Jump to content

వాడుకరి చర్చ:కాసుబాబు/పాతచర్చలు 2

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
Archive ఇది ఇంతకు ముందు జరిగిన చర్చలను భద్రపరిచిన పేజి. ఈ పేజిని మార్చ వద్దు. మీరు గనక కొత్త చర్చ మెదలు పెట్టాలనుకుంటే, లేదా పాత చర్చ కొనసాగించాలనుకుంటే, ప్రస్తుత చర్చా పేజిలో వ్రాయండి.

నేనొచ్చేశా

నేనొచ్చేశా!!!!! కాసు బాబు గారు.. --S172142230149 17:27, 30 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కాసుబాబు గారు నేను మాటలబాబు గా పేరు మార్చుకొంటున్నాను... మీరు ఈరోజు వికీపీడీయా లోకి రాలేదే.. మీగుర్చి నేను చాలా సేపు నిరీక్షీంచాను, నాకు తెవికీ ఒక వ్యసనం లాగ తయారైంది. వదుల్చుకోలేక చస్తున్నాను.--మాటలబాబు 21:46, 2 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
స్వాగతం ఏలా ఉన్నారు.ప్రయాణం ఎలా జరిగింది. తెవికీ లోకి ఆడియౌ వచ్చిందడోయ్..--మాటలబాబు 18:09, 7 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
కాసు బాబు గారు ఏలా ఉన్నారు. మీరు నిన్న మెన్న తెవికీ లొ కనిపించలేదే..నాకు ఈరోజు ఊపిరి సలపని పని, బుర్ర పూర్తిగా వేడేక్కిపోయింది. మీరు కూడా పని వత్తిడి లో ఉన్నారా.. నాకు నిన్న అసలు సమయం లేదు, తెవికీ లొకి రావడానికి, సరే మరలా కలుద్దాం. మీచర్చాపేజి పూర్తిగా నిండిపోయింది, ఈ పేజిని నిక్షేపం చేయండి, రాసేవారికి అనువుగా ఉంటుంది, నాచర్చాపేజిని నిక్షేపం చేసి మీరు వ్రాసిన వ్యాఖ్యను మాత్రం ఉంచుకొన్నాను, నాకు వైజా సత్యా గారు సహాయం చేశారు.--మాటలబాబు 16:15, 11 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
కాసు బాబు గారు కుంభకర్ణుడు వ్యాసం లో కొన్ని మార్పులు చేశాను.ఒకసారి పరిశీలించండి, మీరు ఏమి అనుకొరు అని అనుకొంటున్నాను--మాటలబాబు 20:59, 22 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నక్షత్రం

కాసుబాబు గారు మీరు రొజుకోక్కసారి తళ్ళుక్కు మని నక్షత్రంలా మెరిసి మాయమైపోతున్నారే.. పని వత్తిడి ఎక్కువగా ఉందా...--మాటలబాబు 22:28, 14 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కాసు బాబు గారు ఎలా ఉన్నారు?--మాటలబాబు 20:11, 15 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు వ్రాసింది సరిగానే ఉంది కాని దానికి మెరుగు దిద్దవలసిన పని ఉంది. అందువల్ల దానిని ప్రస్తుతానికి ఉంచి వ్యాసం పుర్తయ్యక మార్చేస్తాను. మీరు రామాయణం తొ తెవికీ అరంగెట్రం చెయడం వల్లె మీ తెవికీ యాత్ర నిర్విఘ్నం గా సాగుతోంది.రామాయణం శుభసూచకం కదా మరి. నేనేమౌ రాక్షస ప్రవృత్తి తొ రాక్షాస వ్యాసాలు వ్రాశాను ఇప్పుడేమౌ కోపాగ్ని పూరిత ఋషుల వ్యాసాలు వ్రాస్తున్నను. దేవుడు నామీద దయ ఉంచి అంతా మంచి జరగేట్లు చూడాలని కోరుకొంటున్నాను. నక్షత్రం ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలేదు. --మాటలబాబు 20:57, 16 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కాపీహక్కులు

