వందే భారత్ ఎక్స్‌ప్రెస్
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ | |
---|---|
సారాంశం | |
రైలు వర్గం | హై-స్పీడ్ రైలు |
స్థితి | యాక్టివ్ |
స్థానికత | భారతదేశం |
దీనికి ముందు | శతాబ్ది ఎక్స్‌ప్రెస్ |
తొలి సేవ | 15 ఫిబ్రవరి 2019 |
ప్రస్తుతం నడిపేవారు | భారతీయ రైల్వేలు |
మార్గం | |
లైను (ఏ గేజు?) | 8 (7 Operational + 1 Proposed) |
సదుపాయాలు | |
శ్రేణులు | AC Chair (Economy Class) Executive Chair (Premium Class) |
కూర్చునేందుకు సదుపాయాలు |
|
ఆహార సదుపాయాలు | On-board catering |
చూడదగ్గ సదుపాయాలు | Large windows in all carriages |
వినోద సదుపాయాలు |
|
బ్యాగేజీ సదుపాయాలు | Overhead racks |
ఇతర సదుపాయాలు |
|
సాంకేతికత | |
రోలింగ్ స్టాక్ |
|
పట్టాల గేజ్ | Indian gauge 1,676 mm (5 ft 6 in) broad gauge |
వేగం |
|
రైలు పట్టాల యజమానులు | భారతీయ రైల్వేలు |
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అనేది సెమీ-హై-స్పీడ్, ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రైలు, దీన్ని భారతీయ రైల్వేలు నిర్వహిస్తుంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ని డిజైన్ చేసి తయారు చేసింది. భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా చొరవ కింద మొదటి రైలు ₹97 కోట్లతో 18 నెలల్లో తయారు చేయబడింది. ఈ అత్యాధునిక రైలును గతంలో ట్రైన్ 18 అని వ్యవహరించారు. ఆ తరువాత 2019 జనవరి 27న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తొలి రైలు 2019 ఫిబ్రవరి 15న ప్రారంభించబడింది. వందే భారత్ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు
[మార్చు]2023 జనవరి 15న సికింద్రాబాద్ - విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ 8వ వందే భారత్ రైలు ఆదివారం మినహా వారంలో మిగతా ఆరు రోజులు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా 699 కిలోమీటర్ల దూరం కేవలం 8.30 గంటల్లో విశాఖపట్నం చేరుకుంటుంది. తిరిగి 20 నిమిషాల విరామం తర్వాత సికింద్రాబాద్ బయలు దేరుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేర్చే వందే భారత్ రైలు టికెట్ బుకింగ్స్ ప్రారంభమవ్వగా 2023 జనవరి 16 నుంచి ప్రయాణీకులకు అందుబాటులోకి వచ్చింది.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో 14 ఏసీ ఛైర్ కార్ కోచ్‌లు, 2 ఎగ్జిక్యూటీవ్ ఏసీ చైర్ కార్ కోచ్‌లు ఉంటాయి. మొత్తం 1,128 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు.
కాగా తెలుగు రాష్ట్రాల మధ్య రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ స్టేషన్‌లో 2023 ఏప్రిల్ 8న ప్రారంభించారు.[1] ఈ రైలు సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2023 సెప్టెంబరు 24న తెలంగాణ-కర్ణాటకను కలిపే విధంగా కాచిగూడ-యశ్వంత్‌పూర్, ఆంధ్రప్రదేశ్-తమిళనాడు కలిపేలా విజయవాడ-చెన్నై మరో రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నారు.[2]
మహారాష్ట్ర పరిధిలో
[మార్చు]మహారాష్ట్రలో ముంబై నుంచి సోలాపూర్ మధ్య, ముంబై-సాయినగర్ షిర్డీ మధ్య వరుసగా 9వ, 10వ వందే భారత్ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2023 ఫిబ్రవరి 10న పచ్చజెండా ఊపి వాటిని ప్రారంభించారు.[3][4]
సేవలు
[మార్చు]No. | Originating station | Terminal station | Train Name | Version | Train No. | Frequency | Distance | Speed (km/h) | Inauguration | Major Halts Only | |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Maximum permitted | Average | ||||||||||
1 | న్యూఢిల్లీ | వారణాసి జంక్షన్ | న్యూఢిల్లీ - వారణాసి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ | VB1 | 22435/22436 | సోమవారం, గురువారం మినహా | 759 కి.మీ. (472 మై.) | 130 km/h (81 mph)[5] | 95 km/h (59 mph)[6] | 2019 ఫిబ్రవరి 15 | కాన్పూర్ సెంట్రల్, ప్రయాగ్‌రాజ్ జంక్షన్ |
2 | న్యూఢిల్లీ | శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా | న్యూఢిల్లీ - శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ | VB1 | 22439/22440 | మంగళవారం మినహా | 655 కి.మీ. (407 మై.) | 130 km/h (81 mph)[5] | 82 km/h (51 mph)[6] | 2019 అక్టోబరు 3 | లూథియానా జంక్షన్, జమ్ము తావి |
