వర్గం చర్చ:మానవ సంబంధాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మానవ సంబంధాలు వర్గంలో ఈ పదాలు చేర్చండి. ఇనుతాత = తాత తండ్రి (4వ తరం) అనుతాత = తాత తాత (5వ తరం) ఇను మనుమడు (మనవడు) = 4వ తరంలోని కొడుకు. అను మనుమడు (మనవడు) = 5వ తరంలోని కొడుకు. ఇను మనుమరాలు (మనవరాలు) = 4వ తరంలోని కూతురు. అను మనుమరాలు (మనవరాలు) = 5వ తరంలోని కూతురు.

(ఇను తాత = 4వ తరమా, అనుతాత = 4వ తరమా అన్నది ఒక సందేహం) (అను తాత = 5వ తరమా, ఇనుతాత = 5వ తరమా అన్నిది ఒక సందేహం)

బాణాసురుడు సినిమాలో ఈ పదాన్ని వాడారు. ఆ సినిమా చూసినప్పుడు, ఈ సందేహం తీరి పోతుంది. ఆ సినిమాలో, బాణాసురుడు, ప్రహ్లాదునికి ఇనుమనుమడు లేదా అనుమనుమడు అన్న చర్చ వస్తుంది.

ఇనుతాత భార్యని (4వ తరం), అనుతాత భార్యని (5వ తరం), ఏమని పిలుస్తారో తెలిసిన పెద్దల దగ్గర తెలుసుకోవాలి. ఇను మామ్మ (4వ తరం), అను మామ్మ (5వ తరం) అంటారని పెద్దలు చెప్పగా విన్నాను. భారతీయులలో ఉన్నన్ని మానవ సంబధాలు, పాశ్చాత్యులలో లేవు. వారికి వియ్యంకుడు అన్న పదం వివరించి చెప్పటానికి ఇంగ్లీషు పదంలేదని ఈనాడు పత్రికలో ఒక చిన్న వ్యాసం ప్రచురించారు (బహుశా 1-2 సంవత్సరాల క్రితం).

వియ్యంకుడు = వియ్యం పొందిన వాడు వియ్యంకుడు. (విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో, వియ్యంకుడిని 'వీరకాడు' అని, వియ్యపురాలు (వియ్యంకుడు భార్య) ని 'వీరకత్తె' అని పిలుస్తారు. వధూ వరుల తలిదండ్రులు ఒకరికి ఒకరు వియ్యంకుడు, వియ్యపురాలు అవుతారు. వియ్యంకులు ఇద్దరూ బావా (బాగా దగ్గరి వారైతే) అని, బావ గారు అని పిలుచుకుంటారు. వియ్యపురాళ్ళు ఇద్దరూ వదిన అని (బాగా దగ్గరి వారైతే), వదిన గారూ అని పిలుచు కుంటారు.

ఒకే కుటుంబలోని అక్క చెల్లెళ్లను పెళ్ళి చేసుకున్నవారు, వరుసకు అన్నదమ్ములు అవుతారు. వరుసకు పెద్ద వారినిక అన్న గారు, అని , చిన్నవారిని తమ్ముడు గారు అని పిలుచు కుంటారు. ( బంధుత్వాలు చెప్పేటప్పుడు, తోడల్లుడు అని చెబుతారు. విశాఖపట్నం జిల్లాలో తోడల్లుడు ని జగిలీడు అంటారు.

ఒకే కుటుంబలోని అన్న దమ్ములను పెళ్ళి చేసుకున్నవారు, వరుసకు అక్కాచెల్లెళ్ళు అవుతారు. వరుసకు పెద్ద వారినిక అక్క (ఇక్కడ మర్యాద వాచకం 'గారు ' ఉండదు), అని , చిన్నవారిని చెల్లి లేదా చెల్లాయి అని పిలుచు కుంటారు. ( బంధుత్వాలు చెప్పేటప్పుడు, తోడి కోడలు అని చెబుతారు. తోడికోడళ్ళు సినిమాలో మానవ సంబందాలు చూపించారు.

మేనత్త : తండ్రి అక్క లేదా చెల్లెల్లిని మేనత్త అని పిలుస్తారు. మేనత్త భర్త మావయ్య అవుతాడు. మేన మామ కాడు.

మేనమామ: తల్లి అన్నయ్య లేదా తమ్ముడు మేనమామ అని పిలుస్తారు. మేనమామ భార్య (అత్త) అవుతుంది మేనత్త కాదు.

ఇక్కడ మేన పదం మేను (శరీరం) అనే అర్ధం. మేనమామ, మేనత్త లు తమ రక్తం పంచుకుపుట్టిన వారు అని, తమ మేనులో (శరీరంలో) భాగమని భావిస్తారు.Talapagala VB Raju 14:07, 27 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]