సెర్ఛిప్
సెర్ఛిప్ | |
---|---|
పట్టణం | |
దస్త్రం:Serchhip.jpg | |
Nickname: సెర్కావ్‌పుయి | |
Coordinates: 23°18′32″N 92°51′24″E / 23.308996°N 92.856701°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మిజోరాం |
జిల్లా | సెర్ఛిప్ |
Elevation | 888 మీ (2,913 అ.) |
జనాభా (2011) | |
• Total | 64,875 |
• జనసాంద్రత | 46/కి.మీ2 (120/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | మిజో |
Time zone | UTC+౦5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 796181 |
టెలిఫోన్ కోడ్ | +913838 |
Vehicle registration | ఎంజెడ్-06 |
సమీప పట్టణం | ఐజాల్ |
స్త్రీ పురుష నిష్పత్తి | 976 ♂/♀ |
అక్షరాస్యత | 98.76% |
లోక్‌సభ నియోజకవర్గం | మిజోరాం లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | సెర్ఛిప్ |
సివిక్ ఏజెన్సీ | గ్రామ కౌన్సిల్ |
సెర్ఛిప్, మిజోరాం రాష్ట్రంలోని సెర్ఛిప్ జిల్లా ముఖ్య పట్టణం, ప్రధాన కార్యాలయం. మిజోరాం మధ్యభాగంలో ఉన్న ఈ పట్టణం రాష్ట్ర రాజధాని ఐజాల్ నగరానికి 112 కి.మీ.ల దూరంలో ఉంది. దేశం మొత్తంమీద ఈ జిల్లాలో అత్యధిక అక్షరాస్యత ఉంది. సెర్ఛిప్ గ్రామంలోని మొదటి కొండపైన కనిపించే సిట్రస్ చెట్ల నుండి సెర్ఛిప్ అనే పేరు వచ్చింది.
భౌగోళికం
[మార్చు]సెర్ఛిప్ పట్టణం 23°18′N 92°50′E / 23.3°N 92.83°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[1] ఇది సముద్రమట్టానికి 888 మీటర్లు (2,913 అడుగులు) ఎత్తులో ఉంది. మాట్ నది, టుయికుమ్ నదుల మధ్య ఉన్న సెర్ఛిప్ పట్టణానికి టుయికుమ్ నది నుండి త్రాగునీరు, మాట్ నది నుండి సాగునీరు అందుతోంది. పట్టణ వార్షిక ఉష్ణోగ్రతలు 34-10 డిగ్రీల వరకు ఉంటుంది
జనాభా
[మార్చు]2011 భాతర జనాభా లెక్కల ప్రకారం, ఈ పట్టణంలో 64,875 మంది జనాభా ఉన్నారు. ఇందులో 32,824 మంది పురుషులు, 32,051 మంది స్త్రీలు ఉన్నారు. 2001నాటి జనాభాతో పోలిస్తే జనాభా పెరుగుదలలో 20.45 శాతం మార్పు ఉంది.
ఆర్థిక వ్యవస్థ
[మార్చు]ఈ పట్టణంలో వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉంది. ఈ పట్టణానికి సమీపంలో మాట్ నది లోయ ఉన్నందువల్ల క్యాబేజీ, ఆవపిండిలకు పంటలకు పేరొందింది.
రవాణా
[మార్చు]ఇక్కడ పవన్ హన్స్ (హెలికాప్టర్ సర్వీస్ సంస్థ) ఆధ్వర్యంలో హెలికాప్టర్ సేవలు ప్రారంభించబడ్డాయి.[2] ఈ పట్టణం 54వ జాతీయ రహదారి ద్వారా సిల్చార్ కు, 40వ జాతీయ రహదారి ద్వారా అగర్తలాకు, 150వ జాతీయ రహదారి ద్వారా ఇంఫాల్కు కలుపబడుతోంది. ఇక్కడ బస్సు, టాక్సీ, ఆటోరిక్షాలతో రవాణా సౌకర్యం ఉంది.
ప్రజారోగ్యం
[మార్చు]ఇక్కడ మలేరియా, కాన్సర్ వంటి ప్రజారోగ్య సమస్యలు ఉన్నాయి. అంగన్వాడి కేంద్రాల నుండి శిశువులు, పిల్లలకు ప్రాథమిక ఆరోగ్య, పోషక పదార్ధాలను అందిస్తున్నారు.
పారాగ్లైడింగ్
[మార్చు]ఇది ఇక్కడి ప్రజలకు కొత్త ఆట. 2020లో ఫెడరేషన్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సెర్ఛిప్ పట్టణంలో ఇంటర్నేషనల్ పారాగ్లైడింగ్ ఛాంపియన్‌షిప్ జరిగింది.
మూలాలు
[మార్చు]- ↑ Falling Rain Genomics, Inc - Serchhip
- ↑ "MIZORAMA HELICOPTER SERVICE TUR CHIEF MINISTER IN HAWNG". Mizoram DIPR. Archived from the original on 12 డిసెంబరు 2013. Retrieved 28 December 2020.
ఇతర లంకెలు
[మార్చు]- సెర్ఛిప్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ Archived 2018-11-26 at the Wayback Machine
- ప్రభుత్వం సెర్ఛిప్ కళాశాల
- తాజా సెర్ఛిప్ వార్తలు Archived 2016-03-08 at the Wayback Machine
- జోత్లిఫిమ్ డైలీ వార్తాపత్రిక సెర్షిప్ Archived 2022-06-05 at the Wayback Machine