వాయు పురాణము

వికీపీడియా నుండి
(వాయు పురాణం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

వాయు పురాణము, శైవ పురాణము, dedicated to వాయువు (the wind), ఇందులో 24,000 శ్లోకములు ఉన్నాయి. ఈ పురాణము నాలుగు (పాదములుగ విభజించబడింది.

  • ప్రక్రియ
  • ఉపోద్ఘాత
  • అనుసంగ
  • ఉపసంహర

బాణభట్టు తన రచనలైన కాదంబరి, హర్షచరిత్ర ఈ వాయు పురాణాన్ని గురించి ప్రస్తావించాడు. హర్ష చరిత్రలో ఈ గ్రంథం తన స్వగ్రామంలో తనకు చదివి వినిపించినట్లు చెప్పాడు.[1].

పర్షియన్ యాత్రికుడు అలె బెరూని కూడా తన రచనలో అష్టాదశ పురాణాల గురించి ప్రస్తావించాడు. అందులో వాయుపురాణం సా.శ. 600 కు పూర్వనుంచే అత్యంత పవిత్రమైన గ్రంథంగా లెక్కించబడేదని తెలియజేశాడు.[2].

ఈ పురాణంలో విశ్వం సృష్టి, పునఃసృష్టి, కాలాన్ని లెక్కించడం, అగ్ని, వరుణాది దేవతల మూలాల్ని, అత్రి, భృగు, అంగీరసాది ఋషుల వంశ మూలాలు, వారి వారసులు, దైత్యులు, రాక్షసులు, గంధర్వులు, పితృదేవతలు మొదలగు వారి మూలాలు, పశుపక్ష్యాదుల, పలు రాజ వంశీకుల వంశ వృ‍క్షాలు మొదలైన వాటిని గురించి వివరించబడి ఉంది.

మూలాలు

[మార్చు]
  1. Hazra, R.C. (1962). The Puranas in S. Radhakrishnan ed. The Cultural Heritage of India, Vol.II, Calcutta: The Ramakrishna Mission Institute of Culture, ISBN 81-85843-03-1, pp.253-5
  2. Indian Empire Archived 2010-03-04 at the Wayback Machine The Imperial Gazetteer of India, v. 2, p. 272.