ఖాజాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖాజాల్
పట్టణం
ఖాజాల్ is located in Mizoram
ఖాజాల్
ఖాజాల్
మిజోరాంలో ప్రాంతం ఉనికి
ఖాజాల్ is located in India
ఖాజాల్
ఖాజాల్
ఖాజాల్ (India)
నిర్దేశాంకాలు: 23°32′04″N 93°10′59″E / 23.5345°N 93.1830°E / 23.5345; 93.1830Coordinates: 23°32′04″N 93°10′59″E / 23.5345°N 93.1830°E / 23.5345; 93.1830
దేశంభారతదేశం
రాష్ట్రంమిజోరాం
జిల్లాఖాజాల్
ప్రభుత్వం
 • నిర్వహణడిప్యూటి కమీషనర్
విస్తీర్ణం
 • మొత్తం78 కి.మీ2 (30 చ. మై)
సముద్రమట్టం నుండి ఎత్తు
1,187 మీ (3,894 అ.)
జనాభా
(2015(reviced)
 • మొత్తం13,113
 • ర్యాంకు8వ
 • సాంద్రత141/కి.మీ2 (370/చ. మై.)
భాషలు
 • అధికారికమిజో
కాలమానంUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
796310
వాహనాల నమోదు కోడ్ఎంజెడ్-04
వాతావరణంCwa
జాలస్థలిmizoram.nic.in

ఖాజాల్, మిజోరాం రాష్ట్రంలోని ఖాజాల్ జిల్లా ముఖ్య పట్టణం. మిజోరాంలో అత్యధిక జనాభా కలిగిన పట్టణాల్లో ఇది ఒకటి.

జనాభా[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఈ పట్టణంలో 11,022 మంది జనాభా ఉన్నారు. ఇందులో 5,616 మంది పురుషులు, 5,406 మంది మహిళలు ఉన్నారు. మొత్తం జనాభాలో 0-6 సంవత్సరాల వయస్సు ఉన్నవారు 1,746 (15.84%) మంది ఉన్నారు. ఖాజాల్ పట్టణ అక్షరాస్యత రేటు 96.64% కాగా, రాష్ట్ర సగటు 91.33% ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 97.39% కాగా, స్త్రీల అక్షరాస్యత 95.86% గా ఉంది.

ఖాజాల్ నగరాన్ని 5 వార్డులుగా విభజించారు. ఇక్కడ 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఖాజాల్ పట్టణంలో మొత్తం 2,306 ఇళ్ళు ఉన్నాయి. పట్టణ అభివృద్ధి కమిటీ పట్టణంలో త్రాగునీరు, మురుగునీటి వంటి ప్రాథమిక సౌకర్యాలను అందిస్తోంది. పట్టణ పరిమితుల్లో రహదారులను నిర్మించడానికి, దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి కూడా కమిటీకి అధికారం ఉంది.

పరిపాలన[మార్చు]

ఖాజాల్ పట్టణంలో జిల్లా ప్రధాన కార్యాలయం ఉంది. ఇక్కడ అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. దీని పరిపాలనలో లుంగ్వర్, డార్న్‌గావ్న్, అరోవెంగ్, జైంగెన్, జుచిప్, దింతర్, కాన్‌జార్, వెంగ్తార్, ఎలక్ట్రిక్ వెంగ్, హెర్మాన్ వెంగ్ 10 గ్రామ పంచాయతీలు (విలేజ్ కౌన్సిల్స్) ఉన్నాయి.

చదువు[మార్చు]

ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఉన్నత విద్యకోసం ఖాజాల్ కళాశాల ఏర్పాటు చేశారు. [1]

రవాణా[మార్చు]

ఖాజాల్ పట్టణం, ఐజాల్ నగరాల మధ్య 152 కి.మీ.ల దూరం ఉంది. ఖాజాల్ నుండి బస్సు, సుమో, హెలికాప్టర్ వంటి రవాణా సౌకర్యాలు ఉన్నాయి.[2]

మతాలు[మార్చు]

ఖాజాల్‌లో క్రైస్తవ మతం ఎక్కువగా (98%) ఉంది. ఇక్కడ 11 చర్చిలు ఉన్నాయి.

మీడియా[మార్చు]

ఖాజాల్‌ పట్టణంలో ఖాజాల్ టైమ్స్, సి-అర్ అనేవి ప్రధాన వార్తాపత్రికలు.[3]

ఖాజాల్‌లో రెండు ప్రధాన కేబుల్ నెట్‌వర్క్ ఉన్నాయి:

 1. విఎల్ఎస్ దృష్టి
 2. ఎల్ఆర్ విజన్

పరిసరాలు[మార్చు]

 • లుంగ్వర్ వెంగ్
 • ఐఆర్ కాంప్లెక్స్
 • డియక్కాన్
 • డార్ంగాన్ వెంగ్
 • హెలిపట్ వెంగ్
 • అరో వెంగ్
 • జైంగెన్ వెంగ్
 • కోల్లెజ్ వెంగ్
 • జుచిప్ వెంగ్
 • ఖాల్ దింతార్
 • కౌన్జార్ వెంగ్
 • చింగావెంగ్
 • వెంగ్తర్
 • వెంగ్నుయం
 • ఎలక్ట్రిక్ వెంగ్
 • హెర్మాన్ వెంగ్
 • చుమ్లియమ్కాన్

జిల్లాగా ఏర్పడటం (2019)[మార్చు]

2019, జూన్ 3న హన్నాథియల్, సైతువాల్, ఖాజాల్ జిల్లాల డిప్యూటీ కమిషనర్ల కార్యాలయాలను ఏర్పాటు చేయాలని మిజోరాం ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా ఆదేశించింది. ఆ తరువాత మూడు జిల్లాల్లో పరిపాలన ప్రారంభమయింది.[4] ఖాజాల్ మొదట్లో చంఫై జిల్లాలో భాగంగా ఉండేది, ఇప్పుడు స్వతంత్ర జిల్లాగా ఏర్పడింది.

మూలాలు[మార్చు]

 1. "Khawzawl College". Archived from the original on 12 సెప్టెంబర్ 2017. Retrieved 28 December 2020. Check date values in: |archive-date= (help)
 2. "Aizawl to Siaha". Mizoram NIC. Archived from the original on 1 ఏప్రిల్ 2012. Retrieved 28 December 2020.
 3. "Accredited Journalists". DIPR Mizoram. Archived from the original on 19 June 2013. Retrieved 28 December 2020.
 4. "Hnahthial district celebrates formation". DIPRl. Retrieved 28 December 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=ఖాజాల్&oldid=3118798" నుండి వెలికితీశారు