3 | ముంబై సెంట్రల్ | గాంధీనగర్ క్యాపిటల్ | ముంబై సెంట్రల్ - గాంధీనగర్ క్యాపిటల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ | VB2[7] | 20901/20902 | ఆదివారం మినహా | 522 కి.మీ. (324 మై.) | 130 km/h (81 mph)[5] | 85 km/h (53 mph)[8] | 2022 సెప్టెంబరు 30 | వాపి, సూరత్, వడోదర జంక్షన్, అహ్మదాబాద్ జంక్షన్ |
4 | న్యూఢిల్లీ | అంబ అందౌరా | న్యూఢిల్లీ - అంబ అందౌర వందే భారత్ ఎక్స్‌ప్రెస్ | VB2 | 22448/22447 | శుక్రవారం మినహా | 412 కి.మీ. (256 మై.) | 130 km/h (81 mph)[5] | 79 km/h (49 mph)[6] | 2022 అక్టోబరు 13 | చండీగఢ్ జంక్షన్ |
5 | పురట్చి తలైవర్ డాక్టర్ ఎం.జి. రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ | మైసూరు జంక్షన్ | ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - మైసూరు జంక్షన్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ | VB2 | 20607/20608 | బుధవారం మినహా | 496 కి.మీ. (308 మై.) | 110 km/h (68 mph)[9] | 76 km/h (47 mph)[6] | 2022 నవంబరు 11 | కాట్పాడి జంక్షన్, కేఎస్ఆర్ బెంగళూరు |
6 | బిలాస్పూర్ జంక్షన్ | నాగ్‌పూర్ జంక్షన్ | బిలాస్‌పూర్ - నాగ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ | VB2 | 20825/20826 | శనివారం మినహా | 412 కి.మీ. (256 మై.) | 130 km/h (81 mph) | 75 km/h (47 mph) | 2022 డిసెంబరు 11[10] | రాయ్‌పూర్ జంక్షన్, దుర్గ్ జంక్షన్, రాజ్‌నంద్‌గావ్, గోండియా జంక్షన్[11] |
7 | హౌరా జంక్షన్ | న్యూ జల్పైగురి జంక్షన్ | హౌరా - న్యూ జల్పైగురి జంక్షన్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ | VB2 | 22301/22302 | బుధవారం మినహా | 561 కి.మీ. (349 మై.) | 130 km/h (81 mph) | 75 km/h (47 mph) | 2022 డిసెంబరు 30 | బోల్పూర్ శాంతినికేతన్, మాల్దా టౌన్, బర్సోయ్ జంక్షన్ |
8 | సికింద్రాబాద్ జంక్షన్ | విశాఖపట్నం జంక్షన్ | సికింద్రాబాద్ - విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ | VB2 | 20833/20834 | ఆదివారం మినహా | 699 కి.మీ.
(435 మై.) |
160 km/hr | 82 km/hr | 2023 జనవరి 19 [12][13][14] | వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం జంక్షన్[15] |
9 | ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ | షోలాపూర్ | ముంబై CSMT - షోలాపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ | VB2 | 22225/22226 | బుధవారం తప్ప/
గురువారం తప్ప |
452 కిమీ (281 మై) | 110 km/h (68 mph) | 70 km/h (43 mph) | 2023 ఫిబ్రవరి 10 | దాదర్ సెంట్రల్, కళ్యాణ్ జం, పూణే జం, కుర్దువాడి జం |
10 | ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ | సాయినగర్ షిర్డీ | ముంబై CSMT - సాయినగర్ షిర్డీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ | VB2 | 22223/22224 | మంగళవారం తప్ప | 339 కిమీ (211 మై) | 110 km/h (68 mph) | 64 km/h (40 mph) | 2023 ఫిబ్రవరి 10 | దాదర్ సెంట్రల్, థానే, నాసిక్ రోడ్ |
11 | రాణి కమలాపతి | హజ్రత్ నిజాముద్దీన్ | రాణి కమలాపతి (హబీబ్‌గంజ్) - హజ్రత్ నిజాముద్దీన్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ | 20171/20172 | శనివారం తప్ప | 702 కి.మీ. (436 మై.) | 07h 30m [16] | 160 km/h (99 mph)[17] | 2023 ఏప్రిల్ 1[18] | ఆగ్రా కాంట్, గ్వాలియర్ జం, ఝాన్సీ జం | |
12 | సికింద్రాబాద్ జంక్షన్ | తిరుపతి | సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ | 20701/20702 | మంగళవారం తప్ప | 661 కి.మీ. (411 మై.) | 08h 00m | 130 km/h (81 mph) | 2023 ఏప్రిల్ 8 [19] | నల్గొండ, గుంటూరు జం., ఒంగోలు, నెల్లూరు | |
13 | ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ | కోయంబత్తూర్ జంక్షన్ | ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - కోయంబత్తూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ | 20643/20644 | బుధవారం తప్ప | 495 కి.మీ. (308 మై.) | 05h 50m[20] | 130 km/h (81 mph) | 2023 ఏప్రిల్ 8 | సేలం జం., ఈరోడ్ జం., తిరుప్పూర్ |
చిత్రమాలిక