కాసుబాబు గారు,

ఆంగ్ల వికీపీడియాలో కాపీహక్కుల గురించి ఇక్కడ ఇచ్చారు భారతదేశ కాపీహక్కుల చట్టం గురించి ఇక్కడ ఇచ్చారు. మనం కూడా తెలుగు వికీపీడియా కొరకు ఒక నియమావళి తయారు చేసుకోవచ్చు. ఆ నియమావళి ద్వారా వికీపీడియాలో ఉన్న బొమ్మలను/ఫైళ్ళను ఎటువంటి అడ్డంకులు లేకుండా, ఎక్కడయినా, ఏరకంగానయినా ఉపయోగపడేటట్లు చూసుకోవాలి. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 20:35, 20 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం

కాసుబాబు గారు మిమ్మల్ని చూసి చాలా రోజులయ్యింది, మిమ్మల్ని చూసి చాలా సంతోషం కలిగింది. మీరు లేని ఈ 10-12 రోజులలొ తెవికి లొ చాలా కొత్త వ్యాసాలు వచ్చాయి. ఉదాహరణకు

  1. విద్యారణ్యుడు,
  2. పార్థసారథి దేవాలయం,
  3. ఋష్యశృంగుడు
  4. కిగ్గా
  5. శృంగేరి
  6. విజయనగరం,
  7. ఆగుంబె,
  8. జోగ్ జలపాతం,
  9. మడికేరి ఇవి ఉదాహరణ మాత్రమే ఇవి కాకుందా ఇంకా ఎన్ని ఉన్నాయో
వైజాసత్యా గారు వ్రాసిన
  1. వర్షం,
ప్రదీప్ గారు అకుంఠిత దీక్ష తో గణాంకాలు తెలుసుకోవడానికి చేస్తున్న బాటులు,

ఒకటని ఏమి చెప్పమంటారు చాలా ఉన్నాయి. --మాటలబాబు 17:49, 8 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సుందరకాండ

మాటల బాబూ!

  • సుందరకాండ వ్యాసం నువ్వు ఇంతకు ముందు చాలావరకు వ్రాసావని గుర్తు. వ్యాసం చరిత్రలో కూడా వివరాలున్నాయి. కాని ఇప్పుడు వ్యాసం చాలా భాగం తగ్గింది? ఎవరైనా తొలగించారా? లేక నీవే తిరగరాస్తున్నావా?
  • సుందరకాండ అయోమయనివృత్తిలో కొన్ని మెలికలు ఉన్నాయనిపిస్తుంది. సరిచేస్తాను.

--కాసుబాబు 08:44, 9 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కాసుబాబు గారు సుందరకాండ లొ సాగర లంఘనం మాత్రమే వ్రాయడం ప్రారంభించాను తరువాత, వ్రాసిన దానికి కూడా చాల శుద్ధి అవసరం అందుచేత మరియు, సుందరకాండ మెత్తం ఒకే పేజి వ్రాస్తే చాలా పెద్ద వ్యాసం అవుతుందని నిర్ణయించి, ఆ వ్యాసాన్ని అక్కడే విడిచి పెట్టాను. మీరు రచ్చబండ లొ వ్రాసిన విషయాన్ని చదివాను, మీరు చెప్పింది యదార్థం, సుందరకాండ మెదటి మరియు చివరి శ్లోకాలా (2 శ్లోకాల మీద)మీద వ్యాఖ్యానాలతో పరిశోధకులు పెద్ద పుస్తకాలు వ్రాశారు.కాని మీరు ఇచ్చిన సందేశాన్ని చూసి మళ్ళి ప్రారంభించాలి అనే కుతూహలం బయలు దేరింది. --మాటలబాబు 17:02, 9 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

రచనా శైలి

కాసుబాబు గారూ, మీకు వెసలుబాటు దొరికినప్పుడు వికీపీడియా చర్చ:శైలి పేజీని చూసి మీ అభిప్రాయం తెలుపగలరు --వైజాసత్య 04:06, 12 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

