వాడుకరి:Pavan santhosh.s/మొదటి ఆంగ్లో-సిక్ఖు యుద్ధం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
First Anglo-Sikh War

Topographical map of The Punjab The Land of 5 Waters
తేదీ11 December 1845 – 9 March 1846
ప్రదేశంPunjab
ఫలితంBritish victory
ప్రత్యర్థులు
British East India Company
Patiala State[1][2]
Jind State[3]
Sikh Empire

మొదటి ఆంగ్లో-సిక్ఖు యుద్ధం సిక్ఖు సామ్రాజ్యం, ఈస్టిండియా కంపెనీల మధ్య 1845 నుంచి 1846 మధ్యకాలంలో జరిగిన యుద్ధం. బ్రిటీష్ పక్షం విజయం సాధించడంతో పాక్షికంగా సిక్ఖు సామ్రాజ్యం బ్రిటీష్ వారికి లొంగిపోయింది.

నేపథ్యం[మార్చు]

19వ శతాబ్దపు తొలి నాళ్లలో భారత ఉపఖండపు వాయువ్యభాగంలో మహారాజా రంజిత్ సింగ్ సిక్ఖు సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ, స్థిరపరుస్తూ ఉన్నకాలానికల్లా తూర్పు భారతం (ప్లాసీ, బక్సర్ యుద్ధాలు), దక్షిణ భారతం (ఆంగ్లో-మైసూరు యుద్ధాలు), మధ్యభారతం (ఆంగ్లో-మరాఠా యుద్ధాలు)పై ఆధిపత్యాన్ని సాధించి పంజాబ్ సరిహద్దుల దాకా తమ పాలనను విస్తరించారు. రంజిత్ సింగ్ జాగ్రత్తతో కూడిన స్నేహాన్ని ఈస్టిండియా కంపెనీతో పాటించాడు. సట్లెజ్ నదికి దక్షిణాన ఉన్న కొన్ని ప్రాంతాలను బ్రిటీష్ వారికి ఇచ్చివేస్తూనే,[4] బ్రిటీష్ వారి దురాక్రమణ ధోరణిని అడ్డుకునేందుకు, ఆఫ్ఘాన్లపై యుద్ధం ప్రారంభించేందుకు కూడా ఉపయోగపడేలా సైనిక శక్తిని నిర్మించడం ప్రారంభించాడు. అమెరికన్, యూరోపియన్ సైనికులను జీతాలకు పెట్టుకుని తమ సైన్యాన్ని ఫిరంగుల వాడకానికి శిక్షణ ఇప్పించుకునేవాడు, అంతేకాక హిందువులు, ముస్లిములను  సైన్యభాగాల్లో చేర్చుకున్నాడు.

ఆఫ్ఘాన్లలోని అనైక్యతను ఆధారంగా చేసుకుని సిక్ఖులు పెషావర్, ముల్తాన్ ప్రావిన్సులు, పలు ఆఫ్ఘాన్ నగరాలను గెలిచి తమ పాలనలోని జమ్ము మరియు కాశ్మీర్ రాజ్యాల్లో విలీనం చేశారు. ఆఫ్ఘనిస్తాన్లో రాజ్యవ్యవస్థ పున:స్థాపన జరగగానే, బ్రిటీష్ వారు ఆఫ్ఘాన్ రాజు ఎమిర్ దోస్త్ మొహమ్మద్ ఖాన్రష్యా సామ్రాజ్యంతో కుమ్మక్కై తమకు వ్యతిరేకంగా కుట్రచేస్తున్నాడన్న ఆలోచనతో ఉక్కిరిబిక్కిరై, అతన్ని తొలగించి షుజా షా దురానీని పాలకుణ్ణి చేసేందుకు మొదటి ఆంగ్లో-ఆఫ్ఘాన్ యుద్ధం  ప్రారంభించారు. మొదట్లో బ్రిటీష్ ఆక్రమణ విజయవంతమైనట్టు కనిపించినా, ఎల్ఫిన్ స్టోన్ సైన్యం ఊచకోతతో దారుణమైన మలుపు తీసుకోవడంతో ఆఫ్ఘనిస్తాన్ నుంచి 1842లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పెషావర్ నుంచి వెనుదిరిగారు. బ్రిటీష్ సైన్యం, మరీముఖ్యంగా బెంగాల్ సైన్యం ప్రతిష్ట ణంగా అడుగంటింది.