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "PM Modi: సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభించిన మోదీ | pm modi inaugurates secunderabad tirupati vande bharat express". web.archive.org. 2023-04-09. Archived from the original on 2023-04-09. Retrieved 2023-04-09.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Vande Bharat Train: ఒకేసారి 9 వందే భారత్ ట్రైన్స్.. ముహూర్తం ఖరారు.. తెలుగు రాష్ట్రాల్లో రూట్లు ఇవే! - indian railways will inaugurate 9 new vande bharat trains on september 24 - Samayam Telugu". web.archive.org. 2023-09-22. Archived from the original on 2023-09-22. Retrieved 2023-09-22.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Vande Bharat Express: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఒకే రోజు రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం | Vande Bharat Express: PM Modi to launch Mumbai Solapur, Mumbai Shirdi trains today | TV9 Telugu". web.archive.org. 2023-02-10. Archived from the original on 2023-02-10. Retrieved 2023-02-10.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Vande Bharat Express: డబుల్ ధమాకా.. ఒకేసారి పట్టాలెక్కిన రెండు వందే భారత్ రైళ్లు". web.archive.org. 2023-02-12. Archived from the original on 2023-02-12. Retrieved 2023-02-12.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ 5.0 5.1 5.2 5.3 "Vande Bharat train reaches 16 minutes early; activists bat for more speed". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 5 December 2022.
- ↑ 6.0 6.1 6.2 6.3 "Vande Bharat Express: From fastest to slowest semi-high speed trains in India - Full List HERE". Zee News (in ఇంగ్లీష్). Retrieved 2022-12-05.
- ↑ "Vande Bharat Express 2.0: PM flags off new train between Gandhinagar and Mumbai, here's all to know". Business Today (in ఇంగ్లీష్). 30 September 2022. Retrieved 5 December 2022.
- ↑ "PM to flag off Vande Bharat 2 from Gandhinagar to Mumbai on Sept 30". Indian Express. Retrieved 13 September 2022.
- ↑ Bureau, The Hindu (12 November 2022). "Speed of Vande Bharat will be increased, say railway officials". The Hindu (in Indian English). Retrieved 5 December 2022.
- ↑ "6th Vande Bharat train to be inaugurated on December 11". Hindustan Times (in ఇంగ్లీష్). 4 December 2022. Retrieved 5 December 2022.
- ↑ Bilaspur Airport Awareness Campaign (BAAC) [@AirportBilaspur] (9 December 2022). "Bilaspur to Nagpur #vandeybharat New schedule #Chhattisgarh Starting from 12th December @Sahilinfra2 11 dec. Only for VIP guests t.co/3Ves1NonsZ" (Tweet) (in ఇంగ్లీష్). Retrieved 15 December 2022 – via Twitter.
- ↑ "Secunderabad-Vijayawada Vande Bharat Express train launch: Ahead of flag-off by PM Modi, key things to know". TimesNow (in ఇంగ్లీష్). 2023-01-08. Retrieved 2023-01-08.
- ↑ "PM Modi may visit Hyderabad on Jan 19, to flag off Vande Bharat". The New Indian Express. Retrieved 2023-01-08.
- ↑ Bureau, The Hindu (2023-01-09). "PM to flag off Vande Bharat express train from Sec'bad to Visakhapatnam on Jan. 19". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-01-09.
- ↑ సికింద్రాబాద్-విశాఖ వందే భారత్ రైలు (9 జనవరి 2022). "Vande Bharat Express: సికింద్రాబాద్-విశాఖ మధ్య 'వందే భారత్' రైలు". Archived from the original on 2023-01-09. Retrieved 2023-01-09.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ https://india.postsen.com/local/358949.html
- ↑ Gautam, Prateek (2023-03-29). "The Vande Bharat Express will travel at a top speed of 160 km per hour on the route and will take you to your destination in 7 hours and 50 minutes". News24 Online (in ఇంగ్లీష్).
- ↑ Chauhan, Arvind (2023-03-21). "From April 1, Vande Bharat Express to connect Bhopal with Delhi via Agra". The Times of India (in ఇంగ్లీష్).
- ↑ "Tirupati-Secunderabad Vande Bharat Express train likely to hit tracks from April 8". The Times of India. 2023-03-25. ISSN 0971-8257. Retrieved 2023-03-26.
- ↑ "Chennai-Coimbatore Vande Bharat Express: Fare, timings, stoppages,". mint (in ఇంగ్లీష్). 2023-04-08. Retrieved 2023-04-08.
- ↑ செல்வகுமார் (2023-03-21). "சென்னை - கோவை இடையேயான வந்தே பாரத் ரயிலை தொடங்கி வைக்கிறார் பிரதமர் மோடி". tamil.abplive.com (in తమిళము). Retrieved 2023-03-21.