సైహ
సైహ | |
---|---|
పట్టణం | |
Coordinates: 22°29′N 92°58′E / 22.48°N 92.97°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మిజోరాం |
జిల్లా | సైహ |
Elevation | 1,225 మీ (4,019 అ.) |
జనాభా (2014)[1] | |
• Total | 25,110 |
భాషలు | |
• అధికారిక | మారా రీహ్ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 796901 |
Vehicle registration | ఎంజెడ్ 03 |
వాతావరణం | Cwa |
సైహ[2] మిజోరాం రాష్ట్రంలోని సైహ జిల్లా ముఖ్య పట్టణం. ఇది రాష్ట్రంలోని దక్షిణ మధ్య భాగంలో ఉంది. ఈ పట్టణం మరా ప్రజలకు వాణిజ్య కేంద్రంగా ఉంది.
పద వివరణ
[మార్చు]'సియా' అంటే ఏనుగు అని, 'హ' అంటే ఏనుగు దంతం అని అర్థం. ఇక్కడ పెద్ద మొత్తంలో ఏనుగు దంతాలు దొరుకుతాయి. స్థానిక ప్రజలు ఈ పట్టణానికి 'సియాహా' అని పేరు పెట్టినప్పటికీ, మిజా ప్రజలు దీనిని 'సైహ' అని పిలుస్తారు.
భౌగోళికం
[మార్చు]సైహ పట్టణం 22°29′N 92°58′E / 22.48°N 92.97°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[3] ఇది సముద్రమట్టానికి 729 మీటర్లు (2,391 అడుగులు) ఎత్తులో ఉంది.
జనాభా
[మార్చు]2001 భారత జనాభా లెక్కల ప్రకారం,[4] సైహ పట్టణంలో 19,731 జనాభా ఉంది. ఈ జనాభాలో 52% మంది పురుషులు, 48% మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ సగటు అక్షరాస్యత రేటు 79% కాగా, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 80% కాగా, స్త్రీల అక్షరాస్యత 77% గా ఉంది. పట్టణ జనాభాలో 16% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం. 2001లో 19,731 మంది జనాభా ఉండగా, 2008లో 29,275 జనాభా ఉన్నారు.[5]
రవాణా
[మార్చు]ఈ పట్టణంలో పవన్ హన్స్[6] (హెలికాప్టర్ సర్వీస్ సంస్థ) ఆధ్వర్యంలో హెలికాప్టర్ సేవలు ప్రారంభించబడ్డాయి.[7] 54వ జాతీయ రహదారి ద్వారా సైహ పట్టణం, ఐజాల్ నగరంతో కలుపబడుతోంది. సైహ, ఐజాల్ మధ్య 378 కి.మీ.ల దూరం ఉంది. వీటి మధ్య బస్సు, జీపులతో రవాణా సౌకర్యం ఉంది.[8]
మీడియా
[మార్చు]సైహ పట్టణంలోని ప్రధాన వార్తాపత్రికలు:[9]
- బన్నెల్
- చిమ్ ఆవ్
- కావ్ల్ ఇంగ్
- మారలాండ్
- మూన్లైట్
- మారా త్లాలా
- సైహ పోస్ట్
- సైఖవ్‌పుయి
- సైహ టైమ్స్
- అవ్సిచారు
- దేవా మారా డైలీ
మూలాలు
[మార్చు]- ↑ "Census of India Search details". censusindia.gov.in. Retrieved 28 December 2020.
- ↑ http://www.madconline.com/wp-content/uploads/2015/01/Official_Resolution.pdf
- ↑ Falling Rain Genomics, Inc - Saiha
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 28 December 2020.
- ↑ Dept. of Economic & Statistic, Gov't of Mizoram Statistical Handbook 2008. Archived 2016-03-04 at the Wayback Machine
- ↑ "MIZORAMA HELICOPTER SERVICE TUR CHIEF MINISTER IN HAWNG". Mizoram DIPR. Archived from the original on 12 డిసెంబరు 2013. Retrieved 28 December 2020.
- ↑ "Nilaini atangin 'Helicopter Service". The Zozam Times. Archived from the original on 23 సెప్టెంబరు 2015. Retrieved 28 December 2020.
- ↑ "Aizawl to Siaha". Mizoram NIC. Retrieved 28 December 2020.
- ↑ "Accredited Journalists". DIPR Mizoram. Archived from the original on 19 జూన్ 2013. Retrieved 28 December 2020.
ఇతర లంకెలు
[మార్చు]- సైహ జిల్లా వెబ్సైట్ Archived 2018-06-24 at the Wayback Machine
- మరాలాండ్
- మరా ప్రజల ఆన్లైన్ సైట్
- సైహ ఆన్లైన్.కామ్: సైహ ఆన్లైన్ వెబ్సైట్ Archived 2005-11-27 at the Wayback Machine