జాబితాలు

వర్గాలు అన్నీ స్వతహాగానే ఒక మాదిరి జాబితాలు వాటిని ప్రత్యేకించి జాబితాల వర్గంలో చేర్చాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఉదాహరణకు వర్గం:ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు కంటే ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు వ్యాసం జాబితా వర్గంలో చేర్చటానికి తగిన వ్యాసం అని నా అభిప్రాయం. --వైజాసత్య 05:57, 25 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నాకూ ఇప్పుడు అలానే అనిపించింది. మారుస్తాను. --కాసుబాబు 06:00, 25 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కాసుబాబు ఎలా ఉన్నారు.?? బాగున్నారా!!--మాటలబాబు 11:13, 27 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మూసలు, వ్యాసాల పేర్లు గురించి

ఈ విషయమై చర్చను వికీపీడియా చర్చ:శైలి ఇక్కడికి మార్చాను. గమనించవలసినది. --కాసుబాబు 18:15, 7 ఆగష్టు 2007 (UTC)

తెలుగు వికిఖోటు

కాసుబాబుగారు, మెటావికీలో మీరు కోరినట్లుగా ఇంకో 6 వారాల పాటు సమయం ఇచ్చారు. అలాగే మిమ్మల్ని తెలుగు వికీఖోటులో, అప్పుడప్పుడూ వచ్చే స్పాము సందేశాలను తొలగించటానికి మిమ్మల్ని నిర్వాహకుడిగా అవ్వమని అడుగుతున్నారు. __మాకినేని ప్రదీపు (+/-మా) 06:19, 9 ఆగష్టు 2007 (UTC)

పరిశీలన

కొరింగ వ్యాసం చర్చా పేజిని చూసి , మీ అభిప్రాయం తెలుపండి. మీరు పశ్చిమ గోదావరి జిల్లా వారు కదా... ఈ పేరు తెలిసి ఉండాలి..--మాటలబాబు 04:50, 20 ఆగష్టు 2007 (UTC)

నాకు అస్సలు తెలియదు! - --కాసుబాబు 04:57, 20 ఆగష్టు 2007 (UTC)
చిన్న చిన్న పనులు నాకు చెప్పండి. మీరు రచన చేస్తున్నప్పుడూ నేను కెలికితే, దిద్దుబాటు ఘర్షణ వస్తుందని నేనుకెలకడం లేదు.--మాటలబాబు 19:02, 20 ఆగష్టు 2007 (UTC)
అలాగే. పనులకేమీ? చాలా ఉన్నాయి. నువ్వు కూడా ఫుల్ బిజీ అని నాకు తెలుస్తూనే ఉంది. బాబూ! ప్రస్తుతం మీ టైము ఎంతయ్యింది? ఇక్కడ రాత్రి 11:00. --కాసుబాబు 19:07, 20 ఆగష్టు 2007 (UTC)
ఇప్పుడు మీకో టపా పంపుతాను , అభిరుచులలొ మీ మైయిల్ ఉంది కదా. మా సమయానికి మీ సమయం 3 గంటలు ముందు ఉంటుంది.--మాటలబాబు 19:12, 20 ఆగష్టు 2007 (UTC)

బాటు

మాటలబాబు, బాగా గుర్తుచేశాడు. ఒకే పద్ధతిన రిప్లేస్ చేసే పనులేమైనా ఉంటే నాకు ఇస్తే వాటిపై బాటునడిపి మార్పులు చెయ్యగలను --వైజాసత్య 19:15, 20 ఆగష్టు 2007 (UTC)

ఓ, ఒక ఆలోచన వచ్చింది..ఇప్పుడు మీరు తెస్తున్న మూసలన్నీ కాపీ చేసి పెట్టనా? --వైజాసత్య 19:17, 20 ఆగష్టు 2007 (UTC)