పంజాబ్ ఘటనలు[మార్చు]

సిక్ఖు ట్రోఫీ తుపాకులు

1839లో రంజిత్ సింగ్ మరణించాడు, వెనువెంటనే అతని సామ్రాజ్యం అవ్యవస్థితంగా తయారైంది. రంజిత్ సింగ్ కుమారుడు, అప్రఖ్యాతుడు అయిన ఖరక్ సింగ్ కొద్ది నెలల్లోనే పదవీ చ్యుతుడయ్యాడు, తర్వాత జైలులో అనుమానాస్పదంగా మరణించాడు. అతినికి విషం ఇచ్చి చంపారని అందరూ నమ్మారు.[5] అతనికి విరుద్ధంగగా వ్యవహరించిన, సమర్థుడైన అతని కుమారుడు కున్వర్ నౌ నిహాల్ సింగ్ సింహాసనం ఎక్కాడు. కానీ తన తండ్రి అంత్యక్రియల నుంచి వెనుదిరిగి వస్తూండగా అనుమానాస్పద పరిస్థితుల్లో లాహోరు కోట కమాను ద్వారం నుంచి పడిపోయి గాయాలతో మరణించాడు.[6]

సిక్ఖు సింధన్ వాలియాలు, హిందూ డోగ్రాలు ఆ సమయంలో పంజాబ్ లో అధికారాన్ని స్వంతం చేసుకోవడానికి పోరాడుతూ ఉన్నారు. 1841 జనవరిలో రంజిత్ సింగ్ అక్రమ సంతానమైన పెద్ద కొడుకు షేర్ సింగ్ కి రాజ్యం ఇవ్వడంలో విజయం సాధించారు. అత్యంత ప్రాబల్యమైన సింధన్వాలియా వర్గం బ్రిటీష్ భూభాగంలో రక్షణ కోసం పారిపోయింది, కానీ వీరికి అనుకూలురైనవారు చాలామంది పంజాబ్ సైన్యంలో ఉండేవారు.

రంజిత్ రాజ్ మరణానంతరం, భూస్వాములు సాయుధీకరింపబడుతూ, సైన్యాన్ని పోగుచేస్తూండడంతో 29 వేల (192 తుపాకులతో) నుంచి 80 వేలకు పెరిగిపోయింది.[7] తాము కూడా సిక్ఖు దేశంలోనే భాగమని పేర్కొంటూ వచ్చారు. వాటి స్థానిక పంచాయితీలు రాజ్యంలో సమాంతర అధికార కేంద్రాలుగా ఏర్పడి, గురు గోబింద్ సింగ్ ఆశయమైన సిక్ఖు సమిష్టి సంపద అన్నది ఏర్పడిందని చెప్తూ, సిక్ఖులు మొత్తం అన్ని సైనిక, పౌర, కార్యనిర్వాహక అధికారాలను రాజ్యంలో కైవసం చేసుకున్నారు.[8] దీన్ని బ్రిటీష్ వారు ప్రమాదకరమైన సైనిక ప్రజాస్వామ్యంగా అభివర్ణించారు. బ్రిటీష్ ప్రతినిధులు, పర్యాటకులు ఈ ప్రాదేశిక ప్రభుత్వాలు తమ ఏకజాతి అధికారాన్ని నిలబెట్టుకుంటూనే, కేంద్ర దర్బారుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాయని గమనించారు.

Death of Jawahar Singh, Vizier of Lahore - Illustrated London News, 29 November 1845

References[మార్చు]

  1. http://www.royalark.net/India/patiala3.htm
  2. http://indiatoday.intoday.in/story/punjab-polls-six-clans-dominate-the-political-and-social-landscape/1/168682.html
  3. https://books.google.com/books?id=vOPb4SnrsWAC&pg=PA169
  4. Allen, Charles (2001). Soldier Sahibs. Abacus. p. 28. ISBN 0-349-11456-0.
  5. Hernon, p. 546
  6. Sardar Singh Bhatia. "NAU NIHAL SINGH KANVAR (1821-1840)". Punjabi University Patiala. Retrieved November 2015. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  7. Hernon, p. 547
  8. allaboutsikhs.com Archived 18 మార్చి 2009 at the Wayback Machine - dead link