ఖాజాల్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖాజాల్ జిల్లా
మిజోరాం రాష్ట్ర జిల్లా
మిజోరాం రాష్ట్రంలో ప్రాంతం ఉనికి
మిజోరాం రాష్ట్రంలో ప్రాంతం ఉనికి
దేశంభారతదేశం
రాష్ట్రంమిజోరాం
జిల్లా ఏర్పాటు2019, జూన్ 3
ముఖ్య పట్టణంఖాజాల్
Government
 • లోక్‌సభ నియోజకవర్గంమిజోరాం లోక్‌సభ నియోజకవర్గం
జనాభా
Time zoneUTC+5:30 (భారత కాలమానం)

ఖాజాల్ జిల్లా, మిజోరాం రాష్ట్రంలోని పదకొండు జిల్లాల్లో ఒక జిల్లా. 2019, జూన్ 3న ఈ ఖాజాల్ జిల్లా ఏర్పాటు చేయబడింది.[1]

టోపోనిమి[మార్చు]

జిల్లా ప్రధాన కార్యాలయం ఖాజాల్ పేరును జిల్లాకు పెట్టారు.

విభాగాలు[మార్చు]

ఈ జిల్లాలో ఉత్తర చంఫై, హ్రాంగ్టూర్జో, లెంగ్టెంగ్, తుయిచాంగ్ అనే 4 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ జిల్లాలో 28 పట్టణాలు, గ్రామాలు ఉన్నాయి.[2] ఖాజాల్ పట్టణంలో సుమారు 3వేల కుటుంబాలు ఉన్నాయి, సుమారు 14,000 మంది నివసిస్తున్నారు.[3] ఖాజాల్ జిల్లాలో సుమారు 7,372 కుటుంబాలు ఉన్నాయి, ఇందులో 36,381 మంది నివసిస్తున్నారు.

పట్టణాలు, గ్రామాలు[మార్చు]

ఖాజాల్ జిల్లాలోని ప్రధాన పట్టణాలు, గ్రామాలు:

  • ఐడుజాల్
  • బాణం
  • చల్రాంగ్
  • చాంగ్ట్లై
  • చావర్తుయ్
  • డెమ్డమ్
  • దిల్కాన్
  • దుల్టే
  • హ్మున్‌చెంగ్
  • కవ్ల్కుల్హ్
  • కెల్కాంగ్
  • ఖావ్‌పుతాన్
  • ఖుయిలుయి
  • ఖులేన్
  • లుంగ్టాన్
  • మెల్బుక్-ఖానువామ్
  • మెల్హ్నిహ్ (చల్రాంగ్)
  • మువల్కావి
  • మువల్జెన్
  • నీహ్డాన్
  • కొత్త చల్రాంగ్
  • న్గైజాల్
  • పామ్‌చుంగ్
  • ఫన్‌చాంగ్‌జాల్
  • పుయిలో
  • రబుంగ్
  • త్లాంగ్మావి
  • తువల్పుయి
  • ట్యుల్టే
  • తుయిపుయి
  • వాంగ్ట్లాంగ్
  • వంకల్
  • జాపుయి
  • జోఖవ్తర్

వాతావరణం[మార్చు]

ఖాజాల్ జిల్లాలో మితమైన వాతావరణం ఉంటుంది. శీతాకాలంలో 0-20 డిగ్రీల ఉష్ణోగ్రత, వేసవికాంలో 15-30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది.

రవాణా[మార్చు]

ఖాజాల్ పట్టణం, ఐజాల్ నగరాల మధ్య 152 కి.మీ.ల దూరం ఉంది. ఖాజాల్ నుండి బస్సు, సుమో, హెలికాప్టర్ వంటి రవాణా సౌకర్యాలు ఉన్నాయి.[4]

భౌగోళికం[మార్చు]

ఈ జిల్లాకు ఉత్తరం వైపు సెర్ఛిప్ జిల్లా, దక్షిణం వైపు లవంగ్‌త్లై జిల్లా, ఆగ్నేయం వైపు సైహ జిల్లా, తూర్పు వైపు మయన్మార్ రాష్ట్రం ఉన్నాయి. ఖాజాల్ పట్టణం, జిల్లా పరిపాలనా ప్రధాన కేంద్రంగా ఉంది.

మూలాలు[మార్చు]

  1. "Hnathial DISTRICT CELEBRATES FORMATION". DIPR Mizoram. Retrieved 28 December 2020.
  2. "District thar 3-ah mi 1,15,424 an awm Saitual district-ah mihring an tam ber". Vanglaini. Archived from the original on 6 ఆగస్టు 2020. Retrieved 28 December 2020.
  3. "Khawzawlah DC pisa thar hawn a ni". Vanglaini. Archived from the original on 13 సెప్టెంబరు 2019. Retrieved 28 December 2020.
  4. "Aizawl to Siaha". Mizoram NIC. Archived from the original on 1 ఏప్రిల్ 2012. Retrieved 28 December 2020.

వెలుపలి లంకెలు[మార్చు]