సైహ జిల్లా
సైహ జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మిజోరాం |
ముఖ్య పట్టణం | సైహ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | మిజోరాం లోక్‌సభ నియోజకవర్గం |
• శాసనసభ నియోజకవర్గాలు | 3 |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,399.9 కి.మీ2 (540.5 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 56,574 |
• జనసాంద్రత | 40/కి.మీ2 (100/చ. మై.) |
• Urban | 25,110 (44.38%) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 90.01 |
• లింగ నిష్పత్తి | 979 |
Website | అధికారిక జాలస్థలి |
మిజోరాం రాష్ట్రంలోని సైహ 8 జిల్లాలలో సైహ ఒకటి. జిల్లా ఉత్తర, వాయవ్య సరిహద్దులలో లంగ్‌లై జిల్లా, పడమర సరిహద్దులో లవంగ్‌త్లై జిల్లా, దక్షిణ, తూర్పు సరిహద్దులో మయన్మార్ ఉన్నాయి. జిల్లా వైశాల్యం 1399.9 చ.కి.మీ. జిల్లాకేంద్రంగా సైహ పట్టణం ఉంది. 2001-2011 మద్య కాలంలో జిల్లా జనసంఖ్య 60.823 నుండి 56,574 కు క్షీణించింది. మిజోరాం జిల్లాలో సైహ జిల్లా అత్యల్పమైన జనసాంధ్రత కలిగిన జిల్లాగా గుర్తించబడింది.[1]
చరిత్ర
[మార్చు]సైహ జిల్లా ఒకప్పుడు చిన్ంతుయిపుయి జిల్లాలో భాగంగా ఉంటూ వచ్చింది. 1998లో చిన్ంతుయిపుయి జిల్లాను 2 భాగాలుగా విభజించి సైహ జిల్లా రూపొందించబడింది.
భౌగోళికం
[మార్చు]సైహ జిల్లా కేంద్రంగా సైహ పట్టణం ఉంది. మిజోరాం రాష్ట్రంలోని 8 జిల్లాలలో సైహ ఒకటి అంతేకాక వైశాల్యపరంగా సైహ 3వ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో ఐజ్‌వాల్, లంగ్‌లై. జిల్లాలో తుయిపాంగ్, సంగౌ, ఫురా, బౌల్‌పుయి మొదలన ప్రధాన పట్టణాలుగా ఉన్నాయి.
ఆర్ధికం
[మార్చు]2006లో పంచాయితీరాజ్ మంత్రిత్వశాఖ భారతీయ జిల్లాలు (640) లలో వెనుకబడిన 250 జిల్లాలలో సైహ ఒకటని గుర్తించింది. " [2] " బ్యాక్వర్డ్ రీజంస్ గ్రాంట్ ఫండ్ ప్రోగ్రాం " నుండి నిధులు అందుకుంటున్న జిల్లాలలో సైహ ఒకటి.[2]
విభాగాలు
[మార్చు]సైహ జిల్లా 3 రీజనల్ డెవెలెప్మెంటు బ్లాకులుగా (సైహ,సంగౌ, తుయిపాంగ్) విభజించబడింది. అలాగే 3 నియోజకవర్గాలుగా (సైహ,సంగౌ, తుయిపాంగ్) విభజించబడింది.
గణాంకాలు
[మార్చు]విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య | 56,574 |
ఇది దాదాపు | గ్రీన్‌లాండ్ దేశ జనసంఖ్యకు సమానం [3] |
అమెరికాలోని | నగర జనసంఖ్యకు సమం |
640 భారతదేశ జిల్లాలలో | 628వ స్థానం |
1చ.కి.మీ జనసాంద్రత | 40 |
2001-11 కుటుంబనియంత్రణ శాతం | -7.34% |
స్త్రీ పురుష నిష్పత్తి | 979:1000 |
జాతియ సరాసరి (928) కంటే | |
అక్షరాస్యత శాతం | 90.01%.[4] |
జాతియ సరాసరి (72%) కంటే | అధికం |
జిల్లాలో మరా ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. మారా ప్రజలకు " మారా అటానిమస్ జిల్లా కౌంసిల్ " పేరిట అటానిమస్ జిల్లా (సైహ, తుయిపాంగ్ రీజనల్ డెవెలెప్మెంట్ బ్లాకులు) ఉంది. తరువాత స్థానంలో ఉన్న లై ప్రజలు " లై అటానిమస్ జిల్లా కౌంసిల్ "లో భాగమైన సంగౌ రీజనల్ డెవెలెప్మెంటు బ్లాకులో ఉన్నారు.
వృక్షజాలం, జంతుజాలం
[మార్చు]1997లో సైహ జిల్లాలో 50చ.కి.మీ వైశాల్యంలో " పాంగ్పుయి నేషనల్ పార్క్ " స్థాపించబడింది.[5]
మూలాలు
[మార్చు]- ↑ "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Greenland 57,670 July 2011 est.
- ↑ census2011. "Saiha District : Census 2011 data". census2011.co.in. Retrieved 2013-06-15.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Indian Ministry of Forests and Environment. "Protected areas: Mizoram". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011.