Jump to content

చంఫై

అక్షాంశ రేఖాంశాలు: 23°27′22″N 93°19′44″E / 23.456°N 93.329°E / 23.456; 93.329
వికీపీడియా నుండి
చంఫై
పట్టణం
చంఫై పట్టణం
చంఫై పట్టణం
చంఫై is located in Mizoram
చంఫై
చంఫై
చంఫై is located in India
చంఫై
చంఫై
Coordinates: 23°27′22″N 93°19′44″E / 23.456°N 93.329°E / 23.456; 93.329
దేశం భారతదేశం
రాష్ట్రంమిజోరాం
జిల్లాచంఫై
విస్తీర్ణం
 • Total3,185.3 కి.మీ2 (1,229.9 చ. మై)
Elevation
1,678 మీ (5,505 అ.)
జనాభా
 (2011)
 • Total32,734
భాషలు
 • అధికారికమిజో
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
796321
టెలిఫోన్ కోడ్03831
Vehicle registrationఎంజెడ్-04
వాతావరణంCwb

చంఫై, మిజోరాం రాష్ట్రంలోని చంఫై జిల్లా ముఖ్య పట్టణం, ప్రధాన కార్యాలయం. ఇండో- మయన్మార్ సరిహద్దులో ఉన్న ఈ పట్టణం భారత-మయన్మార్లకు ఇది ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉంది. చంఫై పట్టణం 3,185.83 చ.కి.మీ. (1,230 చ.మై.) విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ సగటు వార్షిక వర్షపాతం 1,814 మి.మీ. (71.4 అం.)గా ఉంది.

చరిత్ర

[మార్చు]

1871–72 నాటి బ్రిటిష్ యాత్రకు ప్రాతినిధ్యం వహించిన మిజో చీఫ్ వాన్హుయిలియానా కుమారుడు లాల్బురా సైలోకు ఈ ఛంపై పట్టణం ప్రధాన కార్యాలయంగా ఉండేది. బ్రిటిష్ కాలంలో ఇక్కడ కోటను నిర్మించారు.[1] చంఫై లోయ ఒకప్పుడు సరస్సులతో నిండివుండేది. 1872 లుషాయ్ యాత్రలోని మైదానపు నేల ఇప్పటికీ సాగు చేయబడలేదు.[2] బ్రిటిష్ వలస అధికారులు తమ సైనికులకు, కార్మికులకు బియ్యం సరఫరా చేయమని ప్రోత్సహించడంతో 1898వ సంవత్సరంలో చంఫైలో సాగునీటి ద్వారా వరిసాగు ప్రారంభమైంది. 1922 నాటికి, చంఫై పట్టణంలో కేవలం ఒక దుకాణం మాత్రమే ఉండేది.[3] 1966, మార్చి 1న ఎంఎన్ఎఫ్ ఏకపక్ష మిజో స్వాతంత్ర్యాన్ని ప్రకటించింది, చంఫై వద్ద అస్సాం రైఫిల్స్ పోస్టుపై దాడి చేసింది.[4]

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]

చంఫై పట్టణంలో వ్యవసాయం, సరిహద్దు వ్యాపారం ప్రధాన ఆదాయంగా ఉంది. జొఖవ్‌తార్‌లోని ట్రేడింగ్ పోస్ట్ ద్వారా మయన్మార్[5] నుండి దిగుమతి చేసుకున్న బట్టలు, వెండి సామాగ్రి, ఎలక్ట్రానిక్స్ మొదలైన వస్తువులతో ఈ పట్టణం, మిజోరాం రాష్ట్రంలోనే ప్రధాన వాణిజ్య కేంద్రంగా గుర్తింపు పొందింది. ఇక్కడ వరి, ద్రాక్ష ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులుగా ఉన్నాయి. 113 కిలోమీటర్ల పొడవు, 48 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఫ్లాట్‌ల్యాండ్‌లో వరిపంట సాగు చేస్తారు. ఇక్కడ ప్రతి ఏటా 19,200 క్వింటాళ్ల వరిని పండిస్తారు. 2011లో 10,000 క్వింటాళ్ల ద్రాక్షను సాగు చేశారు.

వాతావరణం

[మార్చు]

ఇక్కడ మిత వాతావరణం ఉంటుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రత 10-20°C మధ్య, వేసవికాలంలో 15-30°C మధ్య ఉంటుంది.

విద్య

[మార్చు]

ఈ పట్టణంలో ఉన్నత విద్య కోసం చంఫై కళాశాల మాత్రమే ఏర్పాటు చేయబడింది. అయితే, ఇక్కడ అనేక ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి.

మీడియా

[మార్చు]

ఛాంపై పట్టణంలోని ప్రధాన మీడియా సంస్థలు: [6]

  • లెన్రల్
  • పసల్త
  • రిహ్లిపుయి
  • సిసిఎన్ (డిజిటల్ టీవీ ఆపరేటర్)
  • ఎల్‌సిఎన్ (డిజిటల్ టీవీ ఆపరేటర్)

రవాణా

[మార్చు]

ఇక్కడ పవన్ హన్స్[7] (హెలికాప్టర్ సర్వీస్ సంస్థ) ఆధ్వర్యంలో హెలికాప్టర్ సేవలు ప్రారంభించబడ్డాయి. ఇది ఐజ్‌వాల్ నగరాన్ని చాంపై పట్టణంలో కలుపుతుంది.[8] ఛాంపై, ఐజ్‌వాల్ మధ్య 194 కి.మీ.ల దూరం ఉంది. వీటి మధ్య బస్సు, మాక్సి క్యాబ్ లతో రవాణా సౌకర్యం ఉంది.[9]

మూలాలు

[మార్చు]
  1. K. C. Kabra (2008). Economic Growth of Mizoram: Role of Business & Industry. Concept Publishing Company. ISBN 9788180695186.
  2. Woodthorpe, RG. The Lushai Expedition. Hardpress. pp. 277–278. ISBN 9781290939966.
  3. The Camera as Witness. Cambridge University Press. 13 April 2015. pp. 173. ISBN 9781107073395.
  4. Sharma, Sushil Kumar. Lessons from Mizoram Insurgency and Peace Accord 1986. Vivekananda Foundation. p. 4.
  5. "TRADE AND COMMERCE". CIC. Archived from the original on 4 March 2016. Retrieved 27 December 2020.
  6. "Accredited Journalists". DIPR Mizoram. Archived from the original on 19 June 2013. Retrieved 27 December 2020.
  7. "MIZORAMA HELICOPTER SERVICE TUR CHIEF MINISTER IN HAWNG". Mizoram DIPR. Archived from the original on 12 December 2013. Retrieved 27 December 2020.
  8. "Nilaini atangin 'Helicopter Service". The Zozam Times. Archived from the original on 23 September 2015. Retrieved 27 December 2020.
  9. "Aizawl to Champhai". Mizoram NIC. Archived from the original on 1 ఏప్రిల్ 2012. Retrieved 27 December 2020.

ఇతర లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=చంఫై&oldid=4140860" నుండి వెలికితీశారు