లవ్లీ ఆనంద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లవ్లీ ఆనంద్
లవ్లీ ఆనంద్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు రమా దేవి
నియోజకవర్గం షెయోహర్
పదవీ కాలం
1994 – 1996
ముందు శివశరణ్ సింగ్
తరువాత రఘువంశ్ ప్రసాద్ సింగ్
నియోజకవర్గం వైశాలి

బీహార్ శాసనసభ సభ్యురాలు
పదవీ కాలం
2005 – 2005
ముందు భువేశ్వర్ సింగ్
తరువాత జ్ఞానేంద్ర కుమార్ సింగ్
నియోజకవర్గం బార్హ్
పదవీ కాలం
1996 – 2000
ముందు వీరేంద్ర కుమార్ సింగ్
తరువాత భీమ్ కుమార్ యాదవ్
నియోజకవర్గం నబీనగర్

వ్యక్తిగత వివరాలు

జననం (1966-12-12) 1966 డిసెంబరు 12 (వయసు 57)
రాజకీయ పార్టీ జనతాదళ్ (యునైటెడ్)
ఇతర రాజకీయ పార్టీలు *హిందుస్తానీ అవామ్ మోర్చా
జీవిత భాగస్వామి ఆనంద్ మోహన్ సింగ్
సంతానం చేతన్ ఆనంద్ సింగ్, సురభి ఆనంద్, అన్షుమన్ ఆనంద్
నివాసం పాట్నా

లవ్లీ ఆనంద్ (జననం 12 డిసెంబర్ 1966) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా, లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

లవ్లీ ఆనంద్ 12 డిసెంబర్ 1966న జన్మించింది. ఆమె రాంచీ యూనివర్శిటీ నుంచి బీఏ పూర్తి చేసి పట్టా అందుకుంది.

రాజకీయ జీవితం

[మార్చు]

లవ్లీ ఆనంద్ 1994లో వైశాలి లోక్‌సభ నియోజకవర్గంకు జరిగిన ఉప ఎన్నికల్లో సమతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి లో‍క్‍సభ సభ్యురాలిగా లో‍క్‍సభకు ఎన్నికైంది. ఆమె 1996లో నబీనగర్ శాసనసభ నియోజకవర్గంకు జరిగిన ఉప ఎన్నికలలో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. లవ్లీ ఆనంద్ ఆ తరువాత 2005లో జేడీయూ నుండి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.

లవ్లీ ఆనంద్ 1996 లో‍క్‍సభ ఎన్నికలలో పోటీ చేయలేదు, 1999 ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయింది. ఆమె 2009లో అలంనగర్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పార్టీలో అంతర్గత కలహాల కారణంగా ఎన్నికల్లో ఓడిపోయింది. లవ్లీ ఆనంద్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి 2014 లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ ఓడిపోయింది. లవ్లీ ఆనంద్ ఆ తరువాత 2015లో జితన్ రామ్ మాంఝీ పార్టీ [[హమ్‌లో చేరింది. ఆమె 2020 శాసనసభ ఎన్నికలకు ముందు 2020 సెప్టెంబర్ 29న ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ సమక్షంలో ఆర్జేడీ పార్టీలో చేరి,[1] 2020లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సహర్సా అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయింది.

లవ్లీ ఆనంద్ మార్చి 2024లో జేడీయూలో చేరి[2] 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో షెయోహర్ నుండి జేడీయూ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆర్జేడీ అభ్యర్థి రీతూ జైస్వాల్‌పై ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లో‍క్‍సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[3][4]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (29 September 2020). "Former Vaishali MP Lovely Anand and son join RJD". Archived from the original on 13 July 2024. Retrieved 13 July 2024.
  2. The Times of India (19 March 2024). "Lovely Anand joins JD(U), may contest from Sheohar". Archived from the original on 13 July 2024. Retrieved 13 July 2024.
  3. TV9 Bharatvarsh (7 June 2024). "शिवहर लोकसभा सीट से जीतने वाले जेडीयू की लवली आनंद कौन हैं, जानिए अपने सांसद को". Archived from the original on 13 July 2024. Retrieved 13 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Sheohar". Archived from the original on 13 July 2024. Retrieved 13 July 2024.