సరిగ్గా నేను అడిగేదే అది. సరే. జాబితాల అనువాదాలు యాంత్రికంగా సాధ్యమైనవన్నీ నేను చేశాను. దీనికి "WordPipe" అనే ప్రోగ్రామ్ trial version నాకు చాలా ఉపయోగపడింది. ఇక ఒకో జాబితాలో మిగిలిన అనువాదాలు నేను చేసుకోవడమే మెరుగు. నాకు వ్యాసాలపై ఇప్పటికే అవగాహన ఉన్నది గనుక. మీకు బాటు ద్వారా వీలయితే కొన్ని మూసలు ఆంగ్లం లోంచి తెలుగులోకి కాపీ చేయగలరా? అంటే {{DEN}} మూసను తెలుగులో కూడా {{DEN}} గానే కాపీ చేయాలన్నమాట. --కాసుబాబు 19:24, 20 ఆగష్టు 2007 (UTC)
కాపీ మొదలయ్యింది చూడండి --వైజాసత్య 19:46, 20 ఆగష్టు 2007 (UTC)
అన్ని మూసలూ కాపీ చెయ్యటం అయ్యింది --వైజాసత్య 22:05, 20 ఆగష్టు 2007 (UTC)

నర్తనశాల

నర్తనశాల పేజి లొ ఇంటర్ననల్ లింకులు ఇవ్వండి. నేణు కెలకడం లేదు. కెలికితే దిద్దుబాటు ఘర్షణ వస్తుందని--మాటలబాబు 06:45, 27 ఆగష్టు 2007 (UTC)

గ్రామాల వ్యాసాల గురించి

గ్రామాల వ్యాసాల గురించి మీరు నా చర్చాపేజీలో రాసిన దానికి.. గ్రామాల పేజీల్లో గ్రామం గురించి రాయడం, గ్రామ గణాంకాలు రాయడం, సమకాలికమైన వార్తలు, విశేషాలు రాయడం వంటివి చేస్తే ఆ పేజీలు మరింత అర్థవంతంగా ఉంటాయి. కానీ.. డబ్బిచ్చి సమాచారం రాయించడం ఎంతవరకు సబబు, ఎంతవరకు కుదురుతుంది అనే విషయాలపై నాకు సందేహాలున్నాయి. ఈ సందర్భంలో నా సూచనలు..

