Jump to content

హన్నాథియల్ జిల్లా

వికీపీడియా నుండి
హన్నాథియల్ జిల్లా
మిజోరాం రాష్ట్ర జిల్లా
మిజోరాం రాష్ట్రంలో ప్రాంతం ఉనికి
మిజోరాం రాష్ట్రంలో ప్రాంతం ఉనికి
దేశంభారతదేశం
రాష్ట్రంమిజోరాం
రాష్ట్ర ఏర్పాటు2019, జూన్ 3
ముఖ్య పట్టణంహన్నాథియల్
Government
 • లోక్‌సభ నియోజకవర్గంమిజోరాం లోక్‌సభ నియోజకవర్గం
జనాభా
Time zoneUTC+5:30 (భారత కాలమానం)

హన్నాథియల్ జిల్లా, మిజోరాం రాష్ట్రంలోని పదకొండు జిల్లాల్లో ఒకటి. 2008, సెప్టెంబరు 12న మొదటిసారిగా హన్నాథియల్ జిల్లాను ప్రకటించారు. 12 సంవత్సరాల తరువాత 2019, జూన్ 3న డిప్యూటీ కమిషనర్ కార్యాలయాన్ని ఏర్పాటుచేయడంతో జిల్లాగా ఏర్పడింది.[1] దీని ముఖ్య పట్టణం హన్నాథియల్.

చరిత్ర

[మార్చు]

1998 నుండి 2018 వరకు రెండు దశాబ్దాలుగా హన్నాథియల్ జిల్లా ఏర్పాటుకు జిల్లా ఏర్పాటు పోరాట కమిటీ పోరాటం చేసింది. హన్నాథియల్ పట్టణం నుండి ఐజ్‌వాల్ నగరం వరకు ర్యాలీలు, దీక్షలు, ఊరేగింపులు, బంద్ లు, [2] బహిరంగ సమావేశాలు, [3] మెమోరాండాలు, తీర్మానాలు ముఖ్యమంత్రికి సమర్పించారు.[4][5] అంతేకాకుండా 54వ జాతీయ రహదారి దిగ్బంధనం, [6] పత్రికా సమావేశాలు[7], మిజోరాం ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు.

2019, జూన్ 3న హన్నాథియల్ జిల్లా డిప్యూటీ కమిషనర్ కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలని మిజోరాం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. 2019, అక్టోబరు 18న జిల్లా ప్రధాన కార్యాలయంలోని హెచ్‌బిఎస్‌సి గ్రౌండ్ వద్ద ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది.[8]

టోపోనిమి

[మార్చు]

జిల్లా ప్రధాన కార్యాలయం హన్నాథియల్ పేరును జిల్లాకు పెట్టారు.

విభాగాలు

[మార్చు]

ఈ జిల్లాలో దక్షిణ తుయిపుయి, ఉత్తర లుంగ్లీ, తూర్పు లుంగ్లీ అనే మూడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ జిల్లాలో ఉన్న 27 పట్టణాలు, గ్రామాలలో 5,846 కుటుంబాలు ఉన్నాయి. 28,468 మంది జనాభా ఉన్నారు. ఇందులో 14,208 మంది పురుషులు, 14,260 మంది స్త్ర్రీలు ఉన్నారు. జిల్లా రాజధానిలో 1,548 కుటుంబాలు ఉండగా 7,187 జనాభా ఉన్నారు.[9]

పట్టణాలు, గ్రామాలు

[మార్చు]

హన్నాథియల్ జిల్లాలోని ప్రధాన పట్టణాలు, గ్రామాలు:

  1. రావుపుయ్
  2. పాంగ్జాల్
  3. థిల్ట్‌లాంగ్
  4. దక్షిణ చాంగ్టుయ్
  5. టార్ఫో
  6. ఖవ్రి
  7. ఐతుర్
  8. చెర్లున్
  9. పాత న్గార్చిప్
  10. కొత్త న్గార్చిప్
  11. థింగ్సాయ్
  12. బువల్పుయి హెచ్
  13. దక్షిణ లంగ్లెంగ్
  14. డెన్లుంగ్ (ఉప గ్రామం)
  15. లైట్ (మౌదర్ ఉప గ్రామంతో)
  16. రోట్లాంగ్ ఈస్ట్
  17. తుయిపు 'డి'
  18. డార్జో
  19. ముల్లియన్‌పుయి
  20. లంగ్‌పుట్‌లాంగ్
  21. దక్షిణ వాన్లైఫాయి
  22. హన్నాథియల్
  23. చిప్పిర్
  24. బువల్పుయి వి
  25. లుంగ్మావి
  26. ఫైలేంగ్ సౌత్

రవాణా

[మార్చు]

ఇక్కడ పవన్ హన్స్[10] (హెలికాప్టర్ సర్వీస్ సంస్థ) ఆధ్వర్యంలో హెలికాప్టర్ సేవలు ప్రారంభించబడ్డాయి.[11] 54వ జాతీయ రహదారి ద్వారా హన్నాథియల్ పట్టణం, ఐజ్‌వాల్ నగరంతో కలుపబడుతోంది. హన్నాథియల్, ఐజ్‌వాల్ మధ్య 172 కి.మీ.ల దూరం ఉంది. వీటి మధ్య బస్సు, మాక్సి క్యాబ్ లతో రవాణా సౌకర్యం ఉంది.[12]

భౌగోళికం

[మార్చు]

ఈ జిల్లాకు ఉత్తరం వైపు సెర్ఛిప్ జిల్లా, దక్షిణం వైపు లవంగ్‌త్లై జిల్లా, ఆగ్నేయం వైపు సైహ జిల్లా, తూర్పు వైపు మయన్మార్ రాష్ట్రం ఉంది. హన్నాథియల్ పట్టణం జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయంగా ఏర్పాటు చేయబడింది.

మూలాలు

[మార్చు]
  1. "HNAHTHIAL DISTRICT CELEBRATES FORMATION". DIPR Mizoram. Retrieved 27 December 2020.
  2. "Hnahthial leh Khawzawlah total bandh". Vanglaini Daily Newspaper. Archived from the original on 24 ఫిబ్రవరి 2015. Retrieved 27 December 2020.
  3. "Public Meeting". Vanglaini Daily Newspaper. Retrieved 27 December 2020.[permanent dead link]
  4. "Hnahthial District not likely". oneindia. Retrieved 27 December 2020.
  5. "Hnahthial residents for district status". The Telegraph. Retrieved 27 December 2020.
  6. "over 100 hurt in police lathicharge". Times of India. Retrieved 27 December 2020.
  7. "Press conference in Aizawl". Vanglaini Daily Newspaper. Retrieved 27 December 2020.[permanent dead link]
  8. "HNAHTHIAL DISTRICT CELEBRATES FORMATION". DIPRl. Retrieved 27 December 2020.
  9. "District thar 3-ah mi 1,15,424 an awm Saitual district-ah mihring an tam ber". Vanglaini. Archived from the original on 6 ఆగస్టు 2020. Retrieved 27 December 2020.
  10. "MIZORAMA HELICOPTER SERVICE TUR CHIEF MINISTER IN HAWNG". Mizoram DIPR. Archived from the original on 12 డిసెంబరు 2013. Retrieved 27 డిసెంబరు 2020.
  11. "Nilaini atangin 'Helicopter Service". The Zozam Times. Archived from the original on 23 September 2015. Retrieved 27 December 2020.
  12. "Aizawl to Siaha". Mizoram NIC. Retrieved 27 December 2020.

వెలుపలి లంకెలు

[మార్చు]