వర్గం చర్చ:కోస్తా
స్వరూపం
కోస్తా జిల్లాల ఉపవర్గాలు
[మార్చు] సహాయం అందించబడింది
కోస్తా జిల్లాలని, మరియు ఉత్తరాంధ్ర, కోనసీమ మరియు పల్నాడు ప్రాంతాలని ఈ వర్గం క్రింద చేర్చాను. అయితే గోదావరి జిల్లాలు అనే ప్రాంతం కూడా ఉన్నదా? ఉంటే తూ.గో, ప.గో లని మాత్రమే గోదావరి జిల్లాలు అంటారా? కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా లకి కలిపి ఇలాంటి పేరు (కృష్టా జిల్లాలు?) ఏదయినా ఉన్నదా? దక్షిణ కోస్తా అనగా కేవలం ప్రకాశం, నెల్లూరు లేనా? దీనిపై తగు సమాచారమివ్వగలరు. ఈ సమాచారాన్ని బట్టి ఉన్న వ్యాసాల విస్తరణ, లేదా నూతన వ్యాసాల సృష్టి చేయవచ్చును. ఇది ఆంధ్ర ప్రదేశ్ ప్రాజెక్టు మరియు సంబంధిత ప్రాజెక్టులకి ఉపయోగపడుతుంది కూడా. - శశి (చర్చ) 06:40, 15 మార్చి 2014 (UTC)
- శశి గారికి, ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన రాజకీయ ప్రాంతాల పేర్లని మాత్రమే వికీపీడియాలో వాడడం మంచిది. ఇటీవల వరకు ఆంధ్రప్రదేశ్ మూడు ప్రాంతాల మిళితంగానే వాడబడుతున్నది. ఇటీవల రాయలసీమ తోపాటు ఉత్తరాంధ్రకు పన్నుల మినహాయింపు స్థితి కల్పించడానికి మాత్రమే వాడబడింది. మిగతా కోస్తాని పేర్కొనాలంటే దక్షిణకోస్తాగా వాడవచ్చు.అన్నట్లు సందేహం చేర్చేటప్పుడు శీర్షిక చేర్చడం మంచిది--అర్జున (చర్చ) 06:08, 16 మార్చి 2014 (UTC)
- అలా వాడుకలో ఉంటేనే వర్గీకరించాలి. కేవలం వికీపీడియాలో వర్గీకరణ కోసం వ్యవహారంలో లేని ప్రాంతాలను, వర్గీకరణలను సృష్టించకూడదు. ఇది వికీపీడియాలో కొత్త పదాలు సృష్టించకూడదు లాంటిదే. దీనికి మూలసూత్రం ప్రాథమిక పరిశోధన కూడదు అన్న నియమమే. --వైజాసత్య (చర్చ) 06:35, 16 మార్చి 2014 (UTC)