  • గ్రామాల పేజీలలోకి గణాంకాలను చేర్చే విషయమై ఇంతకు ముందో చర్చ వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు)#గ్రామాల పేజీల్లో సమాచార పెట్టెలు పేజీలో జరిగింది. ప్రదీపు, వైజాసత్య దాని విషయమై కొంత కృషి చేసినట్టున్నారు.
  • పోతే, సమకాలీన వార్తలు, విశేషాలను ఈ పేజీల్లో చేర్చడం.. అచ్చులో కనబడే ప్రతీ విషయమూ జాలంలో కనిపిస్తూనే ఉంది. మనమే ఒక ప్రాజెక్టును ఏర్పాటు చేసి, ఒక్కొక్కరు రోజుకు కనీసం పది పేజీల్లో వార్తలు చేర్చే అంశాన్ని పరిశీలించవచ్చు. సభ్యులందరం చర్చించి ఓ నిర్ణయం తీసుకుందాం. __చదువరి (చర్చరచనలు) 10:27, 9 సెప్టెంబర్ 2007 (UTC)
గ్రామాల వ్యాసాన్ని చదివాను.మరికొన్ని విషేషాలు ఎలా చేర్చాలో తెలిసింది. మీరుచెప్పిన మార్పులను అనుసరిస్తాను.తాంక్యూ.విశ్వనాధ్. 07:29, 10 సెప్టెంబర్ 2007 (UTC)
చదువరి చర్చా పేజీలలో గ్రామాల పేజీల గురించి మీరు ప్రతిపాదనపై నావి కొన్ని ఆలోచనలు.
వికీపీడియా బలమంతా తన సభ్యబృందమే..వ్యాసాలు మాత్రం కాదు అన్నది ఇక్కడ గ్రహించాలి. GFL లైసెన్సు ప్రతి సభ్యునికీ రెండు హక్కులు ఇస్తుంది. ఇక్కడి విధివిధానాలు నచ్చనప్పుడు 1)(Right to leave) నిష్క్రమించే హక్కు 2) (Right to fork) చీలిక తెచ్చే హక్కు. ఈ రెండవ హక్కును వినియోగించుకొని ఎవరైనా వికీపీడియాలో వ్యాసాలన్నీ ఎత్తుకుని వెళ్ళి సొంతకుంపటి ఏర్పాటు చేసుకోవచ్చు..దాని యాజమాన్యానికి తన సొంత నియమాలు పెట్టుకోవచ్చు మరియు వికీపీడియాను నడిపించే తంత్రసామాగ్రి (సాఫ్ట్వేరు) ఎలాగూ ఉచితం..కాబట్టి మనబలం మన బృందము మరియు సమైఖ్యతనే. జీతాలిచ్చి పనిలో పెట్టిన వారిలో ఈ సమైఖ్యతా భావం ఎంతవరకు తేగలమో తెలియదు.
వికీపీడియాలో అన్ని విషయాలకు పెరగటానికి సమయమిచ్చినట్టే ఈ గ్రామాల వ్యాసాలకీ సమయమివ్వండి. ఇక చిన్న వ్యాసాలు మనకు నామోషీగా ఉండటం గురించి నేను చెప్పేదేమంటే పోలిష్ వికీపీడియా దగ్గరి నుండి అన్ని భారతీయ వికీపీడియాలలోనూ ఇలాంటి చిన్న వ్యాసాలు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి..అయితే వాళ్ళు సంఖ్యను కాస్త తెలివిగా వంచించడానికి వాటిలో గణాంకాల గురించి ఒక బాటుతో ఉత్పత్తి చేయబడిన పేరాను చేర్చి ఆ చిన్న వ్యాసాలన్నింటినీ 2కేబీ దాటించమనిపించుకుంటున్నారు. ఈ విధంగానే తమిళ, బెంగాళీ తదితర వికీపీడియాల్లో 2కేబీ దాటిన వ్యాసాలు అంత ఎక్కువ శాతంలో ఉన్నాయి. తెవికీలో కూడా గణాంకాలతో పాటు గణాంకాల పేరా చేర్చటంతో మూడవ దశ పూర్తయ్యేసరికి 60% వ్యాసాలు 2కేబీలుపైబడి ఉంటాయి!! అయితే మన గొప్పతనం ఏంటంటే మనం మన గ్రామాల గురించి రాసుకుంటున్నాం.. ఇతర వికీలు అమెరికాలోని చిన్న టౌన్లు కౌంటీల గురించి పేజీలు చేర్చుకుంటున్నాయి. మన రావులపాలెం గురించి వ్యాసం అభివృద్ధి చెందే అవకాశము ఎక్కువనా? మిషిగన్ లోని కివినా కౌంటీ వ్యాసం అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువనా? ఎటుచూసినా దీర్ఘకాలికంగా అందరూ ఉపయోగించే గొప్పవికిపీడియాగా రూపొందేందుకు తెవికీకి పటిష్టమైన పౌండేషను ఉన్నది. --వైజాసత్య 15:14, 12 సెప్టెంబర్ 2007 (UTC)
మీరిద్దరూ చెప్పింది సమంజసంగానే ఉంది. అసలు డబ్బిచ్చి చేయడం ప్రాక్టికల్ కాదు. నేను కాస్త అతిగా ఆలోచించాను. విశ్వనాధ్ లాంటి పది మంది కలిస్తే ఈ వ్యాసాలకు వూపు తేగలరు - --కాసుబాబు 18:10, 12 సెప్టెంబర్ 2007 (UTC)

దక్షిణభారతదేశ వ్యాసం గురించి

దక్షిణభారతదేశ వ్యాసం అనువాదం చాలా భాగం పూర్తి చేశానండీ! కొన్ని కష్టమైన వాక్యాలు అనువాదం చెయ్యలేక పోయాను. అవి మీరు చూసి సరి చేస్తే ఆవ్యాసం పని అయిపోయినట్టే

రవిచంద్ర 04:21, 16 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]