వర్గం:తెలంగాణ సంస్థానాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలంగాణా ‘దక్షిణ మహా ద్వారం’ గా పిలువ బడే రాజాపేట సంస్థానం మన రాష్ట్రం లో విశిష్టమైనది. ఈ సంస్థానం  ప్రసిద్ధి చెందిన సంస్థానాలలో ప్రముఖ మైనది. ఇది “యాదాద్రి -భువనగిరి”  జిల్లా లో పసిద్ద పుణ్య క్షేత్రమైన యాదగిరి గుట్ట కు కేవలం 20 కిలోమీటర్ల దూరం లో ఉన్నది. ఇక్కడ కాకతీయుల కాలం నాటి కోటలు ఇప్పటికీ మనం చూడవచ్చును. రాజాపేట యొక్క చారిత్రక కట్టడాలు శిధిలావస్థ లో ఉన్నప్పటికీ మనకు సజీవ సాక్ష్యాలు గా ఎన్నొ విశేషాలను కళ్ళకు కడుతున్నవి. ఈ కోటను 1775లో రాజా రాయన్న అనే రాజు నిర్మించడమేగాక గ్రామాన్ని కూడా ఏర్పాటు చేశారు. మొదట గ్రామం పేరు "రాజా రాయన్న పేట" గా పిలువబడి కాల క్రమేణా "రాజా పేట" గా మారింది.

రాజాపేట సంస్థానం అనేది నిజాం పరిపాలన కాలం నాటి హైదరాబాద్ సంస్థానం లో ఉండినటువంటి 14 సంస్థానాలలో ఒకటి. ఈ ప్రాంతానికి 250 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఇక్కడ చారిత్రక కట్టడాలయిన ఎన్నో భవంతులు, అద్దాల మేడలు, తోటలు, సైనికుల కవాతు ప్రదేశాలు, విశాల మైన రహదారులు ఇప్పటికీ చూడవచ్చు. కోట చుట్టూ 18 అడుగుల ఎత్తుతో శత్రు దుర్భేద్యమైన రాతి గోడను కట్టించారు. శత్రువుల దాడి నుండి తప్పించుకోవడానికి కోట లోపలి నుంచి రహస్య సొరంగ మార్గాలు తవ్వించారు. కోట లోపల అతి సుందర రాజ భవనాలు, రాణుల అంతఃపురాలు, మంత్రులు, సేనాపతుల ఆవాసాలతో పాటు, స్నానవాటికలు నిర్మించారు. శత్రుసైన్యం లోపలికి ప్రవేశించకుండా కోట గోడల ముందు 20 అడుగుల లోతైన పెద్ద కందకం తవ్వించి అందులో ఎల్లప్పుడూ నీరు ఉండటానికి వీలుగా ఎగువన పడమటి వైపు గోపాలచెర్వు నుంచి కందకంలోకి నీరు నిరంతరం పారించారు. అందులో వారు మొసళ్ళను పెంచేవారు. విష సర్పాలను వదిలేవారు. కోట ముఖ ద్వారానికి 32 అడుగుల ఎత్తయిన ధృడమైన ద్వారాలను అమర్చారు. మొదటి ముఖ ద్వారం నుంచి మూడో ముఖ ద్వారం వరకు విశాలమైన సుదీర్ఘమైన రాచమార్గం ఉంది. రెండున్నర శతాబ్ధాల క్రితం నిర్మించిన రాజు నివాసం, అంతఃపురం, అద్దాల మేడ, అతిథి గృహాలు, స్నానవాటికలు, గిరిగిరిమాల్‌, ఎత్తైన బురుజులు, కారాగారం, మంచినీటి కొలను, నాటి సైనికుల శిక్షణ స్థలం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అడుగడుగునా సైనికుల పహారా నిరంతరం కొనసాగడానికి వీలుగా నిర్మించిన కట్టడాలు మనల్ని అబ్బురపరుస్తాయి.

యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రం సమీపంలో గల ఈ రాజాపేట గడీ కోటను తెలంగాణ హెరిటేజ్ పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయడం జరుగుతుందనీ తెలంగాణా ప్రభుత్వం గతంలో ప్రకటించడం చాల విశేషం.

For more details you visit:

https://rajapet.wordpress.com/

Or

https://www.rajapeta.com/

ఉపవర్గాలు

ఈ వర్గం లోని మొత్తం 2 ఉపవర్గాల్లో కింది 2 ఉపవర్గాలు ఉన్నాయి.

వర్గం "తెలంగాణ సంస్థానాలు" లో వ్యాసాలు

ఈ వర్గం లోని మొత్తం 9 పేజీలలో కింది 9 పేజీలున్నాయి.