లింగోజిపల్లి
లింగోజిపల్లి | |
---|---|
గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°34′01″N 79°07′01″E / 15.567°N 79.117°ECoordinates: 15°34′01″N 79°07′01″E / 15.567°N 79.117°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కంభం మండలం |
మండలం | కంభం ![]() |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( ![]() |
పిన్(PIN) | 523370 ![]() |
లింగొజిపల్లి, ప్రకాశం జిల్లా, కంభం మండలానికి చెందిన గ్రామం. [1]
గ్రామ భౌగోళికం[మార్చు]
ఈ గ్రామం కంభం తర్లుపాడు మీదుగా పోవు మార్కాపురం రహదారిలో వచ్చును.
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
ఈ గ్రామం లోని గ్రామస్థులు కులాలకు అతీతంగా శ్రీరామ నవమి, మొహరమ్ (పీర్ల) పండుగలు చాల బాగా జరుపుకుంటారు. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా సీతా రామ కల్యాణం, హనుమ, గరుడ, రథోత్సవం, వసంతోత్సవం చాల ఘనంగా జరుప బడును. ఈ సందర్భంగా ఎడ్ల పొటీలు, ముగ్గుల పొటీలు, క్రికెట్, పరుగు, రకరకాల పొటీలు జరుపుదురు. ఆ సాయంత్రాలు విద్యుత్ దీపాలతో అలంకరణలు, సంగీత విభావరి, నృత్యాలు వంటి కార్యక్రమాలు ఉండును.
శ్రీ ఉపదేశరామస్వామివారి ఆలయం[మార్చు]
ఈ ఆలయంలో 2017,ఏప్రిల్-8వతేదీ శనివారంనాడు, స్వామివారి రథోత్సవం, విద్యుత్తు కాంతులమధ్య, కన్నులపండువగా నిర్వహించారు. [2]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
గ్రామంలో వర్షాధార పంటలు అయిన ప్రత్తి, పొగాకు, కంది, శనగలు, మిరప వంటి పూర్తి వర్షాధార పంటలు పండును.
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
ఈ గ్రామంలో ప్రభుత్వ, ప్రైవేటు, మిలిటరీ, పోలీసు, వ్యవసాయదారులు, వ్యాపారులు, తాపీ మేస్త్రీలు గలరు.
గ్రామ విశేషాలు[మార్చు]
ఈ గ్రామంలో ఎక్కువగా కమ్మ, ముస్లిం, కొద్దిగా శెట్టి, బ్రాహ్మణ కులస్తులు నివసిస్తారు.
మూలాలు[మార్చు]
వెలుపలి లింకులు[మార్చు]
[2] ఈనాడు ప్రకాశం; 2017,ఏప్రిల్-9; 5వపేజీ.