలు బురదతో కప్పబడి ఉంటాయి. సముద్రంలో అనేక పగడపు దిబ్బలు ఉన్నాయి, లక్షద్వీప్ దీవులు వంటివి పగడపు దీపాలతో తయారయ్యాయి. ఇక్కడ 105 పగడపు జాతులు ఉన్నాయి.[3][4]

మానవ కార్యకలాపాలు

[మార్చు]

మన్నార్ గల్ఫ్ కనీసం రెండు వేల సంవత్సరాలుగా పింక్డాడా రేడియటా, పింక్డాడా ఫుకాటా ముత్యాలకు ప్రసిద్ధి చెందింది. ప్లినీ ది ఎల్డర్ (ID1) ఈ సింధుశాఖలో ముత్యాల చేపల పెంపకాన్ని ప్రపంచంలోనే అత్యంత ఉత్పాదకమైనదిగా ప్రశంసించాడు.[5][6] సహజ ముత్యాల వెలికితీత ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో చాలా ఖరీదైనదిగా పరిగణించబడినప్పటికీ, ఇక్కడ ఇది ఇప్పటికీ చేస్తున్నారు.[7][8] ఇక్కడ పెద్ద సంఖ్యలో శంఖాలు లభిస్తాయి.[7] సముద్రంలోని ఇతర మోలస్కులు చాలా అరుదుగా ఉంటాయి లేదా భారతీయ సమాజంలో ప్రాచుర్యం పొందలేదు. అందువల్ల వాటికి వాణిజ్య విలువ లేదు.[9][10]

లక్షద్వీప సముద్రంలో చేపలు పట్టడం మరొక సాంప్రదాయిక వృత్తి. లక్షద్వీపాల నుండి వార్షికంగా 2,000 నుండి 5,000 టన్నుల చేపలు పడతారు. ఇందులో ఎక్కువగా ట్యూనా (సుమారు 70%), సొరచేపలు ఉంటాయి. పెర్చులు, హాఫ్‌బీక్‌లు, కారంగిడే, సూది చేప రేలు కూడా దిబ్బల సమీపంలో లభిస్తాయి. రొయ్యలు, అచెలాటా, స్ప్రాటస్, పోమాసెంట్రిడే, అపోగోనిడే వంటి చిన్న చేపలను లక్షద్వీప వాసులు ఎరగా ఉపయోగిస్తారు.[11]

మూలాలు

[మార్చు]
  1. V. M. Kotlyakov, ed. (2006). Dictionary of modern geographical names: Laccadive Sea (in రష్యన్). Archived from the original on 10 June 2020. Retrieved 19 July 2010.
  2. "Limits of Oceans and Seas, 3rd edition" (PDF). International Hydrographic Organization. 1953. p. 21. Archived from the original (PDF) on 8 October 2011. Retrieved 28 December 2020.
  3. Coral Reefs of India: Review of Their Extent, Condition, Research and Management Status by Vineeta Hoon, Food and Agriculture Organisation of the United Nations
  4. Status of Coral Reefs of India.
  5. Arnold Wright (1999). Twentieth century impressions of Ceylon: its history, people, commerce, industries, and resources. p. 227. ISBN 978-81-206-1335-5.
  6. James Hornell (2009). The Indian Pearl Fisheries of the Gulf of Manar and Palk Bay. BiblioBazaar. p. 6. ISBN 978-1-110-87096-7.
  7. 7.0 7.1 ICSF p. 27
  8. Michael O'Donoghue (2006). Gems: their sources, descriptions and identification. Butterworth-Heinemann. p. 566. ISBN 978-0-7506-5856-0.
  9. Taxa reported from regions in Indo-Arabia – see Maldives, Laccadive islands
  10. Error on call to Template:cite paper: Parameter title must be specified
  11. T. R. McClanahan; Charles R. C. Sheppard; David O. Obura (2000). Coral reefs of the Indian Ocean: their ecology and conservation. Oxford University Press. p. 305. ISBN 978-0-19-512596-2.