లవంగ్‌త్లై
లవంగ్‌త్లై | |
---|---|
పట్టణం | |
Coordinates: 22°31′55″N 92°53′56″E / 22.532°N 92.899°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మిజోరాం |
జిల్లా | లవంగ్‌త్లై |
Founded by | హైహ్ముంగా హ్లాన్చెయు |
జనాభా (2011) | |
• Total | 20,838 |
భాషలు | |
• అధికారిక | లై, మిజో, చక్మా |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 796891 |
Vehicle registration | ఎంజెడ్ |
సమీప నగరం | ఐజాల్ |
లోక్‌సభ నియోజకవర్గం | మిజోరాం లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | లవంగ్‌త్లై |
వాతావరణం | Cwa |
లవంగ్‌త్లై, మిజోరాం రాష్ట్రంలోని లవంగ్‌త్లై జిల్లా ముఖ్య పట్టణం.
చరిత్ర
[మార్చు]1880లో హైహ్ముంగా హ్లాన్చెయు అనే వ్యక్తి ఈ లవంగ్‌త్లై గ్రామాన్ని స్థాపించాడు. లవంగ్ అంటే పడవ అని, త్లై అంటే స్వాధీనం అని అర్థం[1]
జనాభా
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఈ పట్టణంలో 20,830 జనాభా ఉంది. ఇందులో పురుషులు 10,659 మంది, స్త్రీలు 10,171 మంది ఉన్నారు. మొత్తం జనాభాలో 3,122 (14.99%) మంది 0-6 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. పట్టణ అక్షరాస్యత రేటు 95.66% కాగా, ఇది రాష్ట్ర సగటు 91.33% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 96.97% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 94.28%గా ఉంది.[2]
రవాణా
[మార్చు]ఇక్కడ పవన్ హన్స్[3] (హెలికాప్టర్ సర్వీస్ సంస్థ) ఆధ్వర్యంలో హెలికాప్టర్ సేవలు ప్రారంభించబడ్డాయి.[4] 54వ జాతీయ రహదారి ద్వారా లవంగ్‌త్లై పట్టణం, ఐజాల్ నగరంతో కలుపబడుతోంది. లవంగ్‌త్లై, ఐజాల్ మధ్య 296 కి.మీ.ల దూరం ఉంది. వీటి మధ్య బస్సు, జీపులతో రవాణా సౌకర్యం ఉంది.[5] ఈ పట్టణం వరకు రైల్వేను విస్తరించాలని మిజోరాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.[6]
చదువు
[మార్చు]ఈ పట్టణంలో మిజోరం విశ్వవిద్యాలయ పరిధిలోని లవంగ్‌త్లై కళాశాల, అనేక ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి.
మీడియా
[మార్చు]లవంగ్‌త్లై పట్టణంలోని ప్రధాన వార్తాపత్రికలు:[7]
- చావ్ఖ్లీ టైమ్స్
- లై ఆవ్
- లై రామ్
- ది లాంగ్ట్లై పోస్ట్[8]
- ఫాంగ్‌పుయి ఎక్స్‌ప్రెస్
- రామ్ ఇంజి
మూలాలు
[మార్చు]- ↑ LH Chhuanawma (2006). Problem and Prospect of Urbanization in Lawngtlai. Mittal Publications.
- ↑ "Lawngtlai Population Census 2011". census2011.co.in. Retrieved 28 December 2020.
- ↑ "MIZORAMA HELICOPTER SERVICE TUR CHIEF MINISTER IN HAWNG". Mizoram DIPR. Archived from the original on 12 December 2013. Retrieved 28 December 2020.
- ↑ "Nilaini atangin 'Helicopter Service". The Zozam Times. Archived from the original on 23 September 2015. Retrieved 28 December 2020.
- ↑ "Aizawl to Siaha". Mizoram NIC. Retrieved 28 December 2020.
- ↑ Samaw.com: Railway upto (sic) Lawngtlai – South Mizoram proposed
- ↑ "Accredited Journalists". DIPR Mizoram. Archived from the original on 19 June 2013. Retrieved 28 December 2020.
- ↑ "Lawngtlai Post". Retrieved 28 December 2020.